ETV Bharat / entertainment

ఇంట్రెస్టింట్​గా నారా రోహిత్​ 'ప్రతినిధి 2' కాన్సెప్ట్​ టీజర్​ - ప్రతినిధి 2 సినిమా కాన్సెప్ట్​ టీజర్​

Nara Rohit Prathinidi 2 : చాలా గ్యాప్ తర్వాత రానున్న నారా రోహిత్ తన కొత్త సినిమా కాన్సెప్ట్ టీజర్​ను రిలీజ్ చేశారు. ఇది ఆద్యంతం ఆకట్టుకునేలా ఉంది.

NARA ROHIT PRATHINIDHI POSTER
ఇంట్రెస్టింట్​గా నారా రోహిత్​ 'ప్రతినిధి 2' కాన్సెప్ట్​ టీజర్​
author img

By

Published : Jul 26, 2023, 12:10 PM IST

Nara Rohit Prathinidi 2 : నారా రోహిత్​... చాలా ఏళ్ల తర్వాత ఇటీవలే తన కొత్త సినిమా 'ప్రతినిధి 2' ప్రకటించి అందరిలో ఆసక్తిని రేకెత్తించిన సంగతి తెలిసిందే. ఈ సినిమాకు సంబంధించి రోజుకో అప్డేట్ వస్తోంది. తాజాగా.. నేడు(జులై 26) రోహిత్ పుట్టినరోజు సందర్భంగా .. సినిమా కాన్సెప్ట్​ టీజర్​ను రిలీజ్ చేసింది మూవీటీమ్​.

ఈ వీడియో బ్లాక్ కలర్ బ్యాక్ గ్రౌండ్ విజువల్స్​తో సాగింది. వార్తాపత్రికలను బాగా హైలైట్ చేస్తూ చూపించారు. ఆ వార్తా పత్రికల్లో ఓట్లు మాయం, యువత రావాలి, హింస పెరిగిపోతోంది వంటి హెడ్​ లైన్స్​ను మరింత హైలైట్​ చేసి చూపించడం కనిపిస్తోంది. అలానే ఓ ప్రభుత్వ కార్యాలయంలో బాంబ్ బ్లాస్​ జరిగి పేలిపోవడం.. దాని వెనకే.. వేల మంది జనం గూమిగుడి ఉన్న ఓ రాజకీయ సభ ఒకటి జరుగుతున్నట్లు చూపించారు. సమాజంలో జరిగే అసమానతలను ఎదుర్కొనేందుకు ఒక్కడు నిలబడతాడు అంటూ మళ్లీ ఫస్ట్ లుక్​ పోస్టర్​ బాగా లార్జ్​ సైజ్​లో చూపించి ఆకట్టుకున్నారు. బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ కూడా ఇంట్రెస్టింగ్​గా సాగింది. మొత్తంగా ఈ టీజర్​ చూస్తుంటే ఇది ఓ ఇంట్రెస్టింగ్ పొలిటికల్‌ థ్రిల్లర్​గా సినిమా రాబోతుందని అర్థమవుతోంది.

Nara Rohit Prathinidi 2 Director : ఈ చిత్రానికి ప్రముఖ జర్నలిస్ట్ మూర్తి దర్శకత్వం వహించనున్నారు. వానరా ఎంటర్​టైన్​మెంట్స్​ బ్యానర్‌పై.. కుమారరాజా బత్తుల, ఆంజనేయులు శ్రీ తోట, కొండకళ్ల రాజేందర్ రెడ్డి సినిమాను నిర్మిస్తున్నారు. మహతి స్వర సాగర్ సంగీతం అందిస్తున్నారు. నాని చమిడిశెట్టి సినిమాటోగ్రాఫీ అందిస్తున్నారు. రవితేజ గిరిజాల ఎడిటర్ బాధ్యతలు చూసుకోబోతున్నారు. కిరణ్ కుమార్ మన్నె ఆర్ట్ డైరెక్టర్​గా వ్యవహరించనున్నారు. సినిమా వచ్చే ఏడాది జనవరి 25న వరల్డ్​ వైడ్​గా గ్రాండ్​గా రిలీజ్​ కానుంది. ఇకపోతే గతంలో నారా రోహిత్ హీరోగా నటించిన ప్రతినిధికి సీక్వెల్​గా ఇది రానుంది. అప్పట్లో మొదటి భాగం సెన్సేషనల్​ హిట్​గా నిలిచి ఆడియెన్స్​ను బాగానే ఆకట్టుకుంది.

  • " class="align-text-top noRightClick twitterSection" data="">

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.