మెగాస్టార్ చిరంజీవి- అందాల భామ శ్రియ కాంబినేషన్లో తెరకెక్కిన ఠాగూర్ సినిమా ఎంతో పెద్ద హిట్ సాధించిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఆ సినిమాలోని పాటలు.. ఇప్పటికీ సోషల్‌మీడియాలో ఫుల్ ట్రెండింగ్‌లో ఉంటాయి. అలా ఆ సినిమాకు, పాటలకు సినీ ప్రియులు అంతగా కనెక్ట్ అయిపోయారు. ఇప్పుడు మరోసారి ఈ జోడీ.. వెండితెరపై ఆడిపాడనుందట.
చిరంజీవి ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా ఉన్నారు. ఆయన భోళాశంకర్ సినిమా షూటింగ్లో బిజీ బిజీగా గడుపుతున్నారు. తమిళంలో సూపర్ హిట్ సాధించిన వేదాళంకు రీమేక్‌గా భోళాశంకర్ తెరకెక్కుతోంది. మెహర్ రమేశ్ దర్శకత్వం వహిస్తున్నారు. అయితే ఈ సినిమాకు సంబంధించి ఓ వార్త నెట్టింట తెగ వైరలవుతోంది.
సీనియర్ హీరోయిన్.. శ్రియతో కలిసి మెగాస్టార్ మరోసారి డ్యాన్స్ చేయనున్నారట. భోళాశంకర్ సినిమాలో ఓ స్పెషల్ సాంగ్ కోసం మేకర్స్ శ్రియను సంప్రదించారట. అందుకు ఆమె కూడా ఓకే చెప్పారట. దీంతో వీరిద్దరి డ్యాన్స్‌ను మరోసారి తెరపై చూసేందుకు మెగా అభిమానులు ఎదురుచూస్తున్నారు. ఇప్పటికే శ్రియా పలు సినిమాల్లో స్పెషల్ సాంగ్‌లతో అలరించిన విషయం తెలిసిందే. అంతేకాదు ఈ పాట కోసం ఏకంగా కోటి రూపాయలు రెమ్యునరేషన్ అడిగారన్న టాక్ కూడా జోరుగా నడుస్తోంది. ప్రస్తుతానికి ఈ వార్త అఫిషీయల్ కాకున్నా.. తాజా అప్‌డేట్ మాత్రం ఫిలింనగర్ సర్కిల్‌లో టాక్ ఆఫ్ ది టౌన్‌గా మారింది.
- " class="align-text-top noRightClick twitterSection" data="">
2023 సంక్రాంతి బరిలోకి వాల్తేరు వీరయ్యగా వచ్చి చిరంజీవి.. మరో హిట్‌ను తన ఖాతాలో వేసుకున్నారు. ఇప్పుడు అదే జోష్‌లో భోళాశంకర్ చేస్తున్నారు. ఇందులో చిరు సరసన మిల్కీ బ్యూటీ తమన్నా హీరోయిన్‌గా నటిస్తున్నారు. చిరంజీవి చెల్లెలుగా కీర్తి సురేశ్ కీలక పాత్ర పోషిస్తున్నారు. ఇప్పటికే పలు షూటింగ్ షెడ్యూళ్లు పూర్తి చేసుకున్న ఈ సినిమా.. ఆగస్టులో రిలీజ్ కానుంది.
ఇండస్ట్రీలో ఉన్న టాలెంటెడ్ హీరోయిన్లలో ఒకరు శ్రియా శరణ్. 2001లో యాక్టింగ్ కెరీర్ మొదలుపెట్టిన ఈ భామ తెలుగు, తమిళం, హిందీతోపాటు కన్నడ, మలయాళ భాషల్లో సినిమాలు చేస్తూ వన్ ఆఫ్ ది లీడింగ్ హీరోయిన్‌గా మారిపోయారు. స్టార్ హీరోయిన్ క్రేజ్ సంపాదించుకున్న తర్వాత సెకండ్ ఇన్నింగ్స్‌లో కూడా ఇంట్రెస్టింగ్ రోల్స్ చేస్తూ ఎప్పుడూ వార్తల్లో నిలుస్తారు శ్రియ. ఈ భామ నటించిన దృశ్యం 2 బాక్సాఫీస్ వద్ద మంచి టాక్ తెచ్చుకుంది. ఈ విషయంలో సీనియర్ హీరోయిన్లకు స్ఫూర్తిగా నిలుస్తోంది. ఇటీవలే కన్నడ పాన్ ఇండియా ప్రాజెక్ట్ కబ్జ సినిమాలో కూడా ఫిమేల్ లీడ్ రోల్‌లో నటించారు. ప్రస్తుతం మ్యూజిల్ స్కూల్లో నటిస్తున్నారు.