New National Crush Tripti Dimri : తెలుగు దర్శకుడు సందీప్ రెడ్డి వంగ తెరకెక్కించిన 'యానిమల్' సినిమా బాక్సాఫీసు ముందు దూసుకెళ్తోంది. ఈ మూవీలో రణ్‌బీర్ కపూర్, రష్మిక మందన్న లీడ్ రోల్స్‌లో అదరగొట్టారు. ఈ క్రమంలో చిత్రంలో కామియో రోల్ చేసిన ఓ అందాల నటి ఇప్పుడు అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. స్క్రీన్ టైమ్ తక్కువ ఉన్నప్పటికీ తన అందం, అభినయంతో నెట్టింట్లో ట్రెండ్ అవుతోంది. ఎవరీ ముద్దుగుమ్మ అంటూ కుర్రకారు సోషల్ మిడియాలో తెగ వెతికేస్తున్నారు.
దేశవ్యాప్తంగా కుర్రాళ్లు మనసు పారేసుకున్న ఆ బ్యూటీ పేరు తృప్తి డిమ్రి. యానిమల్‌తో ఒక్కసారిగా ఫేమస్ అయ్యింది. తాజాగా ఈ ముద్దుగుమ్మ గురించి మరో వార్త వైరల్ అవుతోంది. రష్మికను వెనక్కు నెట్టి ఈ అమ్మడు కొత్త నేషనల్‌క్రష్ అయిందట. ఈ మేరకు సోషల్ మీడియాలో ఈ అమ్మడు అభిమానులు సరదాగా పోస్టులు పెడుతున్నారు.
-
Crush updated 🥰😍💜#TriptiDimri #TriptiiDimri #AnimalMovie #AnimalPark #Animal @Portalcoin $Portal pic.twitter.com/jWR404GGjN
— 𝙈𝙧_𝙆𝙝𝙖𝙧𝙖𝙡 (@Mr_Kharal5) December 3, 2023 " class="align-text-top noRightClick twitterSection" data="
">Crush updated 🥰😍💜#TriptiDimri #TriptiiDimri #AnimalMovie #AnimalPark #Animal @Portalcoin $Portal pic.twitter.com/jWR404GGjN
— 𝙈𝙧_𝙆𝙝𝙖𝙧𝙖𝙡 (@Mr_Kharal5) December 3, 2023Crush updated 🥰😍💜#TriptiDimri #TriptiiDimri #AnimalMovie #AnimalPark #Animal @Portalcoin $Portal pic.twitter.com/jWR404GGjN
— 𝙈𝙧_𝙆𝙝𝙖𝙧𝙖𝙡 (@Mr_Kharal5) December 3, 2023
-
#TriptiDimri stole the show 🥵 pic.twitter.com/IEbv4ckVMz
— Sia⋆ (@siappaa_) December 4, 2023 " class="align-text-top noRightClick twitterSection" data="
">#TriptiDimri stole the show 🥵 pic.twitter.com/IEbv4ckVMz
— Sia⋆ (@siappaa_) December 4, 2023#TriptiDimri stole the show 🥵 pic.twitter.com/IEbv4ckVMz
— Sia⋆ (@siappaa_) December 4, 2023
ఒక్కసారిగా పెరిగిన ఫాలోవర్లు!
Tripti Dimri Instagram Followers : ఒక్క సినిమాలో ఇద్దరి ముద్దుగుమ్మల లైఫ్‌లు ఛేంజ్ అయ్యాయని సరదాగా పోస్ట్ చేస్తున్నారు ఫ్యాన్స్. దీంతో పాటు తృప్తి డిమ్రికి వరుస ఆఫర్లు కూడా వస్తున్నట్లు సమాచారం. ఇక యానిమల్ తర్వాత తృప్తి డిమ్రి ఇన్‌స్టా ఫాలోవర్స్ భారీగా పెరిగారు. ఈ చిత్రం తర్వాత తృప్తి ఇన్‌స్టా ఫాలోవర్స్ చూసి నెటిజన్లు ఆశ్యర్చపోతున్నారు. నవంబర్ చివరి వారంలో ఆమెకు 6లక్షల మంది ఫాలోవర్స్ ఉండగా ప్రస్తుతం ఆ సంఖ్య 30 లక్షలకు చేరింది. ఇక 2015లో తృప్తి ఇన్‌స్టాలోకి అడుగుపెట్టారు. అప్పటి నుంచి సామాజిక మాధ్యమాల్లో యాక్టివ్‌గా ఉంటూ తన సినిమా విశేషాలతో పాటు రీల్స్‌తోనూ ఆమె సందడి చేస్తున్నారు. ప్రస్తుతం ఆమె పోస్ట్‌లు అన్నింటికి లక్షల్లో వ్యూస్ వస్తున్నాయి.
Tripti Dimri Animal Movie : ఈ యానిమల్ సినిమాలో తృప్తి ఓ శృంగార సన్నివేశం చేసింది. దాని గురించి ఈ ముద్దుగుమ్మ ఇటీవల మాట్లాడిన మాటలు తాజాగా వైరల్ అయ్యాయి. ఆ సన్నివేశం మూవీకి అవసరం కాబట్టే నటించడానికి అంగీకరించినట్లు చెప్పారు. దాన్ని షూట్ చేసే సమయంలోనూ దర్శకుడు చాలా జాగ్రత్తలు తీసుకున్నట్లు తెలిపారు. అతి తక్కువ మంది సమక్షంలో దాన్ని షూట్ చేసినట్లు త్రిప్తి వెల్లడించారు.
ప్రపంచంలోనే టాప్ 10 రిచెస్ట్ యాక్టర్లు వీరే- భారత్ నుంచి ఎవరు ఉన్నారంటే?
మెగాస్టార్ చిరంజీవితో యాక్షన్ సినిమా చేస్తా : 'యానిమల్' డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా