ETV Bharat / entertainment

క్రేజీ డైరెక్టర్​తో మహేశ్​ కొత్త సినిమా! విజయ్​తో మరోసారి!! - లోకేశ్​ కనకరాజ్​

Mahesh Babu Lokesh Kanagaraj: ఇప్పటికే త్రివిక్రమ్, దర్శక ధీరుడు రాజమౌళితో ప్రాజెక్టులను ప్రకటించిన సూపర్​స్టార్​ మహేశ్​ బాబు.. త్వరలోనే మరో సెన్సేషనల్​ డైరెక్టర్​తో పనిచేయనున్నట్లు తెలుస్తోంది. 'ఖైదీ', 'మాస్టర్'​ లాంటి సూపర్​ హిట్​ చిత్రాలను తెరకెక్కించిన లోకేశ్​ కనకరాజ్​ దర్శకతంలో మహేశ్​ సినిమా చేయనున్నట్లు చిత్ర పరిశ్రమలో జోరుగా చర్చ నడుస్తోంది.

Mahesh Babu Lokesh Kanagaraj
mahesh babu next film
author img

By

Published : May 22, 2022, 7:53 PM IST

Mahesh Babu Lokesh Kanagaraj: తమిళ క్రేజీ డైరెక్టర్​ లోకేశ్​ కనకరాజ్​తో కలిసి సూపర్​స్టార్​ మహేశ్​బాబు ఓ సినిమా చేయనున్నట్లు తెలుస్తోంది. 'ఖైదీ', 'మాస్టర్'​ లాంటి బ్లాక్​బస్టర్​ చిత్రాలను తీశారు లోకేశ్. ఇటీవలే 'విక్రమ్'​ సినిమా ప్రమోషన్స్​ కోసం హైదరాబాద్​ వచ్చిన ఆయన​.. మహేశ్​ను​ కలవడం వల్ల టాలీవుడ్​లో ఈ మేరకు జోరుగా ప్రచారం సాగుతోంది. వీరిద్దరూ దాదాపు 2గంటల పాటు చర్చలు జరిపినట్లు సమాచారం. అన్నీ కుదిరితే ఈ ప్రాజెక్టును ఓకే చేసేందుకు మహేశ్​ ఆసక్తిగా ఉన్నట్లు తెలుస్తోంది.

ప్రస్తుతానికి విహారయాత్రలో ఉన్న మహేశ్​.. త్వరలోనే త్రివిక్రమ్​తో చేయబోయే సినిమా సెట్​లో అడుగుపెట్టనున్నారు. ఆ తర్వాత తొలిసారి రాజమౌళి దర్శకత్వంలో ఓ చిత్రం చేయనున్నారు. ఇక యూనివర్సల్ హీరో కమల్​ హాసన్​తో తెరకెక్కించిన 'విక్రమ్'​ సినిమా విడుదల కోసం లోకేశ్ ఎదురు చూస్తున్నారు. అనంతరం సూపర్​స్టార్​ విజయ్​తో కలిసి మరో చిత్రాన్ని (Thalapathy 67) చేయనున్నట్లు ఇటీవలే ఓ వేడుకలో స్పష్టంచేశారు.

ఇదీ చూడండి: మాకు విడాకులు కావాలి: కియారా అడ్వాణీ, వరుణ్ ధావన్

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.