ETV Bharat / entertainment

Mega 157 Latest Update : మెగా 157 సూపర్​ అప్​డేట్​.. ఇంతకీ ఏంటంటే?

Mega 157 Latest Update : మెగాస్టార్​ చిరంజీవి- దర్శకుడు వశిష్ట కాంబోలో తెరకెక్కనున్న మెగా 157 నుంచి ఓ తాజా అప్​డేట్​ను అనౌన్స్​ చేశారు మేకర్స్​. ఇంతకీ అందులో ఏముందంటే?

Mega 157 Latest Update
Mega 157 Latest Update
author img

By ETV Bharat Telugu Team

Published : Sep 10, 2023, 5:28 PM IST

Updated : Sep 10, 2023, 5:44 PM IST

Mega 157 Latest Update : టాలీవుడ్ స్టార్ హీరో మెగాస్టార్​ - 'బింబిసార' ఫేమ్‌ వశిష్ఠ కాంబోలో ఓ సినిమా రూపొందనున్న విషయం తెలిసిందే. మెగా 157 అనే వర్కింగ్​ టైటిల్​తో పట్టాలెక్కనున్నా ఈ సినిమా నుంచి తాజాగా ఓ అప్‌డేట్‌ను దర్శకుడు వశిష్ఠ నెటిజన్లతో పంచుకున్నారు. "మెగా చిత్రానికి మెగా ఆరంభం. ప్రీ ప్రొడెక్షన్‌ వర్క్‌తో #MEGA157 మొదలైంది. త్వరలోనే మీ అందరినీ సినిమాటిక్‌ అడ్వెంచర్‌లోకి తీసుకుళ్లేందుకు మేము సిద్ధంగా ఉన్నాం" అంటూ ట్విట్టర్​ వేదికగా ఆయన రాసుకొచ్చారు. దానితో పాటు ఓ ఫొటోను జోడించారు. అందులో చిరంజీవితో పాటు దర్శకుడు వశిష్ఠ, సినిమాటోగ్రాఫర్‌ చోటా కె నాయుడు, యూవీ నిర్మాతలు ఉన్నారు. ప్రస్తుతం ఈ ఫొటో నెట్టింట తెగ ట్రెండ్​ అవుతోంది.

Mega 157 Movie : చిరు పుట్టినరోజును పురస్కరించుకుని గత నెలలో ఈ ప్రాజెక్ట్‌ అనౌన్స్‌ చేశారు. యూవీ క్రియేషన్స్ బ్యానర్​లో 'మెగా 157' రూపొందనుంది. తాజాగా విడుదల చేసిన పోస్టర్​ద్వారా ఈ మూవీ ఇది సోషియో ఫాంటసీగా మూవీగా రానున్నట్లు తెలుస్తోంది. మెగాస్టార్ అనే శక్తి కోసం నిప్పు, నీరు, ఆకాశం, భూమి, వాయువు కలుస్తున్నాయి. ఈ సారి మెగామాస్​ యూనివర్స్​ను దాటి ఉండబోతుందని అంటూ ఆ క్యాప్షన్​లో​ పేర్కొంది.

Mega 157 Cast : క్యాప్షన్​కు తగ్గట్టే పోస్టర్​ను కూడా ఓ రేంజ్​లో డిజైన్ చేశారు. స్టార్​ ఆకారంలో ఉన్న ఈ పోస్టర్​లో త్రిశూలంతో పాటు పంచభూతాలను చూపించారు. దీంతో ఈ సినిమాపై భారీ అంచనాలు పెరిగిపోయాయి. సినిమా ఎలా ఉండబోతుందా అనే ఆసక్తి అటు మెగా అభిమానులతో పాటు ఇటు మూవీ లవర్స్​లో మొదలైపోయింది. పంచభూతాలకు అధిపతిలా చిరంజీవి చూపిస్తారో.. లేక వాటిని తన ఆధీనంలోకి తెచ్చుకున్న ఓ అసమాన శక్తి ఉన్న మానవుడిలా చూపుతారో వేచి చూడాల్సిందే. ఇక 2004లో దాదాపు ఇలాంటి కాన్సెప్ట్​తోనే 'అంజి' సినిమాతో చిరు ప్రేక్షకుల ముందుకు వచ్చారు. మళ్లీ ఇప్పుడు 19 ఏళ్ల తర్వాత ఇలాంటి సినిమాలో నటించనున్నారు. ఇక ఈ సినిమాలో అనుష్క శెట్టి, మృణాల్‌ ఠాకూర్‌ హీరోయిన్స్‌గా కనిపించే అవకాశం ఉందని సమాచారం.

Chiranjeevi Happy Birthday : చిరు కొత్త మూవీస్​ అనౌన్స్​మెంట్స్​​.. ఈ సారి యూనివర్స్​ను మించేలా మెగామాస్​

Chiranjeevi Happy Birthday : మెగా 156.. ఈ సస్పెన్స్​ ఏంటి బాసూ.. ఫ్యాన్స్​ దీని గురించే రచ్చ!

Last Updated : Sep 10, 2023, 5:44 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.