ETV Bharat / entertainment

స్టార్ హీరోకు కోర్టులో ఊరట.. మైనర్​పై వేధింపుల కేసులో క్లీన్​చిట్ - నవాజుజుద్దీన్ సిద్ధిఖీ న్యూస్

Nawazuddin Siddiqui molestation case: మైనర్​పై వేధింపుల కేసులో ప్రముఖ నటుడు నవాజుద్దీన్ సిద్ధిఖీకి కోర్టులో క్లీన్​చిట్ లభించింది. ఈ కేసుపై విచారణ జరిపిన న్యాయస్థానం.. ఈ మేరకు తీర్పు చెప్పింది.

Siddiqui molestation case
Siddiqui molestation case
author img

By

Published : Apr 28, 2022, 5:20 PM IST

Nawazuddin Siddiqui molestation case: బాలీవుడ్ నటుడు నవాజుద్దీన్ సిద్ధిఖీకి కోర్టులో ఊరట లభించింది. వేధింపులకు పాల్పడ్డారనే కేసులో నవాజుద్దీన్​తో పాటు అతడి నలుగురు కుటుంబ సభ్యులకు క్లీన్ చిట్ ఇచ్చింది.

ఓ మైనర్​ను వేధించారని 2012లో నవాజుద్దీన్​పై కేసు నమోదైంది. అతడి తల్లి మెహర్​ఉన్నీసా, సోదరులు మినాజుద్దీన్, ఫయాజుద్దీన్, అయాజుద్దీన్​.. నవాజుద్దీన్​కు సహకరించారని ఆరోపణలు వచ్చాయి. ముంబయిలోని వెర్సోవా పోలీస్ స్టేషన్​లో ఈ విషయంపై కేసు నమోదైంది. అనంతరం బుధానా స్టేషన్​కు బదిలీ అయింది. దీనిపై విచారణ చేపట్టిన పోక్సో ప్రత్యేక న్యాయస్థానం తాజాగా తీర్పు వెలువరించింది. అభియోగాలు ఎదుర్కొంటున్న అందరిని నిర్దోషులుగా తేల్చింది. కేసును మూసివేసి, నివేదిక సమర్పించాలని న్యాయమూర్తి సంజీవ్ కుమార్ తివారీ.. పోలీసులను ఆదేశించారు.

ఇదీ చదవండి:

జవాన్ పెళ్లి కోసం స్పెషల్​ హెలికాప్టర్.. దటీజ్​ ఇండియన్ ఆర్మీ!

5-12 ఏళ్ల చిన్నారులకు కరోనా టీకాలు.. ఎప్పుడంటే?

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.