Nara Rohit Prathinidi 2 : నారా వారి ఫ్యాన్స్ నిరీక్షణకు తెరపడింది. ఎన్నో రోజుల నుంచి ఆసక్తిగా ఎదురుచూస్తున్న అభిమానులకు అదిరిపోయే అప్డేట్ వచ్చింది. టాలీవుడ్ యంగ్ హీరో నారా రోహిత్ తన కొత్త సినిమా గురించి క్లారిటీ ఇచ్చేశారు.
సూపర్ కంటెంట్‌తో 2014లో పొలిటికల్ థ్రిల్లర్ 'ప్రతినిధి' సంచలన విజయం సాధించింది. అయితే ఈ సినిమాకు సీక్వెల్ గా 'ప్రతినిధి 2'తో నారా రోహిత్ ప్రేక్షకుల ముందుకు రాబోతున్నట్లు మూవీ మేకర్స్ క్లారిటీ ఇచ్చారు. ఈ విషయాన్ని తెలియజేస్తూ ఓ కొత్త పోస్టర్ ను రిలీజ్ చేశారు. 'ఒక వ్యక్తి అన్ని అసమానతలకు వ్యతిరేకంగా నిలబడతాడు' అని క్యాప్షన్ రాసుకొచ్చారు'.
-
He is back as Prathinidhi Once again! 🔥
— Vanara Entertainments (@VanaraEnts) July 24, 2023 " class="align-text-top noRightClick twitterSection" data="
The Script Master @IamRohithNara’s #Prathinidhi2 First Look is here.
Jan 25th, 2024 Release💥
Directed by @murthyscribe 🎬
A @SagarMahati Musical 🎹@Nchamidisetty @TSAnjaneyulu1 @actorkumarraza @VanaraEnts #Pratinidhi2 #HBDNaraRohith pic.twitter.com/Bl4WuLgXqd
">He is back as Prathinidhi Once again! 🔥
— Vanara Entertainments (@VanaraEnts) July 24, 2023
The Script Master @IamRohithNara’s #Prathinidhi2 First Look is here.
Jan 25th, 2024 Release💥
Directed by @murthyscribe 🎬
A @SagarMahati Musical 🎹@Nchamidisetty @TSAnjaneyulu1 @actorkumarraza @VanaraEnts #Pratinidhi2 #HBDNaraRohith pic.twitter.com/Bl4WuLgXqdHe is back as Prathinidhi Once again! 🔥
— Vanara Entertainments (@VanaraEnts) July 24, 2023
The Script Master @IamRohithNara’s #Prathinidhi2 First Look is here.
Jan 25th, 2024 Release💥
Directed by @murthyscribe 🎬
A @SagarMahati Musical 🎹@Nchamidisetty @TSAnjaneyulu1 @actorkumarraza @VanaraEnts #Pratinidhi2 #HBDNaraRohith pic.twitter.com/Bl4WuLgXqd
గతంలో 'ప్రతినిధి' మంచి కథ, గ్రిప్పింగ్ కథనంతో విమర్శకుల నుంచి సైతం ప్రశంసలను అందుకుంది. ఈ చిత్రంలో హీరో రోహిత్ ముఖ్యమంత్రిని కిడ్నాప్ చేసే ఓ బాధ్యతాయుతమైన యువకుడి పాత్రలో కనిపించి ఆకట్టుకున్నారు. అయితే ఈ చిత్రానికి ప్రశాంత్ మండవ దర్శకత్వం వహించారు. కాగా సోమవారం తాజాగా విడుదలైన పోస్టర్‌ను చూస్తుంటే.. మళ్లీ ఆ సినిమా రోజులు గుర్తొస్తున్నాయని అంటున్నారు నారా వారి ఫ్యాన్స్.
ఇక పోస్టర్లో హీరో నారా రోహిత్ చేయి పైకెత్తి కనిపిస్తున్నారు. తాను ప్రశ్నించేందుకు సిద్ధంగా ఉన్నట్టు కనిపించారు. ఇంకా ఆయన తల పైభాగం నుంచి శరీరం మొత్తం వార్తాపత్రికలతో కప్పిఉన్నట్లుగా చూపించారు. అంటే ఈ చిత్రం పక్కాగా సామాజిక అంశం ఇతివృత్తంగా ఉండనున్నట్లు తెలుస్తోంది.
Nara Rohit Prathinidi 2 Director : ఈ చిత్రానికి ప్రముఖ జర్నలిస్ట్ మూర్తి దర్శకత్వం వహించనుండటం మరో విశేషం. వానరా ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్‌పై.. కుమారరాజా బత్తుల, ఆంజనేయులు శ్రీ తోట, కొండకళ్ల రాజేందర్ రెడ్డి సినిమాను నిర్మిస్తున్నారు. మహతి స్వర సాగర్ సంగీతం అందించగా.. నాని చమిడిశెట్టి సినిమాటోగ్రాఫీ బాధ్యతలు చూస్తున్నారు. రవితేజ గిరిజాల ఈ సినిమాకు ఎడిటర్‌గా వ్యవహరిస్తున్నారు. కిరణ్ కుమార్ మన్నె ఆర్ట్ డైరెక్టర్. కాగా ఈ సినిమా వచ్చే ఏడాది జనవరి 25న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది.