ETV Bharat / entertainment

లైగర్ గురించి మైక్ టైసన్ అప్పుడే మర్చిపోయారా, వైరల్ అవుతున్న వీడియో - మైక్ టైసన్ ఇంట్రర్వ్యూ

Mike Tyson Liger Movie విజయ్ దేవరకొండ హీరోగా పూరి జగన్నాథ్ దర్శకత్వంలో వచ్చిన లైగర్​ సినిమాలో బాక్సింగ్ దిగ్గజం మైక్ టైసన్ నటించారు. అయితే, ఈ చిత్రం గురించి అతడిని అడగగా, సినిమా గురించి మరిచిపోయినట్లు మాట్లాడారు. ఇందుకు సంబంధించిన ఓ వీడియో వైరల్ అవుతోంది.

mike tyson liger movie
మైక్ టైసన్ మూవీ
author img

By

Published : Aug 27, 2022, 9:22 PM IST

Mike Tyson Liger Movie: మైక్‌టైసన్‌ పరిచయం అక్కర్లేని పేరు. విజయ్‌ దేవరకొండ కథానాయకుడిగా పూరి జగన్నాథ్‌ దర్శకత్వంలో వచ్చిన 'లైగర్‌'లో అతిథి పాత్రలో మెరిశారు. మిక్స్‌డ్‌ మార్షల్‌ ఆర్ట్స్‌ మూవీ కావడంతో 'లైగర్‌'కు అదనపు ఆకర్షణ తీసుకొచ్చేందుకు చిత్ర బృందం టైసన్‌ను ఇందులో నటింపజేసింది. అయితే, తాను ఈ చిత్రంలో నటించిన విషయమే టైసన్‌ గుర్తులేదా?

ఓ పాడ్‌కాస్ట్‌ వీడియోలో స్నేహితులతో కలిసి మాట్లాడుతుండగా.. 'లైగర్‌లో మీ పాత్ర ఏంటి?' అని టైసన్‌ను అడగడం వల్ల ఆయన కాస్త తికమక పడ్డారు. అలాంటి చిత్రంలో నటించిన విషయమే ఆయనకు గుర్తుకు రాలేదు. 'ఏదీ మళ్లీ ఒకసారి చెప్పు' అన్నారు. వెంటనే ఆయన స్నేహితులు గూగుల్‌లో సెర్చ్‌ చేసి చూపించి 'బాక్సింగ్‌ లెజెండ్‌ మైక్‌ టైసన్‌ ఇండియన్‌ స్పోర్ట్స్‌ యాక్షన్‌ ఫిల్మ్‌ లైగర్‌లో నటిస్తున్నారు' అంటూ చదివి వినిపించారు. ఆ తర్వాత ఆ చర్చ 'లైగర్‌' జంతువు వైపు మళ్లింది. 'మీరు లైగర్‌తో పోటీ పడ్డారా' అని అడగ్గా.. 'లేదు' అని టైసన్‌ సమాధానం ఇచ్చారు. 'దానికి ఎదురుపడితే రెండు సెకన్లలో చంపేస్తుంది' అని అన్నారు. ఈ చర్చ మధ్యలోనే 'లైగర్‌' ట్రైలర్‌ గురించి వెతగ్గా.. ఫ్యాన్‌మేడ్‌ ట్రైలర్‌ కనిపించింది. అలా 2021లో రికార్డు చేసిన ఈ వీడియో ఇప్పుడు సోషల్‌మీడియాలో వైరల్‌ అవుతోంది.

ఈ సినిమాలో మైక్‌టైసన్‌ను నటింపజేసేందుకు చాలా కష్టపడినట్లు చిత్ర బృందం ప్రచార కార్యక్రమాల్లో తెలిపింది. ఏడాది పాటు శ్రమించిన తర్వాత బాక్సింగ్‌ లెజెండ్‌ నటించేందుకు అంగీకరించారని దర్శకుడు పూరి జగన్నాథ్‌ తెలిపారు.

  • " class="align-text-top noRightClick twitterSection" data="">

లాల్‌సింగ్‌ చడ్డాను బీట్‌ చేయని లైగర్‌:
గురువారం ప్రేక్షకుల ముందుకు వచ్చిన 'లైగర్‌' బాక్సాఫీస్‌ వద్ద ఆశించిన విజయాన్ని అందుకోలేకపోయిన సంగతి తెలిసిందే. విజయ్‌ నటన, యాక్షన్‌ బాగున్నా మిగిలిన విషయాల్లో పూరి మార్కు కనిపించలేదు. ఇక ఐఎండీబీ రేటింగ్‌లోనూ 'లైగర్‌' తక్కువ రేటింగ్‌ దక్కించుకుంది. ఇప్పటివరకూ ఈ చిత్రానికి 1.8 రేటింగ్‌ రాగా.. లాల్‌ సింగ్‌ చడ్డా (5), రక్షాబంధన్‌ (4.6), దొబారా (2.9) షంషేరా (4.9)లను కూడా దాటలేకపోయింది.

ఇవీ చదవండి: ఘనంగా కమెడియన్​ ఆలీ కూతురు నిశ్చితార్థం, వీడియో చూశారా

భవదీయుడు భగత్​ సింగ్​పై డైరెక్టర్ అదిరే అప్డేట్, ట్విట్టర్​లో పవన్ రికార్డు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.