ETV Bharat / entertainment

కోట్లలో పెట్టుబడులు పెడుతూ స్టార్టప్​ల బాటలో సినీ తారలు - అక్షయ్​ కుమార్​ వ్యాపారం

నటులు కెరీర్‌ ముగిశాక వ్యాపారంలోకి అడుగుపెట్టడం సహజమే కానీ ఇప్పటి తారలు మాత్రం దీపం ఉండగానే ఇల్లు చక్కబెట్టుకోవాలనుకుంటున్నారు. కెరీర్‌ పీక్‌లో ఉండగానే వ్యాపారాలు చేస్తున్నారు. కొందరు ఆ దశనూ దాటి వినూత్న ఆవిష్కరణలతో  మార్కెట్‌లోకి వస్తున్న స్టార్టప్‌లలో తమ సంపాదనను మదుపు చేస్తున్నారు. మరి అదెలాగనో తెలుసుకుందామా

movie-actor-and-actresses-startups-businesses

author img

By

Published : Aug 14, 2022, 9:52 AM IST

Cinema Actors Startups: సినీ రంగంలో అవకాశాలూ, విజయాలూ ఎప్పుడు ఎవరిని వరిస్తాయో చెప్పలేం. సంపాదనను సరిగా పొదుపూ, మదుపూ చేయకపోతే... ఎన్ని ఇబ్బందులు పడాలో కళ్లముందే కనిపించిన ఉదాహరణలెన్నో వీరి ఆలోచనల్ని మార్చాయి. అందుకే ఈతరం నటులు... చేతినిండా పని ఉన్నప్పుడే నాలుగు రూపాయల్ని వెనకేసుకోవాలనుకుంటున్నారు. సౌకర్యవంతమైన జీవనం జీవితాంతం సాగాలంటే డబ్బుల్ని ఎంత జాగ్రత్తగా వాడాలో తెలుసుకున్నారు.

అందుకే, ఇలా కెరీర్‌లోకి అడుగుపెడుతున్నారో లేదో వెంటనే తమదైన ఆర్థిక ప్రణాళికను అమలు చేసేస్తున్నారు. ఓ పక్క నటిస్తూనే... సొంత బ్రాండ్లను మార్కెట్లోకి తెచ్చి వ్యాపారాలను నిర్వహిస్తున్నారు. మరో పక్క నయా ఆవిష్కరణలతో, వినూత్న పరిష్కారాలతో ముందుకొస్తోన్న స్టార్టప్‌ల్లో పెట్టుబడులు పెడుతూ వాటికి ఊతమిస్తున్నారు, ఆదాయాన్నీ అందుకుంటున్నారు.

movie-actor-and-actresses-startups-businesses
సోనూసూద్​, విజయ్​ దేవరకొండ

కోట్లలో పెట్టుబడులు...
బాలీవుడ్‌ నుంచి టాలీవుడ్‌ వరకూ అందరిదీ ఇదే బాట. అయితే, ఇలా పెట్టుబడులు పెట్టడంలో బాలీవుడ్‌ నటి దీపికా పదుకొణెది అగ్రస్థానం. సౌందర్య ఉత్పత్తుల వ్యాపార సంస్థ పర్పుల్‌ డాట్‌కామ్‌లో మూడు కోట్లకు పైగానే పెట్టుబడి పెట్టింది దీపిక. అలానే... ఓ యోగర్ట్‌ తయారీ సంస్థలోనూ, ఎలక్ట్రిక్‌ ట్యాక్సీ కంపెనీ బ్లూస్మార్ట్‌, స్పేస్‌ టెక్‌ స్టార్టప్‌లైన బెల్లాట్రిక్స్‌, ఏరో స్పేస్‌తో పాటు నువా అనే వెల్‌నెస్‌ బ్రాండ్‌లలోనూ కోట్ల రూపాయల పెట్టుబడులు పెట్టింది.

