ETV Bharat / entertainment

పవన్​కల్యాణ్, కార్తిపై నాగార్జున కామెంట్స్​.. వారిద్దరూ అలాంటి వారంటూ..

హీరోలు పవన్‌ కల్యాణ్‌, పునీత్‌ రాజ్‌కుమార్‌, కార్తిపై కామెంట్స్​ చేశారు హీరో నాగార్జున. ఏమన్నారంటే..

nagarjuna comments on pawankalyan
పవన్​కల్యామ్​పై నాగార్జున కామెంట్స్​
author img

By

Published : Oct 19, 2022, 10:15 PM IST

Updated : Oct 19, 2022, 10:39 PM IST

తమిళ హీరో కార్తిపై ప్రశంసలు కురిపించారు హీరో నాగార్జున. తనకు కార్తికి మంచి అనుబంధం ఉందని చెప్పారు. పవన్‌ కల్యాణ్‌, పునీత్‌ రాజ్‌కుమార్‌, కార్తి.. ఈ ముగ్గురు తాను చూసిన అరుదైన నటులని అన్నారు. కార్తి హీరోగా దర్శకుడు పి.ఎస్‌. మిత్రన్‌ తెరకెక్కించిన 'సర్దార్‌' ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌లో ఈ వ్యాఖ్యలు చేశారు. రాశీఖన్నా, రజిషా విజయన్‌ కథానాయికలు. ఈ నెల 21న సినిమాను విడుదల చేయనున్న సందర్భంగా చిత్ర బృందం నాగార్జున ముఖ్య అతిథిగా వేడుక నిర్వహించింది.

''నాకూ కార్తికి మంచి అనుబంధం ఉంది. 'ఊపిరి' సినిమాలో మేం కలిసి నటించిన సంగతి తెలిసిందే. అన్నపూర్ణ స్టూడియోస్‌ సంస్థ సమర్పణలో 'సర్దార్‌' విడుదలవటం ఆనందంగా ఉంది. కార్తి అన్నయ్య సూర్య సూపర్‌స్టార్‌. అలాంటి స్టార్‌ నటుడి తమ్ముడి ఇమేజ్‌ నుంచి బయటకు వచ్చి తమని తాము నిరూపించుకోవటం అంత తేలికైన విషయం కాదు. అలాంటి వారు అరుదు. తెలుగులో చిరంజీవి తమ్ముడు పవన్‌ కల్యాణ్‌, కన్నడలో శివరాజ్‌కుమార్‌ తమ్ముడు పునీత్‌ రాజ్‌కుమార్‌, తమిళంలో కార్తి నేను చూసిన అరుదైన నటులు. పలు విభిన్న పాత్రలు పోషించి, సూర్యలా కార్తి కూడా సూపర్‌స్టార్‌ అయ్యాడు. పాటలూ పాడతాడు. తెలుగులో బాగా మాట్లాడతాడు. అందుకే కార్తిని తెలుగు వారు విశేషంగా అభిమానిస్తారు'' అని నాగార్జున అన్నారు. చిత్ర బృందానికి శుభాకాంక్షలు తెలిపారు.

కార్తి మాట్లాడుతూ.. ''నాగార్జున అన్నయ్య నాకు స్ఫూర్తి. 'మంచి వ్యక్తిగా ఉంటే గొప్ప నటుడుకావొచ్చు' అని ఆయన గతంలో ఓ ఇంటర్వ్యూలో చెప్పిన మాటను నేను ఫాలో అవుతున్నా. ఆయనపై ఉన్న ఇష్టంతోనే 'ఊపిరి' చిత్రంలో నటించా. ఆ సినిమా చిత్రీకరణ రోజులను ఎప్పటికీ మర్చిపోలేను. నటుడిగా నాగార్జున చేసిన రిస్క్‌ ఎవరూ చేయలేదనుకుంటున్నా. జయపజయాలను ఆయన పట్టించుకోరు. ఆయన నేర్చుకున్న ఎన్నో విషయాలను నాతో పంచుకున్నారు. 'సర్దార్' సినిమా నాకెంతో ప్రత్యేకం. సవాలుతో కూడిన పాత్రలు పోషించా. దర్శకుడు మిత్రన్‌ 'అభిమన్యుడు'లో డిజిటల్‌ క్రైమ్‌ గురించి చూపించినట్టే.. మనం తేలికగా తీసుకునే ఓ విషయాన్ని 'సర్దార్‌'లో చూపించబోతున్నారు'' అని కార్తి వివరించారు.

''గీతాంజలి'తో నాగార్జునగారికి అభిమానిగా మారా. ఆయన ఈ వేడుకకు రావటం సంతోషంగా ఉంది. నేను ఈ చిత్రంలో ఇందిరా అనే పాత్రలో కనిపిస్తా. ఈ సినిమాలో లవ్‌, కామెడీ, యాక్షన్‌.. ఇలా అన్ని అంశాలున్నాయి'' అని రజిషా తెలిపారు. ''గతంలో నేను నటించిన 'శివపుత్రుడు' సినిమా దీపావళికి విడుదలై ఘన విజయం అందుకుంది. ఇప్పుడు 'సర్దార్‌' అదే పండగకు రాబోతుంది'' అని లైలా ఆనందం వ్యక్తం చేశారు.

ఇదీ చూడండి: అందాల తారల హాట్​ షో ఏం అందాలురా బాబోయ్​ అనాల్సిందే

Last Updated : Oct 19, 2022, 10:39 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.