మెగా పవర్‌స్టార్ రామచరణ్.. ప్రస్తుతం టాలీవుడ్ స్టార్ హీరోల్లో ఒకరు. ఆర్ఆర్ఆర్ బిగెస్ట్ బ్లాక్ బస్టర్‌ను అందుకుని అంతర్జాతీయ స్థాయిలో క్రేజ్‌ను దక్కించుకున్నారు. ప్రస్తుతం వరుస సినిమాలు చేస్తూ బిజీగా గడుపుతున్నారు. అయితే ఎంత బిజీలో ఉన్న ఆయన.. అటు ఫ్యామిలీకి, ఇటు అభిమానులతో ముచ్చటించడానికి సమయాన్ని కేటాయిస్తుంటారు. అలా టాలీవుడ్‌లో ఎప్పుడూ అభిమానులతో టచ్‌లో ఉండే హీరోల్లో చరణ్ ముందుంటారు. తన వ్యక్తిగత విషయాలు, సినిమాకు సంబంధించిన విషయాలను ఫ్యాన్స్‌కు షేర్ చేస్తుంటారు. ఇటీవల ఓ ఇంటర్వ్యూలో భాగంగా అభిమానులు అడిగిన ప్రశ్నలకు ఆయన అదిరిపోయే సమధానాలు చెప్పారు.
ఈ ఇంటర్వ్యూలో చరణ్ తన మొదటి క్రష్ గురించి మాట్లాడుతూ.. "నాకు జూలియా రాబర్ట్స్ అంటే చాలా ఇష్టం. ఆమెను టీవీలో చూసినా, బిగ్ స్క్రీన్‌పై చూసినా అలా కళ్లు ఆర్పకుండా చూస్తూ ఉండిపోతాను. ఆమె నన్ను అంతగా ఆకర్షిస్తుంది. ప్రెట్టీ ఉమెన్ సినిమా నుంచి నేను ఆమెకు పెద్ద అభిమానిని అయ్యాను. అలాగే కేథరిన్ జెటా జోన్స్ కూడా ఇష్టం. ఆమె నటించిన సినిమాల్లో నేను మొదట చూసింది మార్క్ ఆఫ్ జోరో. ఆ సినిమాలో తన నటన చూసి చాలా ఎంజాయ్ చేశాను" అన్నారు.
ఇక ఉప్పెన దర్శకుడు బుచ్చిబాబుతో రామ్ చరణ్ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. నేడు ఈ టాలెంటెడ్ దర్శకుడు పుట్టినరోజు సందర్భంగా చరణ్ ఆయన్ను కలిసి విషెస్ చెప్పారు. ఆ ఫొటోను అభిమానులతో పంచుకుంటూ.. "నా అభిమాన దర్శకుల్లో ఒకరైన బుచ్చిబాబుకు పుట్టిన రోజు శుభాకాంక్షలు. మీరెప్పుడూ ఆరోగ్యంగా, సంతోషంగా ఉండాలని కోరుకుంటున్నాను. త్వరలోనే సెట్‌లో మళ్లీ కలుద్దాం" అని రాశారు.
ఇదీ చూడండి: బడా ప్రొడక్షన్ హౌస్‌లో నిఖిల్ సినిమా.. అప్పుడు రూ.25 వేలు.. ఇప్పుడు రూ.14కోట్లు!