బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్‌ఖాన్‌కు ముంబయి పోలీసులు మరింత భద్రత పెంచారు. ఆయనకు వై ప్లస్ భద్రతను కల్పించారు. ప్రముఖ పంజాబీ సింగర్ సిద్ధూ మూస్ వాలా హత్య కేసులో ప్రధాన నిందుతుడైన గ్యాంగ్‌స్టర్ లారెన్స్ బిష్ణోయ్ గ్యాంగ్ నుంచి గతంలో భాయ్‌కు బెదిరింపులు వచ్చిన నేపథ్యంలో మహారాష్ట్ర ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. భద్రతను మరింత పటిష్ఠం చేశారు. సల్మాన్ ఇంటి చుట్టూ అదనపు సెక్యురిటీ బలగాన్ని నియమించింది. భాయ్ ఎప్పుడు ఎక్కడికి వెళ్లినా ఈ సిబ్బంది ఆయన చుట్టూనే ఉంటారు.
కాగా, సిద్ధూ హత్య కేసులో గ్యాంగ్‌స్టర్ లారెన్స్ బిష్ణోయ్‌ను అదుపులోకి పోలీసులు విచారణ చేసిన సంగతి తెలిసిందే. అలాగే కృష్ణజింకల్ని ఆరాధించే లారెన్స్ బిష్ణోయ్.. కృష్ణజింకల కేసులో ఆరోపణలు ఎదుర్కొన్న సల్మాన్‌ఖాన్‌ని హత్య చేస్తానంటూ 2018లో కోర్టు ఆవరణలోనే ప్రకటించారు. ఈ మేరకు ఇప్పటికే ఓసారి సల్మాన్ హత్యకు ప్రణాళికలు రూపొందించినట్లు వార్తలు కూడా వచ్చాయి. అయితే సిద్ధూ హత్య అనంతరం అదే రీతిలో చంపేస్తామంటూ కొందరు ఆగంతకులు ఓ లేఖలో సల్మాన్ ఖాన్‌తోపాటు ఆయన తండ్రి సలీం ఖాన్‌ను బెదిరించారు. దీంతో ఈ బెదిరింపులను సీరియస్‌గా తీసుకున్న పోలీసులు దీనిపై ముమ్మర దర్యాప్తు చేపట్టారు. ఇందులో భాగంగానే ఆయనకు భద్రను ఏర్పాటు చేశారు. కాగా, ఇప్పుడు మళ్లీ ఆ భద్రతను మరింత పటిష్ఠం చేశారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఉండేందుకు సల్మాన్ ఇంటి వద్ద అదనపు సెక్యూరిటీని కూడా ఏర్పాటు చేశారు.
ఇదీ చూడండి: గౌతమ్ తిన్ననూరి సినిమాకు బ్రేక్.. క్లారిటీ ఇచ్చిన రామ్‌చరణ్