Telugu movies: 2022 అర్ధభాగం పూర్తయింది. పార్ట్-1లో పాన్ ఇండియా, అగ్ర కథానాయకుల సినిమాలు బాక్సాఫీస్ వద్ద సందడి చేశాయి. వేసవి హంగామా తగ్గి, చిరు జల్లుల సవ్వడి మొదలైంది. మరోవైపు స్కూళ్లు, కాలేజీలు తెరుచుకున్నాయి. ఈ క్రమంలో జులై మొదటి వారంలో సందడి చేసేందు సిద్ధమవుతున్న చిత్రాలేవో చూసేద్దామా!
యాక్షన్+ కామెడీ= పక్కా కమర్షియల్: గోపిచంద్ అంటే యాక్షన్ చిత్రాలకు కేరాఫ్ అడ్రస్. దర్శకుడు మారుతీది సెపరేట్ ట్రాక్. కుటుంబ కథలకు కామెడీ, కీలక పాత్రలకు ఏదో ఒక సమస్య పెట్టి సినిమాలను తెరకెక్కించి సక్సెస్ కొట్టడంలో సిద్ధహస్తులు. అలాంటి వీరి కాంబినేషన్‌లో వస్తున్న మూవీ 'పక్కా కమర్షియల్'. రాశీఖన్నా కథానాయిక. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ సినిమా జులై 1 థియేటర్‌లలో ప్రేక్షకుల ముందుకు రానుంది. గోపిచంద్ శైలికి తగినట్లు కథా, కథనాలను తీర్చిదిద్దినట్లు ప్రచార చిత్రాలను చూస్తే అర్థమవుతోంది.
'రాకెట్రీ: ది నంబీ ఎఫెక్ట్' చూపించబోతున్న మాధవన్: ప్రముఖ ఇస్రో శాస్త్రవేత్త నంబి నారాయణ్ జీవితం ఆధారంగా రూపొందిన చిత్రం 'రాకెట్రీ: ది నంబి ఎఫెక్ట్'. మాధవన్ ప్రధాన పాత్రలో నటిస్తూ స్వీయ దర్శకత్వంలో తెరకెక్కిస్తున్న పాన్ ఇండియా చిత్రమిది. సిమ్రన్ కథానాయిక. భారత అంతరిక్ష పరిశోధన రంగం అభివృద్ధిలో విశేష కృషి చేసిన వ్యక్తుల్లో ఒకరైన నంబి నారాయణన్ జీవితంలో ఎదురైన సంఘటనల సమాహారంగా ఈ చిత్రం తెరకెక్కింది. కెరీర్‌లో ఎన్నో ఎత్తు పల్లాలను చవిచూసిన ఆయన జీవితాన్ని మాధవన్ 'రాకెట్రీ'గా ఆవిష్కరిస్తున్నారు. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ సినిమా జులై 1న తమిళ, తెలుగు, హిందీ భాషల్లో ప్రేక్షకుల ముందుకు రానుంది. సూర్య, షారుఖ్‌లు అతిథి పాత్రల్లో నటించారు.
'ఏనుగు' కథ ఏంటి?: అరుణ్‌విజయ్, ప్రియభవానీ శంకర్ జంటగా నటించిన చిత్రం 'ఏనుగు'. 'సింగం' సినిమాల ఫేమ్ హరి దర్శకత్వం వహించారు. సీహెచ్ సతీష్‌కుమార్ నిర్మించారు. జులై 1న చిత్రం ప్రేక్షకుల ముందుకొస్తోంది. "సమాజంలో సమస్యల్ని స్పృశిస్తూనే వినోదం పంచే చిత్రమిది. ఇందులోని సందేశం ఆలోచింపజేస్తుంది. కుటుంబ విలువల్ని గొప్పగా ఆవిష్కరించే ఈ సినిమా... ఇంటిల్లిపాదీ కలిసి చూసేలా రూపొందింది. తెలుగు, తమిళ భాషల్లో ఒకేసారి విడుదల చేస్తున్నాం" అని చిత్ర బృందం చెబుతోంది.
యాంటీ ఏజింగ్ అంశంతో 'గంధర్వ': సందీప్ మాధవ్, గాయత్రి ఆర్.సురేష్ జంటగా నటించిన చిత్రం 'గంధర్వ'. అఫ్సర్ దర్శకుడు. సాయికుమార్, సురేష్, బాబు మోహన్ కీలక పాత్రలు పోషించారు. ఈ సినిమాని జులై 1న థియేటర్‌లలో ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నారు నిర్మాత సురేష్ కొండేటి. యాంటి ఏజింగ్ అనే ఓ విభిన్నమైన అంశంతో ఈ కథను తీర్చిదిద్దారు. వీటితో పాటు, '10 క్లాస్ డైరీస్', 'షికారు' తదితర చిత్రాలు కూడా ప్రేక్షకుల ముందుకు రానున్నాయి.
ఈ వారం ఓటీటీలో సందడి చేసే చిత్రాలు
థియేటర్‌లో మెప్పించలేదు.. ఓటీటీలో?
బాలీవుడ్ కథానాయిక కంగనా రనౌత్ కెరీర్‌లో అతి పెద్ద ఫ్లాప్ మూవీ 'ధాకడ్'. రజనీష్ ఘయ్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ యాక్షన్ మూవీ సగటు ప్రేక్షకుడిని మెప్పించటంలో విఫలమైంది. ఇప్పుడు జీ5 ఓటీటీలో జులై 1వ తేదీ నుంచి 'ధాకడ్' స్ట్రీమింగ్ కానుంది. అలాగే అక్షయ్ కుమార్ ప్రధాన పాత్రలో నటించిన 'సామ్రాట్ పృథ్వీరాజ్' కూడా అమెజాన్ ప్రైమ్ వేదికగా జులై 1 నుంచి అందుబాటులోకిరానుంది. చంద్ర ప్రకాశ్ ద్వివేది ఈ మూవీ దర్శకత్వం వహించారు.
దెయ్యాలు ఉన్నాయా?: ప్రపంచం మొత్తం డిజిటల్‌వైపు అడుగులు వేస్తోంది. మరి అదే డిజిటల్ రంగం అందరినీ భయపెడితే? లైవ్‌లో దెయ్యం అంటూ సైబర్ ప్రపంచం మొత్తం ఒక్కసారిగా ఉలిక్కిపడితే? ఇంతకీ దెయ్యాలు ఉన్నాయా? అసలు అలాంటి పరిణామాలకి దారితీసిన పరిస్థితులు ఎలాంటివో తెలియాలంటే మా 'అన్యాస్ ట్యుటోరియల్' చూడాల్సిందే అంటున్నారు శోభు యార్లగడ్డ. ఆయన ఆర్కా మీడియా పతాకంపై నిర్మించిన వెబ్ సిరీస్ ఇది. రెజీనా, నివేదితా సతీష్ ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు. జులై 1 నుంచి తెలుగు, తమిళంలో ఆహా ఓటీటీ వేదికలో ప్రసారం కానుంది.
ఓటీటీలో అలరించే మరికొన్ని చిత్రాలు/ వెబ్‌సిరీస్‌లు
అమెజాన్ ప్రైమ్
- ద టెర్మినల్ లిస్ట్ (తెలుగు డబ్బింగ్) జులై 1
నెట్‌ఫ్లిక్స్
- బ్లాస్టెడ్ (హాలీవుడ్) జూన్ 28
- స్ట్రేంజర్ థింగ్స్ 4 (వెబ్ సిరీస్) జులై 1
జీ 5
- షటప్ సోనా (హిందీ సిరీస్) జులై 1
ఎంక్స్ ప్లేయర్
- మియా బీవీ ఔర్ మర్డర్ (హిందీ) జులై 1
ఊట్
- డియర్ విక్రమ్ (కన్నడ ) జూన్30
డిస్నీ+హాట్‌స్టార్
- ఓన్లీ మర్డర్స్ ఇన్ ది బిల్డింగ్ సీజన్2 జూన్ 28
ఇదీ చూడండి: చిరంజీవి, ప్రభాస్‌తో సినిమా ఎలా ఉంటుందంటే..: మారుతి