ETV Bharat / entertainment

Naveen Polishetty Sreeleela : నవీన్ పోలిశెట్టి.. శ్రీలీల సంగతేంటో?.. ఏమైనా అప్డేట్​ ఉంటుందా? - Naveen polishetty latest movie updates

Naveen Polishetty Sreeleela : నవీన్ పోలిశెట్టి తాజాగా తన కొత్త సినిమాల గురించి చెప్పారు. కానీ ఆయన గతంలో అట్టహాసంగా వీడియో రిలీజ్ చేస్తూ అనౌన్స్​ చేసిన మూవీ గురించి మాత్రం క్లారిటీ ఇవ్వలేదు. ఇందులో శ్రీలీల హీరోయిన్. మరి ఈ సినిమా పరిస్థితేంటో?

Naveen Polishetty Sreeleela : నవీన్ పోలిశెట్టి - శ్రీలీల కథ ఇక మొదలవుతుందా?

author img

By ETV Bharat Telugu Team

Published : Sep 23, 2023, 10:00 AM IST

Naveen Polishetty Sreeleela Movie : నవీన్ పోలిశెట్టి.. ఆన్ స్క్రీన్ లేదా ఆఫ్ స్క్రీన్​లో కామెడీ చేస్తూ నవ్వులు పూయిస్తుంటాడు. ఏజెంట్ సాయి శ్రీనివాస ఆత్రేయ, జాతిరత్నాలు వంటి చిత్రాలతో విజయాలనందుకున్న ఆయన ఆ తర్వాత రీసెంట్​గా మిస్ శెట్టి మిస్టర్ పొలిశెట్టితో హ్యాట్రిక్​ సక్సెస్​ అందుకున్నారు. తన కొత్త సినిమాలను త్వరలోనే పట్టాలెక్కించనున్నారు.

ప్రస్తుతం మిస్​ శెట్టి సక్సెస్​తో ఫుల్​​ జోష్​లో ఉన్న ఆయన ఎప్పుడో 2012లోనే సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చారు. 2019లో ఏజెంట్ సాయి శ్రీనివాస ఆత్రేయ చిత్రంతో హీరోగా మారారు. ఆ తర్వాత అదే ఏడాది హిందీ చిత్రం ఛిచోరేలోనూ నటించి ఆకట్టుకున్నారు. ఆ తర్వాత రెండేళ్ల పాటు గ్యాప్ ఇచ్చిన ఆయన జాతిరత్నాలుతో బిగ్గెస్ట్​ సక్సెస్​ ఖాతాలో వేసుకున్నారు. అనంతరం మళ్లీ రెండేళ్ల పాటు విరామం తీసుకుని ఇప్పుడు మిస్ శెట్టితో ప్రేక్షకుల్ని అలరించారు. ఈ మూడు చిత్రాలు ఫన్ నేపథ్యంలో వచ్చి హిట్ అందుకోవడం విశేషం. ఇప్పుడు తాజా విజయంతో నవీన్​కు డిమాండ్ పెరిగే అవకాశం ఉంది.

తాజాగా నవీన్​ కూడా ప్రస్తుతం తన చేతిలో మరో మూడు చిత్రాలు ఉన్నట్లు తెలిపారు.వాటి స్క్పిప్ట్స్ లాక్ అయినట్లు పేర్కొన్నారు. వచ్చే ఏడాది ఈ మూడు చిత్రాలు ఒక్కొక్కటిగా సెట్స్ మీదకు వెళ్తాయని క్లారిటీ ఇచ్చారు. అన్నారు. హిందీలో రెండు మూడు కథలు విన్నట్లు కూడా చెప్పుకొచ్చారు. ఈ లాక్ అయిన స్క్రిప్ట్ల్ లో ఒకటి మైత్రి మూవీస్ బ్యానర్​లో అని సదరు నిర్మాణ సంస్థ చేసిన ట్వీట్​తో అర్థమైపోయింది. ఆ మధ్యలో షైన్ స్క్రీన్​తో పాటు నిర్మాత దిల్ రాజుతో ఓ సినిమా, జాతిరత్నాలు డైరెక్టర్​ అనుదీప్​తోనూ సినిమాలు ఉంటాయని ప్రచారం సాగింది. అంటే వచ్చే ఏడాది నవీన్ మరింత బిజీగా మారనున్నారు.

అయితే నవీన్​.. కొత్త సినిమాలకు ఓకే చెబుతున్నారు కానీ.. జాతిరత్నాలు సమయంలో ఓ వీడియో విడుదల చేసి మరీ 'అనగనగా ఒక రాజు' అనౌన్స్ చేశారు. సితార ఎంటర్టైన్మెంట్స్​పై తెరకెక్కాల్సిన ఈ చిత్రం ఊసే లేదు. ఈ చిత్రం ఆగిపోయిందని కూడా ఆ మధ్య వార్తలు వచ్చాయి. తాజా ఇంటర్వ్యూలోనూ నవీన్ ఈ విషయం గురించి స్పష్టత ఇవ్వలేదు. దీంతో ఈ చిత్రం మళ్లీ మొదలవుతుందా లేదా అనే ఆసక్తి అందరిలో నెలకొంది. ఇందులో హీరోయిన్​గా శ్రీలీల నటించాల్సింది. ధ‌మాకా కన్నా ముందు శ్రీలీల ఒప్పకున్న చిత్రమిది. ఈ కామెడీ సినిమాకు క‌ళ్యాణ్ శంక‌ర్ ద‌ర్శ‌క‌త్వం వ‌హించాల్సింది. మరి ఈ సినిమా అసలు మొదలవుతుందో లేదో? ఒకవేళ షురూ అయితే శ్రీలీల నటిస్తుందో లేదో చూడాలి..

  • " class="align-text-top noRightClick twitterSection" data="">

Miss Shetty Mr Polishetty Review : సినిమాపై మెగాస్టార్​ చిరంజీవి ట్విట్టర్​ రివ్యూ.. ఏమని పోస్ట్ చేశారంటే?

Miss Shetty MR Polishetty Box Office Collection : ఓవర్సీస్​లో కాసుల వర్షం​.. ఆ మార్క్​కు చేరువలో!

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.