ETV Bharat / entertainment

చైతూ 'కస్టడీ'లోకి రూ.22కోట్లు.. వచ్చేనా? - నాగచైతన్య కస్టడీ రిలీజ్ డేట్​

అక్కినేని హీరో నాగచైతన్య కస్టడీ సినిమా మరో రోజులో(మే 11) విడుదల కానుంది. మరి ఈ సినిమాతో చైతూ ఎలాంటి రిజల్ట్​ను అందుకుంటారో?

Nagachaitanya custody
చైతూ 'కస్టడీ'లోకి రూ.22కోట్లు.. వచ్చేనా?
author img

By

Published : May 11, 2023, 12:39 PM IST

వరుస ఫ్లాప్​లతో సతమతమవుతున్న అక్కినేని నాగచైతన్య మరోసారి బాక్సాఫీస్ వార్​కు సిద్ధమయ్యారు. 'మజిలీ' తర్వాత లవ్​స్టోరీ, బంగార్రాజు చిత్రాలతో మీడియం రేంజ్​ హిట్​లను అందుకున్న ఆయన ఆ తర్వాత థ్యాంక్యూ, లాల్​ సింగ్​ చద్దాతో వరుసగా డిజాస్టర్​లను అందుకున్నారు. అయితే తెలుగులో చైతూ చివరగా నటించిన సినిమా 'థ్యాంక్యూ'. స్టార్ డైరెక్టర్ విక్రమ్ కుమార్, అగ్రనిర్మాత దిల్ రాజు కలిసి చేసిన ఈ సినిమా బాక్సీఫీస్​ వద్ద ఘోర పరాజయాన్ని అందుకుంది. సాధరణంగా చైతూ నటించిన క్లాస్​ సినిమాలు దాదాపుగా ఆడియెన్స్​ను బాగానే మెప్పించాయి. కానీ ఈ చిత్రం మాత్రం ప్రేక్షకులను ఆకట్టుకోలేకపోయింది.

దీంతో ఆయన ఈసారి కొంచెం మాస్ టచ్ ఉన్న.. యాక్షన్​ థ్రిల్లర్ కథతో బాక్సాఫీస్ ముందుకు రానున్నారు. తమిళంలో విలక్షణ కథలతో కమర్షియల్​ హిట్​లను అందుకున్న డైరెక్టర్​ వెంకట్ ప్రభుతో కలిసి 'కస్టడీ' సినిమాతో రాబోతున్నారు. ఈ చిత్రం మరో రోజులో(మే 12)న తెలుగు, తమిళంలో విడుదల కానుంది. ఇప్పటికే రిలీజైన ఈ సినిమా టీజర్, ట్రైలర్ కూడా బాగానే ఆకట్టుకున్నాయి. కానీ ఈ సినిమాపై భారీగా బజ్​ కనిపించడం లేదనిపిస్తోంది. అక్కినేని ఫ్యామిలీ నుంచి వరుస ఫ్లాప్​లు, చైతూ గత సినిమాల రిజల్ట్​ ప్రభావం.. 'కస్డడీ' అడ్వాన్స్ బుకింగ్స్​పై కాస్త పడినట్లే అనిపిస్తోంది. కొంచెం డల్​గానే ఉన్నట్లు కథనాలు వస్తున్నాయి. ఇక తమిళంలో పూర్తిగా వెంకట్ ప్రభు ఇమేజ్ మీదే ఈ సినిమా రిజల్ట్​ ఆధారపడనుంది. అయితే ఈ సినిమా ప్రీ రిలీజ్ బిజినెస్​.. రూ.22 కోట్ల వరకు జరిగిందని తెలిసింది. ఈ బ్రేక్ ఈవెన్​ టార్గెట్​ అంత పెద్దదేమీ కాదు కానీ.. చైతూ గత రెండు సినిమాల ట్రాక్ రికార్డ్​ దృష్ట్యా టార్గెట్ కాస్త పెద్దనే​ అని చెప్పాలి. ఏదేమైనప్పటికీ ఈ సినిమాకు మరీ ఎక్కువ ఓపెనింగ్స్​ను ఆశించే పరిస్థితి లేదు. కానీ ఫస్డ్​ డే పాజిటివ్ టాక్ వస్తే మాత్రం.. ఆ తర్వాత కలెక్షన్స్​ ఆటోమెటిక్​గా వచ్చేస్తాయి. చైతూ మళ్లీ ఫామ్​లోకి వచ్చినట్లు అవుతుంది. బ్రేక్ ఈవెన్​ టార్గెట్ పూర్తవొచ్చు. గత నెలలో సాయితేజ్​ 'విరూపాక్ష' కూడా తక్కువ బజ్‌తోనే రిలీజైనా.. ఫస్ట్​ డే పాజిటివ్ టాక్‌తో బాక్సాఫీస్ దగ్గర మంచి వసూళ్లను అందుకుంది. మరి అలాంటి మ్యాజిక్కే 'కస్టడీ' విషయంలో అవుతుందో లేదో చూడాలి. మరోవైపు గతవారంలో పోలీస్​ కథతో వచ్చిన అల్లరినరేశ్ 'ఉగ్రం' బాక్సాఫీస్​ వద్ద ఆశించిన స్థాయిలో వసూళ్లను అందుకోలేకపోయింది. మరి చైతూ పోలీస్​ కథైనా ఆడియెన్స్​ను మెప్పిస్తుందో లేదో. కాగా, ఈ సినిమా విషయానికొస్తే.. ఇందులో చైతూ కానిస్టేబుల్​గా నటించారు. కృతిశెట్టి హీరోయిన్​. అరవింద్ స్వామి విలన్​గా నటించారు. శరత్​కుమార్ కీలక పాత్ర పోషించారు. విలన్​ను కాపాడటమే హీరో లక్ష్యమని ఇప్పటికే నాగచైతన్య సినిమా కాన్సెప్ట్​ గురించి చెప్పేశారు.

  • " class="align-text-top noRightClick twitterSection" data="">

ఇదీ చూడండి: నరేశ్‌-పవిత్రల 'మళ్లీ పెళ్లి' ట్రైలర్‌ రిలీజ్.. చూశారా?

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.