Keeravani son new movie: 'మత్తువదలరా' చిత్రంతో హీరోగా ఎంట్రీ ఇచ్చాడు శ్రీ సింహా. ప్రముఖ సంగీత దర్శకుడు కీరవాణి తనయుడిగా వెండితెరకు పరిచయమైనా.. మంచి నటనతో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నాడు. ఈ యంగ్ హీరో తాజా చిత్రం 'ఉస్తాద్'. ఈ సినిమాకు సంబంధించిన పూజా కార్యక్రమం ఘనంగా జరిగింది. హైదరాబాద్‌లోని రామానాయుడు స్టూడియోలో జరిగిన ఈ కార్యక్రమానికి కీరవాణి, శ్రీవల్లి, నిర్మాత సాయి కొర్రపాటి తదితరులు హాజరయ్యారు. వారాహి చలన చిత్రం, కృషి ఎంటర్‌టైన్‌మెంట్ పతాకాలపై రజనీ కొర్రపాటి, రాకేశ్ రెడ్డి గడ్డం, హిమాంక్ రెడ్డి దువ్వూరి ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ఫణిదీప్ దర్శకత్వంలో వస్తున్న ఈ చిత్రానికి అకీవా.బి సంగీత దర్శకత్వం వహిస్తున్నారు. న్యూ ఏజ్ డ్రామాగా రూపొందుతున్న ఈ సినిమాకు సంబంధించిన పూర్తి వివరాలు త్వరలోనే వెల్లడిస్తామని చిత్రబృందం తెలిపింది.
Mahesh babu son: సూపర్ స్టార్ మహేశ్ బాబు పుత్రోత్సాహంలో ఉన్నారు. ఆయన కుమారుడు గౌతమ్ పదో తరగతి పూర్తి చేశాడు. అబ్బాయికి ఎన్ని మార్కులు వచ్చాయనేది చెప్పలేదు. కానీ, కుమారుడిని చూసి తాము గర్వపడుతున్నట్టు మహేశ్ బాబు, ఆయన సతీమణి నమ్రత పోస్టులు చేశారు. ''జర్మనీలో గౌతమ్ ఘట్టమనేని హై స్కూల్ గ్రాడ్యుయేషన్ సెలబ్రేట్ చేస్తున్నాం. గౌతమ్‌ను చూస్తే గర్వంగా ఉంది'' అని మహేశ్ బాబు పేర్కొన్నారు.
- " class="align-text-top noRightClick twitterSection" data="
">
Nani antey sundaraniki movie: 'స్వాగతం అందమైన ప్రపంచానికి..' అంటూ నాని ప్రేక్షకులకు చక్కిలిగింతలు పుట్టిస్తున్నాడు. ఆయన హీరోగా వివేక్ ఆత్రేయ దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా ‘అంటే.. సుందరానికీ!’. ఈ సుందరం సరసన నజ్రియా ఫహద్ హీరోయిన్‌గా నటిస్తుంది. నవీన్ యెర్నేని, రవిశంకర్.వై నిర్మాతలు. హాస్య ప్రధానంగా సాగే కథతో రూపొందిన ఈ చిత్రం జూన్10న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సినిమాకు సంబంధించిన ఓ ప్రత్యేక వీడియోను చిత్రబృందం విడుదల చేసింది. షూటింగ్ సమయంలోని బ్లూపర్స్ చూసేవాళ్లకు సైతం నవ్వుతెప్పిస్తున్నాయి. ఆద్యంతం నవ్వులు పూయిస్తున్న ఈ వీడియోను మీరు చూసేయండి.
- " class="align-text-top noRightClick twitterSection" data="">
ఇదీ చూడండి: బాప్రే.. కళ్లు చెదిరే అందాలన్నీ కరణ్ బర్త్‌డే పార్టీలోనే!