Mansoor Ali Khan Trisha Controversy : తమిళ నటుడు మన్సూర్ అలీఖాన్ తాజాగా కోర్టును ఆశ్రయించారు. మెగాస్టార్ చిరంజీవితో పాటు త్రిష, కుష్బూలపై ఆయన పరువు నష్టం కేసు పెట్టారు. సోషల్ మీడియా వేదికగా తన పరువుకు భంగం కలిగించేలా ఆ ముగ్గురు చేసిన వ్యాఖ్యలపై ఆయన ఈ కేసు వేసినట్లు ఓ స్టేట్మెంట్ ద్వారా తెలిపారు. మొత్తం వీడియోను చూడకుండా తన ప్రతిష్టను దిగజార్చారంటూ ఆరోపించిన ఆయన, వారి నుంచి ఆయన రూ.1 కోటి డిమాండ్ చేశారు. సోమవారం (డిసెంబర్ 11)న మద్రాసు హైకోర్టులో విచారణ జరగనుంది.
-
Actor Mansoor Ali Khan filed a sue application against actress Trisha Krishnan, Kushboo Sundar & Chiranjeevi Konidela for their defamatory remarks that were made against him on the public social media platform ‘X’ (formerly ‘Twitter’) https://t.co/Dr0YUqY71W pic.twitter.com/xIVzLedBzW
— ANI (@ANI) December 8, 2023 " class="align-text-top noRightClick twitterSection" data="
">Actor Mansoor Ali Khan filed a sue application against actress Trisha Krishnan, Kushboo Sundar & Chiranjeevi Konidela for their defamatory remarks that were made against him on the public social media platform ‘X’ (formerly ‘Twitter’) https://t.co/Dr0YUqY71W pic.twitter.com/xIVzLedBzW
— ANI (@ANI) December 8, 2023Actor Mansoor Ali Khan filed a sue application against actress Trisha Krishnan, Kushboo Sundar & Chiranjeevi Konidela for their defamatory remarks that were made against him on the public social media platform ‘X’ (formerly ‘Twitter’) https://t.co/Dr0YUqY71W pic.twitter.com/xIVzLedBzW
— ANI (@ANI) December 8, 2023
అసలు ఏం జరిగిందంటే :
నటుడు మన్సూర్ అలీఖాన్ ఇటీవలే ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్నారు. మన్సూర్ ఓ ఇంటర్వ్యూలో మాట్లాడారు. అయితే గతంలో తాను ఎన్నో రేప్ సీన్లలో నటించానని, 'లియో'లో అవకాశం వచ్చినప్పుడు త్రిషతో కూడా అలాంటి సీన్ ఉంటుందని అనుకున్నట్లు కామెంట్ చేశారు. ఆ సీన్ లేకపోవడం వల్ల తనకి బాధ కలిగిందన్నారు. ఆ వీడియో నెట్టింట ట్రెండ్ అయ్యి త్రిష దృష్టికి వెళ్లింది. దీంతో ఆమె సోషల్ మీడియా వేదికగా మన్సూర్‌పై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇలాంటి వారి వల్లే అందరికీ చెడ్డపేరు వస్తుందంటూ తన కోపాన్ని వెల్లడించారు. ఈ నేపథ్యంలో త్రిషకు మద్దతుగా 'లియో' డైరెక్టర్ లోకేశ్ కనగరాజ్, టాలీవుడ్ మెగా స్టార్ చిరంజీవి, నితిన్, రోజా, రాధిక, సింగర్ చిన్మయి నిలిచారు. మన్సూర్ వ్యాఖ్యలను ఖండించారు.
అయితే ఈ విషయంపై స్పందించిన మన్సూర్ ఈ మేరకు ఇన్‌స్టాగ్రామ్‌లో ఒక పోస్ట్ చేశారు. త్రిషపై తనకెంతో మంచి అభిప్రాయం ఉందన్నారు. ఆమెను గౌరవిస్తున్నానని చెప్పారు. తాను సరదాగా చెప్పిన వ్యాఖ్యలపై ఇలాంటి దుమారం రేగుతుందనుకోలేదన్నారు. నేను ఎవరినో, ఎలాంటి వాడినో అందరికీ తెలుసు అని ఇన్స్టాగ్రామ్ స్టోరీలో పేర్కొన్నారు.
అయితే ఆయన వ్యాఖ్యలను జాతీయ మహిళా కమిషన్ సీరియస్‌గా తీసుకుంది. ఆ స్టేట్మెంట్ను సుమోటోగా స్వీకరించి మన్సూర్‌పై కేసు నమోదు చేయాలని తమిళనాడు పోలీసులకు ఆదేశాలు కూడా జారీ చేసింది. మహిళల గురించి ఈ విధంగా అసభ్యకరమైన వ్యాఖ్యలు చేస్తే సహించేదిలేదని తెలిపింది. ఆ తర్వాత సోషల్ మీడియా వేదికగా మన్సూర్ అలీఖాన్ త్రిషకు క్షమాపణలు చెప్పారు. అయితే తనపై సోషల్ మీడియాలో అవమానకర వ్యాఖ్యలు చేశారంటూ ఆయన చిరుతో పాటు త్రిష, కుష్బూలపై పరువు నష్టం కేసు పెట్టడం గమనార్హం.
త్రిష పై 'లియో' నటుడు వివాదాస్పద వ్యాఖ్యలు - కోలీవుడ్ ప్రముఖుల ఆగ్రహం- వివరణ ఇచ్చిన మన్సూర్!
'ఐయామ్ సారీ త్రిష, ఇక ఎవరి పని వారు చేసుకోండి'! : మన్సూర్ అలీ ఖాన్