Nithin About Pawan Kalyan : 2020లో 'భీష్మ' సినిమాతో హిట్ అందుకున్నారు టాలీవుడ్ హీరో నితిన్. ఆ తర్వాతి ఏడాది చేసిన మూడు సినిమాలు బాక్సాఫీసు మందు హిట్ టాక్ తెచ్చుకోలేక పోయాయి. ఇక 2022లో 'మాచర్ల నియోజక వర్గం' అనే చిత్రం కూడా అభిమానులను మెప్పించలేక పోయింది. ఈ ఏడాది 'ఎక్స్‌ట్రా ఆర్డినరీ మేన్' సినిమాతో తన అదృష్టాన్ని పరీక్షించుకునేందుకు సిద్ధం అయ్యారు నితిన్. ఈ చిత్రం విడుదలకు రెడీగా ఉన్న నేపథ్యంలో నితిన్ ప్రమోషన్లలో బిజీగా అయిపోయారు. ఈ సందర్భంగా ఓ ఇంటర్వ్యూలో మాట్లాడిన నితిన్.. పవర్ స్టార్ పవన్ కల్యాణ్ గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
తన సినిమాల్లో పవన్ కల్యాణ్ మేనరిజాన్ని ఎక్కువగా చూపిస్తున్నానంటూ కొందరు కామెంట్స్ చేస్తున్నారని నితిన్ తెలిపారు. కానీ తనకంటే ఎక్కువ మంది హీరోలు వారి చిత్రాల్లో పవన్ కల్యాణ్ ఇమేజ్ను చూపిస్తున్నారని చెప్పారు. ''ఎక్స్‌ట్రా - ఆర్డినరీ మేన్'లో ఒక సీన్‌లో భాగంగా పవన్ కల్యాన్లా డ్రెస్ వేసుకుని రెడీ అయ్యాను. అంతేగానీ ఫొటోషూట్ కోసం అలా చేయలేదు. నేను హీరోనైనా వపన్కల్యాణ్కు మాత్రం అభిమానినే. నేను ఎప్పుడూ ఇదే మాట చెబుతాను. నేను ఎలాంటి సినిమా నేపథ్యం లేకుండా ఇండస్ట్రీలోకి వచ్చాను' అని నితిన్ చెప్పారు.
Extraordinary Man Release Date : ఇక 'ఎక్స్‌ట్రా - ఆర్డినరీ మేన్' సినిమా విషయానికొస్తే.. నితిన్ హీరోగా వక్కంతం వంశీ ఈ సినిమాను తెరకెక్కించారు. సుధాకర్ రెడ్డి, నికితా రెడ్డి సంయుక్తంగా నిర్మించారు. నితిన్ సరసన యంగ్ బ్యూటీ శ్రీలీల ఆడిపాడింది. చిత్రీకరణ చివరి దర్శలో ఉన్న సినిమా.. ప్రస్తుతం శంషాబాద్‌లో వేసిన భారీ సెట్‌లో 300మందికి పైగా విదేశీడ్యాన్సర్లతో ఓ పాటను తెరకెక్కిస్తున్నారు. హ్యారిస్ జయరాజ్ సంగీతం అందిస్తున్న ఈ సినిమా డిసెంబరు 8న ఈ చిత్రం థియేటర్లలో విడుదల కానుంది. అయితే ఈ చిత్రం ఆద్యంతం వినోదాత్మకంగా సాగుతుందని గతంలో ఓ సందర్భంలో చిత్ర బృందం తెలిపింది.
- " class="align-text-top noRightClick twitterSection" data="">
వెయ్యి కోట్లకుపై బడ్జెట్‌తో ప్రభాస్, ఎన్టీఆర్ సినిమాలు! - పాన్ఇండియా రేస్‌లో మనోళ్లదే హవా!
'కాంతార చాప్టర్ 1' టీజర్ ఔట్ - ప్రీక్వెల్తో బాక్సాఫీస్ రికార్డులు బద్దలు!