Mahesh Babu Gift To Namrata Shirodkar : టాలీవుడ్లో మహేశ్ బాబు - నమ్రతా శిరోద్కర్ మోస్ట్ బ్యూటిఫుల్ కపుల్స్ లిస్ట్‌లో ఒకరు. 2005లో ప్రేమ వివాహం చేసుకున్న వీరు.. ఎంత అన్యోన్యంగా ఉంటారో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. అయితే రీసెంట్గా ఓ జ్యువెల్లరీ షాప్ ఓపెనింగ్‌కు వచ్చిన నమ్రత.. మహేశ్ తనకు ఇచ్చిన మొదటి బహుమతి గురించి చెప్పారు. ఇంతకీ ఆ గిఫ్ట్ ఏంటంటే..
తన భర్త మహేశ్ బాబు ఆమెకు ఇచ్చిన తొలి బహుమతి పెళ్లి ఉంగరమేనట. ఈ విషయాన్ని స్వయంగా నమ్రతానే వెల్లడించారు. అయితే బంగారంపై తనకు అంతగా ఆసక్తి ఉండదని నమ్రత అన్నారు. కానీ ఆమెకు చిన్నప్పుడు వాళ్ల అమ్మ సాయిబాబా బంగారు ఉంగరాన్ని ఇచ్చారట. అదంటే ఎంతో ఇష్టమని నమ్రత చెప్పుకొచ్చారు. అలాగే తాను సినిమాల్లోకి రీ ఎంట్రీ ఇవ్వనున్నట్లు వస్తున్న వార్తలను ఆమె మరోసారి ఖండించారు. ఆ కథనాల్లో ఎలాంటి వాస్తవం లేదని ఆమె స్పష్టం చేశారు.
కాగా వంశీ సినిమాతో వీరిద్దరి మధ్య పరిచయం ఏర్పడి.. ఆపై ప్రేమగా మారింది. అనంతరం పెద్దల సమక్షంలో ఘనంగా వివాహం జరిగింది. అప్పటి నుంచి నమ్రత సినిమాలకు దూరంగా ఉంటున్నారు. అంతకుముందు నమ్రత తెలుగు సహా హిందీ, ఇంగ్లిష్ సినిమాల్లోనూ నటించి మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. ఇక ఆమె 2004లో 'అంజి' సినిమాలో చివరగా నటించారు.
అయితే అటు మహేశ్ కూడా సినిమా షూటింగ్‌ల్లో ఏ మాత్రం విరామం దొరికినా ఫ్యామిలీతో గడపడానికే ఇష్టపడతారు. ఇదివరకు చాలాసార్లు ఫ్యామిలీతో విదేశాలు చుట్టివచ్చారు. ఇక ప్రస్తుతం మహేశ్ గుంటూరు కారం సినిమా షూటింగ్లో బిజీగా ఉన్నారు. కొన్ని కారణాల వల్ల ఈ సినిమా చిత్రీకరణకు పలుమార్లు ఆటంకం కలిగినా.. తాజాగా మళ్లీ ప్రారంభమైనట్లు సమాచారం అందింది.
ఈ సినిమాను మొదటి నుంచి వచ్చే ఏడాదికి సంక్రాంతికి ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తామని మూవీటీమ్ చెబుతోంది. అంటే మరో నాలుగు నెలల్లో చిత్రీకరణ పూర్తి చేయాలి. ఈ భారమంత ఇక దర్శకుడు త్రివిక్రమ్‌పైనే ఉంటుంది. చూడాలి మరి గురూజీ ఏం చేస్తారో. ఇకపోతే ఈ సినిమాలో శ్రీలీల, మీనాక్షి చౌదరి హీరోయిన్లుగా కనిపించనున్నారు. తమన్ సంగీతం అందిస్తున్నారు. ఇప్పటికే విడుదలైన పోస్టర్లు, గ్లింప్స్ అభిమానులను బాగానే ఆకట్టుకున్నాయి.
Gunturukaram Shooting : కొత్త సినిమాటోగ్రాఫర్ వచ్చేశారు.. ఇక గురూజీకి సవాల్!
Mahesh babu Workout Pics : జిమ్‌లో మహేశ్ వర్కౌట్స్.. త్వరలోనే ఆ సినిమా సెట్స్‌లోకి..