ETV Bharat / entertainment

జైల్లో బాలకృష్ణ న్యూఇయర్​ సెలెబ్రేషన్స్.. 'NBK 108' నుంచి కీలక అప్డేట్​ - NBK 108 team has wrapped up the First schedule

నటసింహం నందమూరి బాలకృష్ణ నటిస్తున్న NBK 108 సినిమా నుంచి క్రేజీ అప్టేట్​ వచ్చింది. ఈ మేరకు చిత్ర నిర్మాణ సంస్థ వివరాలు వెల్లడించింది. దానికి సంబంధించిన ఫొటోలు కూడా విడుదల చేసింది.

NBK 108 update
NBK 108 update
author img

By

Published : Dec 31, 2022, 6:53 PM IST

నటసింహం నందమూరి బాలకృష్ణ వెండితెరపై వెలుగుతూనే.. బుల్లి తెరపై సందడి చేస్తున్నారు. వరుస సినిమాలతో దూసుకెళ్తున్నారు. తాజాగా బాలకృష్ణ కొత్త ప్రాజెక్టు గురించి అప్డేట్​ వచ్చింది. అనిల్​ రావిపూడి కలయికలో ఓ సినిమా వస్తోంది. ఈ మూవీ NBK108 అనే వర్కింగ్​ టైటిల్​తో తెరకెక్కుతోంది. ఈ సినిమా మొదటి షెడ్యూల్​ను ముగించుకుంది. ఈ మేరకు జైలు సెట్​లో యాక్షన్​ సీక్వెన్స్​ షూటింగ్​ ముగించుకున్నట్లు చిత్ర బృందం సోషల్​ మీడియా వేదికగా తెలిపింది. ఈ సందర్భంగా సెట్​లో చిత్ర యూనిట్​తో కలిసి కొత్త సంవత్సర వేడుకల్లో పాల్గొన్నారు బాలయ్య. ఇందుకు సంబంధించి చిత్ర నిర్మాణ సంస్థ శైన్ స్క్రీన్స్​ సోషల్​ మీడియాలో ఫొటోలు విడుదల చేసింది.

NBK 108 update
ఎన్​బీకే 108

ఈ సినిమాకు హరీష్​ పెద్ది, సాహు గారపాటి నిర్మాతలుగా వ్యవహరిస్తున్నారు. తమన్​ ఎస్​ సంగీతం సమకూరుస్తున్నారు. నటసింహం నటిస్తున్న ఈ సినిమా మాస్​ యాక్షన్​ ఎంటర్​టైనర్​గా రూపొందుతోంది. ​ఈ సినిమా జూన్​ 2023లో విడుదల అయ్యే అవకాశాలున్నాయి. కాగా, బాలకృష్ణ మాస్​ మూవీ వీరసింహారెడ్డి విడుదలకు సిద్ధంగా ఉంది. ఈ సినిమాకు గోపీచంద్‌ మలినేని దర్శకత్వం వహించారు. మైత్రీ మూవీ మేకర్స్‌ పతాకంపై తెరకెక్కుతున్న ఈ సినిమాలో బాలకృష్ణ సరసన శ్రుతిహాసన్‌ అలరించనుంది. సంక్రాంతికి కానుకగా జనవరి 12న ప్రేక్షకుల ముందుకు రానున్న ఈ సినిమాపై అభిమానులు భారీగా అంచనాలు పెట్టుకున్నారు. మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్‌‌‌‌‌‌‌‌పై నవీన్ యెర్నేని, వై.రవిశంకర్ నిర్మించిన ఈ చిత్రానికి తమన్ సంగీతం అందించారు. ఇప్పటికే ఈ సినిమాలోని పాటలు విడుదలై అభిమానులను ఉర్రూతలూగిస్తున్నాయి.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.