ETV Bharat / entertainment

ఎనిమిది నెలల ప్రెగ్నెంట్,​ కార్డియాక్​ అరెస్ట్​తో కన్నుమూసిన నటి, ఐసీయూలో చిన్నారి - ఎనిమిది నెలల గర్భవతి మృతి

Malayalam Serial Actress Death : మలయాళ బుల్లితెర ఇండస్ట్రీలో మరో విషాదం నెలకొంది. ఎనిమిది నెలల గర్భవతిగా ఉన్న నటి డాక్టర్​ ప్రియ.. మంగళవారం రాత్రి కార్డియాక్ అరెస్ట్‌తో తుదిశ్వాస విడిచారు. ప్రస్తుతం ఆమె కడుపులో ఉన్న చిన్నారి ఐసీయూలో చికిత్స పొందుతోంది.

Television serial star Dr Priya passed away

author img

By ETV Bharat Telugu Team

Published : Nov 1, 2023, 5:47 PM IST

Updated : Nov 1, 2023, 6:14 PM IST

Malayalam Serial Actress Death : మలయాళ బుల్లితెర ఇండస్ట్రీలో మరో విషాదం నెలకొంది. ఇప్పటికే అపర్ణా పి.నాయర్‌, రెంజూషా మేనన్‌ మరణవార్తలను ప్రేక్షకులు మరవకముందే ఇదే ఇండస్ట్రీకి చెందిన మరో నటి డాక్టర్ ప్రియ కన్నుమూశారు. ఎనిమిది నెలల గర్భవతిగా ఉన్న ఆమె.. మంగళవారం రాత్రి కార్డియాక్ అరెస్ట్‌తో తుదిశ్వాస విడిచారు. ఈ విషయాన్ని ఆమె కో స్టార్​ కిషోర్‌ సత్య సోషల్ మీడియాలో వెల్లడించారు. దీంతో యావత్​ ఇండస్ట్రీ దిగ్భ్రాంతికి లోనైంది. సోషల్ మీడియా వేదికగా ఆమె మృతికి సంతాపం తెలుపుతున్నారు. ఆమె కుటుంబానికి ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తూ పోస్టులు పెడుతున్నారు.

"మలయాళ టీవీ ఇండస్ట్రీలో ఊహించని విధంగా మరొకరు కన్నుమూశారు. కార్డియాక్‌ అరెస్ట్‌తో ప్రియ తుది శ్వాస విడిచారు. ఆమె ఎనిమిది నెలల గర్భవతి. ఆమెకు ఎలాంటి అనారోగ్య సమస్యల్లేవు. రొటీన్‌ చెకప్‌ కోసం ఆస్పత్రికి వెళ్లిన ఆమె కార్డియాక్‌ అరెస్ట్‌కు గురై మృతి చెందారు. వెంటనే స్పందించిన వైద్యులు.. ఆమెకు డెలివరీ చేసి శిశువును బయటకు తీశారు. ప్రస్తుతం ఆ నవజాత శిశువు సురక్షితంగా ఉంది. ఆ చిన్నారికి ఐసీయూలో చికిత్స అందిస్తున్నారు. ఆమె కుటుంబసభ్యుల ఆవేదన నన్నెంతో కలచివేసింది. వాళ్లను ఎలా ఓదార్చాలో కూడా నాకు అర్థం కాలేదు." అని ఆయన పోస్ట్‌ పెట్టారు.

ఇంతకీ ఏం జరిగిందంటే ?
Serial Actress Priya Cardiac Arrest : వృత్తి రీత్యా డాక్టరైన ప్రియ.. ఓ సీరియల్‌ నటిగానూ మలయాళ ఇండస్ట్రీలో మంచి పేరు తెచ్చుకున్నారు. కిషోర్‌ సత్య నటించిన 'కరుతముత్తు' అనే సీరియల్‌తో ఆమె నటిగా పేరు సొంతం చేసుకున్నారు. వివాహం తర్వాత ఆమె నటకు కాస్త దూరంగా ఉన్నారు. అయితే ఎనిమిది నెలల గర్భవతిగా ఉన్న ఆమె.. తాజాగా రోటీన్​ చెకప్‌ కోసం ఆస్పత్రికి వెళ్లింది. అక్కడ పరీక్షలు చేస్తున్న సమయంలో గుండెపోటు రావడం వల్ల అక్కడిక్కడే కుప్పకూలిపోయింది. దీంతో అప్రమత్తమైన ఆస్పత్రి సిబ్బంది ఆమెను కాపాడేందుకు ప్రయత్నించగా.. అప్పటికే ప్రియ మృతి చెందినట్లు తెలిసింది. దీంతో శస్త్రచికిత్స చేసి గర్భంలో ఉన్న శిశువును బయటకు తీశారు. ఆ చిన్నారిని ఐసీయూలో ఉంచి చికిత్స అందిస్తున్నారు.

Actress Renjusha Menon Died : ప్రముఖ​ నటి అనుమానాస్పద మృతి.. కారణం అదేనా?

అమ్మా, నేను చనిపోయాక అతణ్ని వదలకండి. రెండున్నరేళ్లుగా వేధిస్తున్నాడు

Last Updated : Nov 1, 2023, 6:14 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.