ETV Bharat / entertainment

'దళపతి 67'లో స్టార్ డైరెక్టర్​.. 'పొన్నియిన్ సెల్వెన్​ 2' రిలీజ్ డేట్​ ఫిక్స్​

కొత్త మూవీ అప్డేట్స్​ వచ్చాయి. 'పొన్నియిన్ సెల్వెన్​ 2' రిలీజ్ డేట్​ను ప్రకటించారు మేకర్స్​. అలాగే విజయ్ 'దళపతి 67' సినిమాలో ఓ స్టార్ డైరెక్టర్​ నటించనున్నట్లు అధికార ప్రకటన వచ్చింది.

ponniyin selvan 2 release date
ponniyin selvan 2 release date
author img

By

Published : Dec 28, 2022, 6:03 PM IST

లోకేశ్‌ కనగరాజ్‌-విజయ్‌ కాంబోలో రానున్న 'దళపతి 67'(వర్కింగ్‌ టైటిల్‌) సినిమాలో ప్రముఖ దర్శకుడు, నటుడు గౌతమ్‌ మేనన్‌ భాగం కానున్నట్టు అధికారికంగా వెల్లడించారు. ఇటీవల ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న గౌతమ్​ ఈ విషయాన్ని ధ్రువీకరించారు. "గతకొన్ని రోజులుగా నేను విజయ్‌ సినిమాలో నటిస్తున్నానంటూ వార్తలు వస్తున్నాయి. అవి వాస్తవాలే. నేను 'దళపతి 67' సినిమాలో విజయ్‌తో కలిసి స్క్రీన్‌ పంచుకోనున్నాను. త్వరలోనే ఈ సినిమాకు సంబంధించిన పూర్తి వివరాలు ప్రకటిస్తారు" అని చెప్పారు. ప్రస్తుతం ఈ వార్త సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతోంది. గౌతమ్‌ మేనన్‌ ఏ పాత్రలో కనిపిస్తారో అని ఫ్యాన్స్‌ ఎదురుచూస్తున్నారు.

గ్యాంగ్‌స్టర్‌ నేపథ్యంలో రూపొందుతున్న ఈ సినిమాలో ఐదుగురు ప్రతినాయకులు ఉంటారని కోలీవుడ్‌ మీడియాలో వార్తలు వస్తున్నాయి. వారిలో ఒకరు సంజయ్‌ దత్‌ అని కూడా అంటున్నారు. అయితే ఈ విషయాన్ని అధికారికంగా ప్రకటించలేదు. ఇక ప్రస్తుతం విజయ్‌ వంశీపైడిపల్లి దర్శకత్వంలో 'వారిసు' చిత్రంలో నటిస్తున్నారు. దిల్‌రాజు నిర్మిస్తున్న ఈ సినిమా తెలుగులో 'వారసుడు' పేరుతో రానుంది. సంక్రాంతి కానుకగా జనవరి 12న ధియేటర్లలో సందడి చేయనుంది.

పొన్నియిన్ సెల్వెన్​-2 అప్పుడే...
మణిరత్నం దర్శకత్వంలో తెరకెక్కిన హిస్టారికల్‌ ఎపిక్‌ యాక్షన్‌ డ్రామా పొన్నియిన్‌ సెల్వన్‌. రెండు భాగాలుగా వస్తున్న ఈ చిత్ర తొలి భాగం ఈ ఏడాది ప్రేక్షకుల ముందుకు వచ్చి, మంచి విజయాన్ని అందుకుంది. బాక్సాఫీస్‌ వద్ద ఏకంగా రూ.500 కోట్లకు పైగా వసూళ్లను రాబట్టింది. ఇప్పుడు చిత్ర బృందం 'పొన్నియిన్‌ సెల్వన్‌-2' గురించి ఆసక్తికర అప్‌డేట్‌ను పంచుకుంది. రెండో భాగం 2023 ఏప్రిల్‌ 28న ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నట్లు తెలిపింది.

ఈ విషయాన్ని తెలియజేస్తూ వీడియోను షేర్ చేసింది. ఇందులో ఆదిత్య కరికాలన్‌ (విక్రమ్‌), పొన్నియిన్‌సెల్వన్‌ (జయం రవి), వందియదేవన్‌ (కార్తి), నందిని (ఐశ్వర్యరాయ్‌ బచ్చన్‌) పాత్రలను చూపించారు. రెండో భాగంలో వీరి పాత్రలే కీలకం కానున్నట్లు తెలుస్తోంది.విక్రమ్‌, ఐశ్వర్యరాయ్‌ బచ్చన్‌, జయం రవి, కార్తి, త్రిష ఇలా భారీ తారాగణం నటించిన 'పొన్నియిన్‌ సెల్వన్‌' తొలి భాగంలో చాలా ప్రశ్నలకు సమాధానం చెప్పలేదు.

సుంద‌ర చోళుడి (ప్రకాశ్‌రాజ్‌)ని త‌ప్పించి మ‌ధురాంత‌కుడి (రెహమాన్‌)ని చ‌క్రవ‌ర్తిని చేయాలనుకున్న పళవేట్టురాయర్‌ (శరతకుమార్‌) కుట్ర భగ్నమైందా? పొన్నియిన్ సెల్వన్‌ (జయం రవి)ను ఖైదు చేసిన తర్వాత చోటు చేసుకున్న పరిణామాలేంటి? నందిని (ఐశ్వర్యా రాయ్‌) ఎవ‌రు? ఆమెకు, పొన్నియిన్ సెల్వన్‌కీ, ఆదిత్య క‌రికాల‌న్‌ (విక్రమ్‌)కీ ఉన్న సంబంధం ఏంటి? కుందవై (త్రిష) ఎలాంటి రాజనీతిజ్ఞత ఉపయోగించింది? తన మిత్రుడికి కోసం వందియదేవన్‌ (కార్తి) ఎలాంటి సాహసం చేశాడు? అనే విషయాలను రెండో భాగంలో మణిరత్నం చూపించనున్నారు. ఏఆర్‌ రెహమాన్‌ సంగీతం అందించిన ఈ చిత్రాన్ని లైకా ప్రొడక్షన్స్‌ నిర్మిస్తోంది.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.