ETV Bharat / entertainment

విజువల్​ వండర్​గా నాగార్జున 100వ సినిమా - నాగార్జున 100వ సినిమా

టాలీవుడ్‌లో సీనియర్​ హీరో నాగార్జున.. తన 100వ సినిమా గురించి ఇంట్రెస్టింగ్ అప్డేట్ ఇచ్చారు. ఏం చెప్పారంటే..

nagarjuna 100th movie
నాగార్జున 100వ సినిమా
author img

By

Published : Sep 19, 2022, 6:22 PM IST

గత మూడు దశాబ్దాలకు పైగా సినిమాల్లో నటిస్తూ ప్రేక్షకులను అలరిస్తున్న టాలీవుడ్‌లో సీనియర్​ హీరో నాగార్జున.. తన 100వ సినిమా గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఆ సినిమా కోసం గ్రాండ్‌గా ప్లాన్‌ చేస్తున్నట్లు చెప్పారు. ఈ ప్రాజెక్టు కోసం తను ఇద్దరు దర్శక-నిర్మాతలతో చర్చలు కూడా జరిపినట్లు తెలిపారు.

"నా 100వ సినిమా ఒక విజువల్‌ వండర్‌లా ఉండాలి. మరో 'బ్రహ్మాస్త్ర'లా ఉండాల్సిన అవసరం లేదు. కానీ అది ప్రేక్షకులను థియేటర్లకు వచ్చేలా చేయాలి. అలా అని ఎక్కువ గ్రాఫిక్స్‌ ఉండాలన్న నిబంధన లేదు. ప్రజలను సినిమా హాలుకు రప్పించడం అన్నింటికంటే గొప్ప విషయం. తాజాగా విడుదలైన 'సీతారామం' ఎంతో బాగుంది. అలాగే అమల నటించిన శర్వానంద్‌ సినిమా 'ఒకే ఒక జీవితం' కూడా మంచి విజయం సాధించింది" అన్నారు.

ప్రస్తుతం నాగార్జున ప్రవీణ్‌సత్తార్‌ దర్శకత్వంలో 'ది ఘోస్ట్‌'లో నటిస్తున్నారు. ఈ సినిమాలో నాగార్జున సరసన సోనాల్‌ చౌహాన్‌ నటిస్తోంది. ఇప్పటికే చిత్రీకరణ పూర్తిచేసుకున్న ఈ చిత్రం అక్టోబర్‌ 5న ప్రేక్షకుల ముందుకు రానుంది.

ఇదీ చూడండి: Sreemukhi: ఫ్యాషన్​ దుస్తుల్లో.. టెంపరేచర్​ పెంచేస్తూ..

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.