ETV Bharat / entertainment

నయన్​-విఘ్నేశ్​ వెడ్డింగ్​ ప్రోమో.. రష్మికతో చైతూ రొమాన్స్​! - నయనతార విఘ్నేశ్​ శివన్​ వెడ్డింగ్​

Nayanthara Vignesh Shivan Wedding Promo: ప్రేమ నుంచి పెళ్లిదాకా నయనతార- విఘ్నేశ్​ శివన్​ బంధంపై తెరకెక్కించిన డాక్యుమెంటరీ ప్రోమో విడుదల చేసింది నెట్​ఫ్లిక్స్​. మరోవైపు.. నాగచైతన్య-పరశురామ్​ కాంబినేషన్​లో వస్తున్న మూవీలో రష్మిక హీరోయిన్​గా ఖరారైనట్లు తెలుస్తోంది.

nayanthara vignesh shivan wedding promo.

author img

By

Published : Aug 9, 2022, 10:00 PM IST

Nayanthara Vignesh Shivan Wedding Promo: అందం, అభినయంతో ప్రేక్షకులను ఆకట్టుకొని దక్షిణాది లేడీ సూపర్​స్టార్​గా గుర్తింపు పొందిన నటి నయనతార. దాదాపు 20 ఏళ్ల సుదీర్ఘ కెరీర్​ ఉన్న నయన్​.. ఇండస్ట్రీలో తనకంటూ ప్రత్యేక స్థానం సంపాదించుకుంది. ఈ ఏడాది నయన్​కు చాలా ప్రత్యేకమనే చెప్పాలి. తన ప్రియుడు, డైరెక్టర్​ విఘ్నేశ్​ శివన్​ను పెళ్లాడింది. ఈ నేపథ్యంలో అభిమానులకు ఓ గుడ్​న్యూస్​. వీరి లవ్​స్టోరీపై డాక్యుమెంటరీని తీసిన నెట్​ఫ్లిక్స్​ సంబంధిత ప్రోమోను విడుదల చేసింది. ఇందులో నయన్​, విఘ్నేశ్​ తమ ప్రేమను చాటుకున్నారు. త్వరలోనే ఓటీటీ 'నెట్​ఫ్లిక్స్​'లో స్ట్రీమింగ్​ కానుంది. ప్రేమ నుంచి పెళ్లిదాకా నయన్​-విఘ్నేశ్​ల బంధంపైన తెరకెక్కించిన ఈ డాక్యుమెంటరీ అందరినీ ఆకట్టుకుంటుందని చెప్పుకొచ్చింది నెట్​ఫ్లిక్స్​.

nayanthara vignesh shivan wedding promo
నయనతార- విఘ్నేశ్​ శివన్​

చాలాకాలం పాటు ప్రేమాయణం సాగించిన ఈ జోడీ 2022 జూన్​ 9న మహాబలిపురంలోని ఓ రిసార్టులో పెళ్లి చేసుకుని.. వివాహ బంధంలోకి అడుగుపెట్టింది. ఈ వేడుకలకు సంబంధించిన ఫొటోలు, వీడియోలపై సర్వహక్కులను భారీ మొత్తంలో వెచ్చించి దక్కించుకుంది నెట్​ఫ్లిక్స్​. పెళ్లి ఏర్పాట్లకు కూడా నెట్​ఫ్లిక్స్​ యాజమాన్యమే డబ్బు ఖర్చు చేసినట్లు తెలుస్తోంది. ఈ వేడుకకు షారుక్​ ఖాన్, రజనీకాంత్, ఏఆర్​ రహమాన్​ సహా పలువురు ప్రముఖులు హాజరయ్యారు.

nayanthara vignesh shivan wedding promo
పెళ్లిలో నయనతార- విఘ్నేశ్​ శివన్​

చైతూతో రష్మిక..? నాగచైతన్య కథానాయకుడిగా పరుశురామ్‌ ఓ చిత్రాన్ని తెరకెక్కించనున్నారు. ఇప్పటికే స్క్రిప్ట్‌ వర్క్‌ పూర్తి కాగా, త్వరలోనే సెట్స్‌పైకి తీసుకెళ్లేందుకు సన్నాహాలు చేస్తున్నారు. మరోవైపు ఈ చిత్రంలో కథానాయిక కోసం అన్వేషిస్తున్నారు. ఈ క్రమంలో రష్మిక పేరు బలంగా వినిపిస్తోంది. అయితే, రష్మికకు పరుశురామ్‌ కథ వినిపించారా? లేదా? అన్నది స్పష్టత లేదు. గతంలో పరుశురామ్‌ దర్శకత్వంలో వచ్చిన 'గీతగోవిందం'లో రష్మిక సందడి చేసింది. ఇప్పుడు నాగచైతన్య పక్కన రష్మిక ఓకే అయితే, తొలిసారి వీరిద్దరూ కలిసి నటిస్తున్న చిత్రం ఇదే అవుతుంది. ఈ కొత్త జంటపై స్పష్టత రావాలంటే ఇంకొన్ని రోజులు వేచి చూడాల్సిందే.

Naga Chaitanya to Romance Rashmika Mandanna
నాగచైతన్య- రష్మిక

ప్రస్తుతం చైతూ 'లాల్‌ సింగ్‌ చద్దా' ప్రమోషన్స్‌లో బిజీగా ఉన్నారు. ఆమిర్‌ ఖాన్‌ కీలక పాత్రలో తెరకెక్కిన ఈ చిత్రంతో చైతన్య బాలీవుడ్‌ ఎంట్రీ ఇస్తున్నారు. అమెరికన్‌ క్లాసిక్‌ 'ఫారెస్ట్‌గంప్‌'కు రీమేక్‌గా ఇది రూపొందింది. మరోవైపు విక్రమ్‌ కె కుమార్‌ దర్శకత్వంలో 'దూత' అనే వెబ్‌సిరీస్‌లో చైతూ నటిస్తున్నారు. పార్వతి తిరువోతు, ప్రియా భవానీ శంకర్‌, ప్రాచీ దేశాయ్‌, తరుణ్‌ భాస్కర్‌ కీలక పాత్రలు పోషిస్తున్నారు.

రవితేజ కుటుంబం నుంచి మరో హీరో.. కథానాయకుడు రవితేజ కుటుంబం నుంచి మరో వ్యక్తి హీరోగా రాబోతున్నాడు. రవితేజ సోదరుడు రఘు కుమారుడు మాధవ్‌ భూపతిరాజు త్వరలోనే వెండితెరపై సందడి చేయనున్నారు. అతడిని హీరోగా పరిచయం చేస్తూ ప్రముఖ నిర్మాత నల్లమలుపు శ్రీనివాస్ (బుజ్జి) ఓ ప్రేమకథా చిత్రం తెరకెక్కిస్తున్నారు. భవ్య సమర్పణలో లక్ష్మీ నరసింహా ప్రొడక్షన్స్ పతాకంపై రూపొందిస్తున్న ఆ చిత్రానికి 'ఏయ్.. పిల్లా' అనే టైటిల్ ఖరారు చేశారు. మరో విశేషం ఏంటంటే, మిస్ ఇండియా ఫస్ట్ రన్నరప్ రూబల్ షికావత్ ఇందులో కథానాయిక. సెప్టెంబర్ నుంచి 'ఏయ్.. పిల్లా' సెట్స్ మీదకు వెళ్ళనుంది. ప్రేక్షకుల హృదయాలకు హత్తుకునే విధంగా, 90వ దశకం నేపథ్యంలో చిత్రాన్ని తెరకెక్కిస్తున్నామని నిర్మాత నల్లమలుపు శ్రీనివాస్ తెలిపారు.

EY PILLA MOVIE
ఏయ్​ పిల్లా సినిమాలో రవితేజ సోదరుడు రఘు కుమారుడు

ఇవీ చూడండి: 'లైగర్'​ ప్రమోషన్స్​​ జర్నీ.. బాప్​​రే విజయ్​ దేవరకొండ క్రేజ్​.. యూత్​కు పూనకాలే!

దూసుకుపోతున్న 'బింబిసార-సీతారామం' కలెక్షన్స్​.. ఎంతంటే?

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.