ఇలా దీపిక మాత్రమే కాదు, కొవిడ్‌ కాలంలో ప్రజలకు సేవలందించి వార్తల్లో నిలిచిన హీరో, మన టాలీవుడ్‌ విలన్‌ సోనూసూద్‌ కూడా ఈ దారిలోనే నడుస్తున్నాడు. గ్రామీణుల ఆర్థిక స్వావలంబన కోసం కృషి చేస్తోన్న ఇన్‌ఫర్మేటిక్స్‌ ఎల్‌ఎల్‌పీ అనే రూరల్‌ ఫిన్‌టెక్‌ కంపెనీలో ఇప్పటికే కోట్ల రూపాయల్ని మదుపు చేశాడు. కొత్తగా ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్‌ సంస్థ అయిన ఎక్స్‌ప్లర్జర్‌లోనూ మదుపు చేసి వ్యాపార భాగస్వామిగా ఉన్నాడు.

వెంకటేశ్​, రానా

అభిరుచిని బట్టి...
టాలీవుడ్‌ విషయానికొస్తే.. వివిధ సంస్థల్లో పెట్టుబడులు పెట్టిన వారిలో రానా పేరు ప్రత్యేకంగా చెప్పుకోవాలి. మొదటి నుంచీ వ్యాపారమంటే ప్రత్యేక ఆసక్తి ఉన్న ఇతడు సినిమాల్లోకి రాక ముందే 'వీఎఫ్‌ఎక్స్‌' అనే సంస్థను నిర్వహించేవాడు. తర్వాత క్వాన్‌ ఎంటర్‌టైన్‌మెంట్స్‌, యాంట్‌హిల్‌ వెంచర్స్‌, అమరచిత్ర కథ వంటి సంస్థల్లోనూ పెట్టుబడులు పెట్టాడు. ప్రస్తుతం మెటావర్స్‌ టెక్నాలజీ సంస్థ ఐకాన్జ్‌కు భాగస్వామిగా వ్యవ హరిస్తున్నాడు. మరో పక్క నటుడిగానూ విలక్షణమైన పాత్రలు చేస్తూ మన్ననలు అందుకుంటున్నాడు. నటన, సేవ, వ్యవసాయం, వ్యాపారం... ఏదైనా సరే అన్నిటా తనదైన ముద్ర వేస్తోంది సమంత. తాజాగా పర్యావరణహిత ఉత్పత్తులను అమ్మే సస్టైన్‌ కార్ట్‌లో పెట్టుబడులు పెట్టి వారితో జతకట్టింది.

రకుల్​ ప్రీత్​ సింగ్​, సమంత

ఇక, ఇప్పటికే నటి రకుల్‌ జిమ్‌ల ఏర్పాటుతో వ్యాపారంలోకి అడుగుపెట్టింది. తాజాగా డబ్ల్యూ అనే న్యూట్రిషన్‌ అండ్‌ వెల్‌నెస్‌ స్టార్టప్‌కూ వెన్నుదన్నుగా నిలుస్తోంది. వీరేకాదు... యువతరాన్ని ఫాలో అవుతూ సీనియర్‌ నటుడు విక్టరీ వెంకటేష్‌ ఎలక్ట్రిక్‌ వాహనాల స్టార్టప్‌ అయిన 'బైక్‌వో' సంస్థలో ఇన్వెస్ట్‌ చేయడంతోపాటు దానికి బ్రాండ్‌ అంబాసిడర్‌గానూ పని చేస్తున్నారు. రౌడీయూ పేరుతో దుస్తుల బ్రాండ్‌ తీసుకొచ్చిన విజయ్‌ దేవరకొండ కూడా మరో ఈవీ స్టార్టప్‌ వాట్స్‌ వోల్ట్స్‌లో మదుపు చేశాడు. వీళ్లేకాదు, కాజల్‌, మలైకా అరోరా, శిల్పాశెట్టి... వంటి వారెందరో ఇన్వెస్టర్లుగా మారిపోయారు. పెట్టుబడి మాత్రమే పెట్టి వ్యాపారంలో ఉండే శ్రమా, ఒత్తిడీ లేకుండా తారలు ఆదాయం పొందుతుంటే... మరో పక్క తక్కువ సమయంలోనే ఎక్కువ ప్రచారం పొందిన స్టార్టప్‌లూ లాభపడుతున్నాయి. ఉభయ తారకం అంటే ఇదే కదూ!

ఇవీ చదవండి: దృశ్యం సిరీస్​లో చివరి సినిమా పోస్టర్ రిలీజ్​

షారుక్​ ఖాన్​కు ప్రతినాయకుడిగా విజయ్ సేతుపతి

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.