Mansoor Ali Khan Defamation Case : నటి త్రిష సహా ఖుష్బూ, మెగాస్టార్ చిరంజీవిపై తమిళ నటుడు మన్సూర్ అలీ ఖాన్ వేసిన పరువు నష్టం దావాను మద్రాస్ హైకోర్టు కొట్టివేసింది. మన్సూర్ ఖాన్ పిటిషన్‌ను జస్టిస్ నితిశ్ కుమార్ కొట్టివేస్తూ అతడికి రూ. లక్ష జరిమానా విధించారు. కాగా, త్రిషపై అనుచిత వ్యాఖ్యల నేపథ్యంలో మన్సూర్ అలీ ఖాన్ ఇటీవల ఆమెకు మద్దతుగా నిలిచిన ఖుష్బు, చిరంజీవిపై పరువు నష్టం దావా వేశారు.
-
#MansoorAliKhan pic.twitter.com/dwXg7RqBtd
— Aakashavaani (@TheAakashavaani) December 22, 2023 " class="align-text-top noRightClick twitterSection" data="
">#MansoorAliKhan pic.twitter.com/dwXg7RqBtd
— Aakashavaani (@TheAakashavaani) December 22, 2023#MansoorAliKhan pic.twitter.com/dwXg7RqBtd
— Aakashavaani (@TheAakashavaani) December 22, 2023
అసలేం జరిగిందంటే?
మన్సూర్ అలీఖాన్, త్రిష తాజాగా 'లియో' సినిమాలో నటించారు. ఈ క్రమంలో మన్సూర్ ఇటీవల ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్నారు. మన్సూర్ ఆ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ గతంలో తాను ఎన్నో రేప్ సీన్లలో నటించానని, 'లియో'లో అవకాశం వచ్చినప్పుడు త్రిషతో కూడా అలాంటి సీన్ ఉంటుందని అనుకున్నట్లు కామెంట్ చేశారు. ఆ సీన్ లేకపోవడం వల్ల తనకి బాధ కలిగిందన్నారు. ఆ వీడియో సోషల్ మీడియాలో వైరలైంది. ఇక ఈ విషయంపై త్రిష సోషల్ మీడియా వేదికగా తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈ నేపథ్యంలో 'లియో' డైరెక్టర్ లోకేశ్ కనగరాజ్, టాలీవుడ్ మెగా స్టార్ చిరంజీవి, నితిన్, రోజా, రాధిక, సింగర్ చిన్మయి త్రిషకు మద్దతుగా నిలిచి మన్సూర్ వ్యాఖ్యలను ఖండించారు.
మన్సూర్ వివరణ : అయితే తాను చేసిన వ్యాఖ్యల పట్ల వివరాణ ఇచ్చారు మన్సూర్. త్రిషపై తనకెంతో మంచి అభిప్రాయం ఉందన్నారు. ఆమెను గౌరవిస్తున్నానని చెప్పారు. తాను సరదాగా చెప్పిన వ్యాఖ్యలపై ఇలాంటి దుమారం రేగుతుందనుకోలేదన్నారు. నేను ఎవరినో, ఎలాంటి వాడినో అందరికీ తెలుసు అని సోషల్ మీడియాలో పేర్కొన్నారు. ఈ వివాదం తీవ్రం కావడం వల్ల చెన్నై పోలీసులు మన్సూర్‌పై కేసు నమోదు చేశారు. దీంతో ఎట్టకేలకు మన్సూర్ గతనెల త్రిషకు క్షమాపణలు చెప్పారు.
అయితే త్రిష, ఖుష్బు, చిరంజీవి సోషల్ మీడియా వేదికగా తన పరువుకు భంగం కలిగించేలా వ్యాఖ్యలు చేశారని మన్సూర్ వారిపై ఇటీవల పరువు నష్టం కేసు పెట్టారు. మొత్తం వీడియోను చూడకుండా తన ప్రతిష్టను దిగజార్చారంటూ ఆరోపించిన ఆయన, వారి నుంచి రూ.1 కోటి డిమాండ్ చేశారు. ఇక కోర్టు తాజా తీర్పుతో ఈ వివాదానికి బ్రేక్ పడినట్లైంది.
'ఐయామ్ సారీ త్రిష, ఇక ఎవరి పని వారు చేసుకోండి'! : మన్సూర్ అలీ ఖాన్
త్రిష పై 'లియో' నటుడు వివాదాస్పద వ్యాఖ్యలు - కోలీవుడ్ ప్రముఖుల ఆగ్రహం- వివరణ ఇచ్చిన మన్సూర్!