ETV Bharat / entertainment

రవితేజను కారవాన్​లోకి లాగిన చిరంజీవి​.. 'మెగా154' సెట్​లో సందడి - చిరంజీవి మూవీస్

chiru 154 movie: చిరు-బాబీ కాంబినేషన్​లో తీస్తున్న కొత్త సినిమా 'మెగా154' షూటింగ్​లో ఆసక్తికర పరిణామం జరిగింది. శనివారం షూటింగ్​లో మాస్​హీరో రవితేజ జాయిన్ అయ్యారు. రవితేజ వచ్చిన వెంటనే.. తన కారవాన్​లోకి లాగేశారు మెగాస్టార్​.

Mass Maharaja Ravi Teja Joins Megastar Chiranjeevi & Bobby's 'Mega154' sets
రవితేజను కారవాన్​లోకి లాగిన చిరంజీవి​.. 'మెగా154' సెట్​లో సందడి
author img

By

Published : Jul 16, 2022, 5:41 PM IST

Chiranjeevi raviteja movies: కొంతకాలంగా మాస్ మహారాజా రవితేజ.. మెగాస్టార్ చిరంజీవి కొత్త సినిమాలో గెస్ట్ రోల్ చేస్తున్నట్లు ప్రచారం జరిగింది. తాాజా పరిణామంతో ఆ ప్రచారానికి చెక్​ పడింది. తాజా అప్డేట్​ ఏంటంటే.. రవితేజ ఈ సినిమా షూటింగ్​లో జాయిన్​ అయ్యారు. బాబీ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రానికి 'వాల్తేరు వీరయ్య' టైటిల్​ అనుకుంటున్నారు. ఈ టైటిల్​ దాదాపు ఖరారయ్యే అవకాశం ఉంది.

శనివారం రవితేజ షూటింగ్​లో జాయిన్ అయినట్లు నిర్మాతలు ప్రకటించారు. ఈ అప్డేట్​ను ఆందిస్తూ.. ఆసక్తికర పోస్టర్​ను విడుదల చేసారు. అంతేకాదు.. రవితేజను మెగాస్టార్​ తన కారవాన్​లోకి లాగేసినట్లు ఉన్న ఒక వీడియోను రిలీజ్ చేశారు. సినిమా పట్ల మరింత ఆసక్తిని రేకెత్తించేలా ఉన్న ఈ వీడియో ప్రస్తుతం వైరల్​గా మారింది. ఈ సినిమాకు దేవిశ్రీ ప్రసాద్ సంగీతాన్ని అందిస్తున్నారు.

  • " class="align-text-top noRightClick twitterSection" data="">

కెరీర్​ ప్రారంభంలో చిన్న చిన్న పాత్రలు చేసి గుర్తింపు తెచ్చుకున్న హీరో రవితేజ.. 'అన్నయ్య' సినిమాలో చిరంజీవి తమ్ముడి పాత్రలో కనిపించారు. మళ్లీ ఇప్పుడు 22 ఏళ్ల తర్వాత చిరుతో స్క్రీన్ షేర్​ చేసుకుంటున్నారు.

రవితేజ హీరోగా నటించిన 'పవర్' సినిమాతో దర్శకుడిగా మారిన బాబీ.. ఆ తర్వాత పలు హిట్​ సినిమాలు తీశారు. చిరుతో తను చేయబోయే కొత్త సినిమాలోని ఓ రోల్​ కోసం ఈ డైరెక్టర్ రవితేజను రిక్వెస్ట్​ చేశారు. దానికి అతడు అంగీకారం చెప్పారు. అయితే చిరు చేస్తున్న సినిమాల్లో పలువురు హీరోలు గెస్ట్​ రోల్స్ చేస్తున్నారు. 'ఆచార్య'లో రామ్​చరణ్, 'గాడ్​ఫాదర్'లో సల్మాన్​ఖాన్ నటించారు. ఇప్పుడు 'వాల్తేరు వీరయ్య' రవితేజ కీలకపాత్రలో కనిపించనున్నారు.

ఇవీ చదవండి: డబుల్​ బొనాంజా.. ఆలియా- రణ్​బీర్​కు కవలలు?

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.