ETV Bharat / entertainment

'దసరా' దర్శకుడితో చిరంజీవి సినిమా.. కండిషన్​ అప్లై! - చిరంజీవి దసరా దర్శకుడికి కండిషన్​

ప్రస్తుతం భోళాశంకర్​ సినిమాతో బిజీగా ఉన్న మెగాస్టార్ చిరంజీవి.. తన కొత్త సినిమా కోసం కథలు వింటున్నారని తెలిసింది. అయితే తాజాగా.. 'దసరా' చిత్రంతో బ్లాక్ బాస్టర్​ అందుకున్న దర్శకుడు శ్రీకాంత్​ ఓదెల్ కూడా స్టోరీ చెప్పారని తెలిసింది. ఆ వివరాలు..

chiru
'దసరా' దర్శకుడితో చిరంజీవి సినిమా.. కండిషన్​ అప్లై!
author img

By

Published : Apr 25, 2023, 3:41 PM IST

Updated : Apr 25, 2023, 4:52 PM IST

మెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతం కెరీర్​లో దూకుడు ప్రదర్శిస్తున్నారు. సినిమాలను ఒప్పుకోవడంలోనే కాదు.. వాటిని పూర్తి చేయడంలోనూ అదే వేగం ప్రదర్శిస్తున్నారు. ఆయన రీ ఎంట్రీ తర్వాత.. సీనియర్లు మొదలుకొని యువతరం దర్శకుల వరకూ ప్రతిఒక్కరూ కథలు సిద్ధం చేసుకుంటున్నారు. అయితే రీసెంట్​గా 'గాడ్​ ఫాదర్'​, 'వాల్తేరు వీరయ్య'తో బ్యాక్​ టు బ్యాక్ సక్సెస్​లను అందుకున్న చిరు.. ప్రస్తుతం 'భోళాశంకర్'​ చిత్రంలో నటిస్తున్నారు. ప్రస్తుతం ఈ సినిమా శరవేగంగా చిత్రీకరణ జరుపుకుంటోంది. అయితే వరుస విజయాలతో జోష్​ మీదున్న చిరు.. 'భోళాశంకర్​' తర్వాత కొత్త సినిమాలను పట్టాలెక్కించేందుకు వరుసగా కథలు వింటున్నారు. ముఖ్యంగా యంగ్​ డైరెక్టర్స్​ కథలను ఎక్కువగా వింటున్నారని తెలుస్తోంది.

అయితే ఇప్పటికే చిరును ఎలాగైనా మెప్పించాలని బింబిసార దర్శకుడు విశిష్ఠ, బీవీఎస్ రవి, కళ్యామ్ కృష్ణ, ప్రసన్న కుమార్ బెజవాడ ప్రయత్నిస్తున్నట్లు తెలిసింది. విశిష్ఠ.. చిరు కోసం ఓ సరికొత్త సోషియో ఫాంటసీ కథ సిద్ధం చేశారని తెలిసింది. ఈ దర్శకులంతా సింగిల్ లైన్​ను వినిపించి.. ఫుల్ స్క్రిప్ట్​ మీద పని చేస్తున్నారని సమాచారం. అయితే ఇప్పుడీ జాబితాలో మరో కొత్త పేరు తెరపైకి వచ్చింది. రీసెంట్​గా 'దసరా' సినిమాతో బ్లాక్ బాస్టర్​ అందుకున్న కొత్త దర్శకుడు శ్రీకాంత్ ఓదెల మీద చిరు దృష్టి పడినట్లు తెలిసింది. దసరాను రూపొందించిన నిర్మాత సుధాకర్​ చెరుకూరినే ఈ చిత్రాన్ని నిర్మిస్తారట. ప్రస్తుతం శ్రీకాంత్​.. మెగాస్టార్​కు స్టోరీ గురించి ఓ లైన్ ​ చెప్పారట. అయితే చిరు.. దీనిపై వర్క్ చేసి పూర్తి స్క్రిప్ట్​తో రమ్మని చెప్పినట్లు తెలిసింది. ఒకవేళ స్క్రిప్ట్ పూర్తై​ నచ్చితే.. మిగతా వాళ్లను కాస్త పక్కకు పెట్టి శ్రీకాంత్​తో మూవీ చేసేందుకు చిరు రెడీ అయినట్టే! మరీ శ్రీకాంత్​ ఎలాంటి కథతో ముందుకు వస్తారనేది కీలకం.

ఇకపోతే 'భోళాశంకర్' విషయానికొస్తే.. చిరు మాస్‌లుక్‌లో అలరించనున్నారు. ఇందులో మెగాస్టార్​ సరసన తమన్నా హీరోయిన్‌గా నటిస్తోంది. ముంబయి బ్యాక్ డ్రాప్​లో రూపొందుతున్న ఈ సినిమా.. ఇప్పటికే పలు షెడ్యూలను పూర్తిచేసుకుంది. మహానటి కీర్తి సురేశ్‌.. చిరుకు చెల్లిలిగా కీలక పాత్రలో నటిస్తోంది. ఈ సినిమా ఆగస్టులో గ్రాండ్​గా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇకపోతే ఈ చిత్రంలో హీరోయిన్​ శ్రియాతో కలిసి మెగాస్టార్‌ ఓ స్పెషల్​ డ్యాన్స్‌ చేయనున్నారని అంటున్నారు. ఇప్పటికే మూవీటీమ్​ శ్రియను సంప్రదించిందట. దీంతో వీరిద్దరి డ్యాన్స్‌ను మరోసారి తెరపై చూసేందుకు మెగా అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

  • " class="align-text-top noRightClick twitterSection" data="">

ఇదీ చూడండి : RRR హిందీ రీమేక్​.. రామ్​గా రణ్​వీర్​.. భీమ్​గా విక్కీ.. డైరెక్టర్​ ఎవరంటే!?

Last Updated : Apr 25, 2023, 4:52 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.