Mokshagna Latest Pics in Bhagavanth Kesari Sets : నందమూరి నట సింహం బాలకృష్ణ వారసుడు మోక్షజ్ఞ సిల్వర్ స్క్రీన్ ఎంట్రీ కోసం.. నందమూరి అభిమానులతో పాటు టాలీవుడ్ ఫిల్మ్ ఇండస్ట్రీ మొత్తం వెయ్యి కళ్లతో ఎదురు చూస్తోంది. ఎప్పుడెప్పుడు అతడు ఇండస్ట్రీలోకి అడుగుపెడతాడా..? అని ఎంతో ఆశగా ఉన్నారు. కానీ, అది మాత్రం ఇప్పటి వరకు జరగలేదు. అయితే గత కొద్ది రోజులుగా మోక్షజ్ఞకు సంబంధించిన లుక్స్, ఫొటోస్ సోషల్‌మీడియాలో ట్రెండ్ అవుతున్న సంగతి తెలిసిందే.
ఈ మధ్యలో మోక్షజ్ఞ కాస్త స్లిమ్‌గా మారడం, ఆ మధ్య నందమూరి సుహాసిని కొడుకు పెళ్లిలో ఎన్టీఆర్‌తో కలిసి సందడి చేయడం.. అలా ఆ ఫొటోస్ అన్నీ బయటకు వచ్చాయి. అయితే ఇప్పుడు మరోసారి నెట్టింట్లో మోక్షజ్ఞ హాట్‌టాపిక్‌గా మారారు. తాజాగా ఆయన బాలకృష్ణ నటిస్తున్న భగవంత్ కేసరి సెట్స్‌ను సందర్శించారు. దర్శకుడు అనిల్‌రావిపూడి, శ్రీలీల, కొరియోగ్రాఫర్ శేఖర్ మాస్టర్‌తో కలిసి ముచ్చటిస్తూ కనిపించారు.
ఈ పిక్స్‌లో మోక్షజ్ఞ ముఖంలో తేజస్సు బాగా కనపడుతోంది! గాగుల్స్ పెట్టుకొని స్టైలిష్‌గా కనిపిస్తున్నాడు. ఈ ఫొటోస్ ప్రస్తుతం సోషల్‌మీడియాలో ఫుల్ ట్రెండ్ అవుతున్నాయి. ఇది చూసిన అభిమానులు మోక్షజ్ఞ లుక్ మెస్మరైజింగ్‌గా ఉంది, ఓ యంగ్ హీరోకు ఉండాల్సిన లక్షణాలు అన్ని నందమూరి నటవారసుడులో కనిపిస్తున్నాయి, పులి బయటకొచ్చింది, సింహం యాటకొచ్చే సమయం వచ్చినట్టుంది అంటూ కామెంట్లు పెడుతున్నారు.
-
He's coming 🔥💥
— Rakhi_NBK_Official 🔰 (@RakhiNbk) August 28, 2023 " class="align-text-top noRightClick twitterSection" data="
Nata simham ❌
Yuva simham ✅🦁🤙 #Mokshagna #BhagavanthKesari#NandamuriBalakrishna #Balayya pic.twitter.com/BtWRv1IpKi
">He's coming 🔥💥
— Rakhi_NBK_Official 🔰 (@RakhiNbk) August 28, 2023
Nata simham ❌
Yuva simham ✅🦁🤙 #Mokshagna #BhagavanthKesari#NandamuriBalakrishna #Balayya pic.twitter.com/BtWRv1IpKiHe's coming 🔥💥
— Rakhi_NBK_Official 🔰 (@RakhiNbk) August 28, 2023
Nata simham ❌
Yuva simham ✅🦁🤙 #Mokshagna #BhagavanthKesari#NandamuriBalakrishna #Balayya pic.twitter.com/BtWRv1IpKi
కాగా, మోక్షజ్ఞ(mokshagna first movie director) ఎంట్రీ విషయంలో గత కొంతకాలంగా చాలా దర్శకుల పేర్లు వినిపిస్తున్నాయి. ఓ సందర్భంలో తానే దర్శకుడిగా మోక్షజ్ఞ సినిమా ఉండొచ్చని బాలయ్య అన్నట్టు వార్తలు కూడా వచ్చాయి. ఆ తర్వాత పలువురు దర్శకుల పేర్లు కూడా వినిపించాయి. మొదట మాస్ దర్శకుడు బోయపాటి వినిపించగా.. ఆ తర్వాత ఫన్ డైరెక్టర్ అనిల్ రావిపూడి, రా అండ్ రస్టిక్ శ్రీకాంత్ ఓదెల పేర్లు ప్రచారంలోకి వచ్చాయి. చూడాలి మరి నందమూరి బాలయ్య నట వారసుడు మోక్షజ్ఞ టాలీవుడ్ ఎంట్రీ ఎప్పుడు ఉంటుందో? ఎవరితో ఉంటుందో అనేది.