Major movie trailer: మేజర్ సందీప్ ఉన్నికృష్ణన్ జీవితం ఆధారంగా రూపొందుతున్న సినిమా 'మేజర్'. సందీప్‌గా నటించడంతోపాటు... చిత్రానికి కథ, స్క్రీన్‌ప్లే సమకూర్చారు కథానాయకుడు అడివి శేష్. శశికిరణ్ తిక్క దర్శకుడు. ప్రముఖ కథానాయకుడు మహేష్‌బాబు సొంత సంస్థ జీఎంబీ ఎంటర్‌టైన్‌మెంట్, ఏ ప్లస్ ఎస్ మూవీస్‌తో కలిసి సోసీ పిక్చర్స్ ఇండియా సంస్థ నిర్మించింది. తెలుగుతోపాటు, హిందీ, మలయాళ భాషల్లో ఏకకాలంలో జూన్ 3న ప్రేక్షకుల ముందుకు రానుంది. సినిమా విడుదల తేదీ దగ్గర పడటం వల్ల తాజాగా ఓ కొత్త అప్డేట్ ఇచ్చింది మూవీటీమ్. మే 9న ట్రైలర్ విడుదల చేయనున్నట్లు తెలిపింది. దీంతో పాటే ఓ మేకింగ్ వీడియోను రిలీజే చేసింది. కాగా, మేజర్ సందీప్ బాల్యం, యవ్వనంతోపాటు భారతసైన్యంలో ఆయన అనుభవాలు, ముంబయి దాడుల ఘటనలో చేసిన సహసాలు, త్యాగం వరకు ఆయన జీవితానికి సంబంధించిన విభిన్న కోణాల్ని ఈ చిత్రంలో చూపనున్నారు. ప్రస్తుతం నిర్మాణానంతర కార్య క్రమాలు జరుగుతున్నాయి. అడివి శేష్ స్వయంగా నిర్మాణానంతర పనుల్ని పర్యవేక్షిస్తున్నారు. శోభితా ధూళిపాల, సయీ మంజ్రేకర్, ప్రకాష్‌రాజ్, రేవతి, మురళీశర్మ తదితరులు నటించిన ఈ చిత్రానికి శ్రీచరణ్ పాకాల స్వరాలు సమకూర్చారు.
-
An Indian film made in 3 languages to celebrate the story of India's Real Hero ❤️🔥#MajorTrailer Explosion on May 9th💥
— GMB Entertainment (@GMBents) May 4, 2022 " class="align-text-top noRightClick twitterSection" data="
🔗 https://t.co/y5aKvdntLm@AdiviSesh @saieemmanjrekar @SashiTikka @urstrulyMahesh @SricharanPakala @sonypicsindia @GMBents @AplusSMovies @ZeeMusicsouth
">An Indian film made in 3 languages to celebrate the story of India's Real Hero ❤️🔥#MajorTrailer Explosion on May 9th💥
— GMB Entertainment (@GMBents) May 4, 2022
🔗 https://t.co/y5aKvdntLm@AdiviSesh @saieemmanjrekar @SashiTikka @urstrulyMahesh @SricharanPakala @sonypicsindia @GMBents @AplusSMovies @ZeeMusicsouthAn Indian film made in 3 languages to celebrate the story of India's Real Hero ❤️🔥#MajorTrailer Explosion on May 9th💥
— GMB Entertainment (@GMBents) May 4, 2022
🔗 https://t.co/y5aKvdntLm@AdiviSesh @saieemmanjrekar @SashiTikka @urstrulyMahesh @SricharanPakala @sonypicsindia @GMBents @AplusSMovies @ZeeMusicsouth
- " class="align-text-top noRightClick twitterSection" data="">