ETV Bharat / entertainment

కెరీర్​లో అలా చేయడం ఇదే ఫస్ట్​ టైమ్​.. సూపర్​ స్ట్రాంగ్​గా నయన్!​: చిరంజీవి

మెగాస్టార్​ చిరంజీవి నటించిన తాజా చిత్రం 'గాడ్​ఫాదర్'​. అయితే హీరోయిన్‌, పాటలు లేని కథను చిరు ఎంపిక చేసుకోవడానికి కారణమేంటి? ఈ సినిమాలోని లుక్‌ కోసం ఆయన ఎలా సన్నద్ధమయ్యారు? సత్యదేవ్‌ ఎంపిక ఎవరిది? నయనతార పాత్ర నేపథ్యం? వంటి వివరాలను చిరు పంచుకున్నారు. అవి ఆయన మాటల్లోనే..

chiranjeevi interview
chiranjeevi interview
author img

By

Published : Sep 25, 2022, 10:16 PM IST

Megastar Chiranjeevi Special Interview: టాలీవుడ్​ స్టార్​ హీరో మెగాస్టార్ చిరంజీవి నటించిన తాజా చిత్రం 'గాడ్​ఫాదర్​'. అక్టోబరు 5న దసరా కానుకగా ప్రేక్షకుల ముందుకు రానుంది. సినిమా ప్రమోషన్స్​లో భాగంగా చిరంజీవిని యాంకర్​ శ్రీముఖి చేసిన ప్రత్యేక ఇంటర్వ్యూలో ఆయన పలు విశేషాలు పంచుకున్నారు. ఆ వివరాలివీ..

హీరోయిన్‌, పాటలు లేని కథని ఎంపిక చేసుకోవడానికి కారణం?
చిరంజీవి: నేనెప్పుడూ కొత్తదనం ఉన్న కథలను ప్రేక్షకులకు ఇవ్వాలనుకుంటా. ఇంత సీనియారిటీ, ఇమేజ్‌ ఉన్న నేను వైవిధ్యాన్ని ఎందుకు ప్రదర్శించకూడదనే ఆలోచన వచ్చింది. ఆ క్రమంలో 'లూసీఫర్‌' సినిమా చూశా. నన్ను నేను కొత్తగా ఆవిష్కరించుకునే అవకాశం అందులో ఉందనిపించింది. నాకు బాగా కావాల్సిన వారితో నా మనసులో మాట చెప్పగానే అంతా ప్రోత్సహించారు. హీరోయిన్‌ లేదేంటి? పాటలు లేవేంటి? అనే ప్రస్తావనే రాని పొలిటికల్‌ డ్రామా ఇది. సీన్‌ తర్వాత సీన్‌ ఉత్కంఠ రేకెత్తిస్తూ సినిమా ముందుకెళ్తుంది తప్ప ఎక్కడా 'ఏదో మిస్‌ అయ్యిందే' అనే ఫీలింగే కలగదు. ఆ ధైర్యంతోనే ఈ సినిమాను ఎంపిక చేసుకున్నా. ఇటీవల రషెస్‌ చూశా. నా ఊహ, అంచనాలు తప్పుకాదని, నేను కరెక్ట్‌ అని అర్థమైంది.

ఈ సినిమాలోని లుక్‌ కోసం ఎలా సన్నద్ధమయ్యారు?
చిరంజీవి: జీవితాన్ని కాచి వడపోసిన వ్యక్తిత్వం ఈ చిత్రంలోని కథానాయకుడి పాత్రది. ఆ అనుభవం నడి వయుసు దాటాకే వస్తుంది. ఆ ఏజ్‌ గ్రూప్‌ వారికి 'సాల్ట్‌ అండ్‌ పెప్పర్‌' లుక్‌ ఉంటేనే నిండుగా ఉంటుందని చిత్ర బృందానికి చెప్పా. ఈ విషయంలో అందరూ నన్ను అభినందించారు. అలా.. కొత్త లుక్‌ ప్రయత్నించా. ఇలా కనిపించటం నా కెరీర్‌లో ఇదే తొలిసారి.

ఈ చిత్రంలో నటించిన నయనతార గురించి చెబుతారా?
చిరంజీవి: 'గాడ్‌ ఫాదర్‌'లో సత్యప్రియ అనే పాత్ర చాలా కీలకం. ఎంతో బలమైన, హుందాగా కనిపించాల్సిన ఆ క్యారెక్టర్‌ను పోషించగల సీనియర్‌ నటి ఎవరా? అని అనుకోగానే అందరూ చెప్పిన పేరు నయనతార. మేం ఆమెను సంప్రదించి, కథ చెప్పగానే నటించేందుకు ఓకే చెప్పింది. పాత్రకు పూర్తి న్యాయం చేసింది.

