Brahmanandam new upcoming movie : బ్రహ్మానందం.. ఈయన గురించి తెలుగు ప్రేక్షకులకు ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. ఎందుకంటే ఈయన తన నటనతో, మరీ ముఖ్యంగా తన ఎక్స్‌ప్రెషన్స్‌తో ఆడియెన్స్‌ను తెగ నవ్వించారు. ఆయన పాత్రలతో ఇప్పటికీ సోషల్‌మీడియాలో ఎన్నో మీమ్స్ సందడి చేస్తున్నాయి. అయితే ఈ మధ్యలో ఎక్కువగా తెరపై కనిపించట్లేదు. అడపాదడపా సినిమాలు చేస్తున్నారు. అయితే తెరపై కొన్ని కాంబినేషన్లు ఎంతో ప్రత్యేకం. అలాంటి వాటిలోనే బ్రహ్మానందం-దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబో కూడా ఒకటి.
త్రివిక్రమ్ తెరకెక్కించే సినిమాల్లో దాదాపుగా బ్రహ్మానందం ఏదో ఒక పాత్రలో కనిపించి సందడి చేస్తుంటారు. త్రివిక్రమ్ సినిమాల్లో బ్రహ్మి టైమింగ్ కామెడీకి ఓ ప్రత్యేక ఫ్యాన్ బేస్ కూడా ఉంటుంది. 'అతడు' సినిమా నుంచి మనం గమనిస్తే.. ఆ చిత్రంలో చీటికీ మాటికీ అత్తారింటికి వచ్చే అల్లుడిగా.. మావయ్య ముందు పిల్లిలా.. పెళ్ళాం ముందు పులిలా ఆయనే చేసే కామెడీ టైమింగ్‌ను తెగ నవ్విస్తుంది. సోషల్ మీడియాలోనూ ఈ పాత్రకు సంబంధించిన మీమ్స్ ఇప్పటికీ వాడుతూనే ఉంటారు. జల్సాలో కానిస్టేబుల్ పాత్రలో ఆయన పవన్‌తో చేసే కామెడీ తెగ నవ్వు తెప్పిస్తుంది. ఇంకా ఖలేజా, జులాయి, సన్ అఫ్ సత్యమూర్తి సినిమాలు కూడా అంతే. అవన్నీ ఇప్పటికీ చూస్తే చూడాలనిపిస్తుంది. అయితే కొన్నేళ్ల నుంచి బ్రహ్మీ త్రివిక్రమ్ సినిమాల్లో కనిపించట్లేదు. 'అఆ', 'అజ్ఞాతవాసి', 'అరవింద సమేత' చిత్రాలలో ఆయన పాత్రే లేదు. 'అల వైకుంఠ పురములో' సినిమాలోని రాములో రాములో పాటలో అలా ఓ సారి తళుక్కున మెరిసి వెళ్లిపోతారు.
mahesh babu Gunturu karam movie : అయితే ఇప్పుడు 'గుంటూరు కారం' సినిమాలో బ్రహ్మానందం సందడి చేయబోతున్నారని తెలిసింది. అంటే దాదాపు ఎనిమిదేళ్ల తర్వాత త్రివిక్రమ్ సినిమాలో ఆయన కనిపించబోతున్నారు. ప్రస్తుతం ఈ చిత్రం స్క్రిప్ట్ మార్పులు జరుగుతున్నాయని ప్రచారం సాగుతోంది. ఈ స్క్రిప్ట్ మార్పుల్లో భాగంగానే మహేశ్ బాబు.. బ్రహ్మీకి ఓ పాత్ర క్రియేట్ చేయాలని సూచించారట. అందుకుని త్రివిక్రమ్.. బ్రహ్మీ కోసం ఓ పాత్ర డిజైన్ చేశారట. మరి ఇందులో నిజమెంతో తెలియదు కానీ.. ఇది ఇన్సైడ్ టాక్.
bramhanandam upcoming movies : ఇకపోతే గత కొద్ది కాలంగా సినిమాలకు కాస్త దూరంగా ఉంటున్న బ్రహ్మీ.. జాతిరత్నాలు తర్వాత స్లోగా సినిమాలు చేస్తూ వస్తున్నారు. రంగమార్తాండలో ఎప్పుడు చేయని ఓ సీరియస్ అండ్ ఎమోషనల్ పాత్ర చేసి విమర్శకుల ప్రశంసలను దక్కించకున్నారు. అలాగే ఇప్పుడు తరుణ్ భాస్కర్ 'కీడా కోలా'లోను ఓ ప్రధాన పాత్ర పోషిస్తున్నారు.
ఇదీ చూడండి :