సత్యదేవ్‌ ఎంపిక ఎవరిది?
చిరంజీవి: సత్యదేవ్‌ను నేనే ఎంపిక చేశా. సుమారు 10 సినిమాలే చేసినా ఆయన నటనలో పరిపూర్ణత కనిపిస్తుంది. తన హావభావాలు, ఉచ్చారణ అద్భుతంగా ఉంటాయి. ''గాడ్‌ ఫాదర్‌'లోని ప్రతినాయక ఛాయలున్న పాత్ర గురించి వివరిస్తూ.. హీరోగా చేస్తున్నావ్‌ కదా. ఇప్పుడిది చేస్తావా? అభ్యంతరం ఉంటే చెప్పు' అని నేను అనగానే తప్పకుండా చేస్తానన్నాడు సత్యదేవ్‌. ఈ సినిమాతో తనకు మంచి పేరొస్తుంది. నా పేరు నిలబెడతాడు. దర్శకుడు మోహన్‌రాజా నా ఎంపికను మెచ్చుకున్నాడు.

టాలీవుడ్‌ మెగాస్టార్‌, బాలీవుడ్‌ సూపర్‌స్టార్‌ కాంబినేషన్‌ ఎలా కుదిరింది?
చిరంజీవి: ఈ కథలోని నాయకుడి వెన్నంటే ఉంటూ, తన కోసం ఏదైనా చేయగలిగే పవర్‌ఫుల్‌ పాత్ర ఒకటుంది. ఓ సన్నివేశంలో ఆ క్యారెక్టరే పోరాటాన్ని ముందుకు నడిపించాల్సి వస్తుంది. అలాంటి క్యారెక్టర్‌ను ఇమేజ్‌ ఉన్న నటుడే పోషిస్తే బాగుంటుందనే ఉద్దేశంతో రామ్‌చరణ్‌.. సల్మాన్‌ఖాన్‌ను కలిశాడు. సల్మాన్‌తో మాకు మంచి అనుబంధం ఉంది. అందుకే మాతృక 'లూసీఫర్‌'ను చూడకుండానే ఇందులో నటించాడు.తన క్యారెక్టర్‌ను ఎంతో ప్రేమించాడు. ఆయన రాకతో సినిమాకు నిండుతనం వచ్చింది. హ్యాట్సాఫ్‌ సల్మాన్‌ భాయ్‌.. లవ్‌ యూ.

మీ ఇద్దరు కలిసి డ్యాన్స్‌ చేసిన 'తార్‌మార్‌' సాంగ్‌ విశేషాలేంటి?
చిరంజీవి: ఆ పాట అందరి దృష్టిని ఆకర్షిస్తుందంటే ఈ క్రెడిట్‌ అంతా ప్రభుదేవాదే. 'మీరిద్దరూ సూపర్‌స్టార్స్‌. కష్టపడి డ్యాన్స్‌ చేసినట్టు ఉండకూడదు. ఏ స్టెప్పు అయినా మీకు ఇష్టం వచ్చినట్టు తేలికగా వేయాలి. అది కూడా బాగుంటుంది' అని చెప్పాడు. సినిమాలోని మా ఇద్దరి పాత్రలూ కొంచెం కేర్‌లెస్‌గా ఉంటాయి. దానికి తగ్గట్టే పాటలో నర్తించాం.

దర్శకుడు పూరీ జగన్నాథ్‌ పాత్ర ఎలా ఉంటుంది?
చిరంజీవి: పూరీ జగన్నాథ్‌ పోషించిన పాత్ర సినిమా కథను నెరేట్‌ (వాయిస్‌ ఓవర్‌) చేస్తుంది. ఆయన యూట్యూబర్‌గా కనిపిస్తారు. పూరీ జగన్నాథ్‌ 'పాడ్‌కాస్ట్‌'లు చాలా బాగుంటాయి. 'ఎందుకు పూరీని యూట్యూబర్‌గా చూపించకూడదు' అని అనిపించింది. ఓసారి ఆయనకు ఫోన్‌ చేసి, విషయం చెప్పగానే 'సర్‌.. కెమెరా ముందు అంతసేపు.. అదీ మీతోపాటు అంటే నేను చేయను' అని అన్నాడు. పాత్ర నిడివి తక్కువే అని చెబితే ఒప్పుకున్నాడు. తనలో సహజమైన నటుడు ఉన్నాడని సినిమా చూశాక మీరే చెబుతారు.

  • " class="align-text-top noRightClick twitterSection" data="">

ఇవీ చదవండి: 'అలా జరుగుతుందని అసలు ఊహించలేదు.. ఓ రకంగా అది మంచిదే'

రికార్డు ధరకు షారుక్ 'జవాన్' డిజిటల్ రైట్స్‌.. అన్ని కోట్లా?

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.