ETV Bharat / entertainment

'లియో' కశ్మీర్ షెడ్యూల్.. గడ్డ కట్టించే చలిలోనూ షూటింగ్.. స్పెషల్ వీడియో రిలీజ్​ - దళపతి విజయ్​ కశ్మీర్​ షూటింగ్​

తమిళ స్టార్ విజయ్ దళపతి నటిస్తున్న కొత్త చిత్రం 'లియో' షూటింగ్ కశ్మీర్ షెడ్యూల్ పూర్తైంది. గడ్డ కట్టించే చలిలో తమ సిబ్బంది పడ్డ కష్టాలకు మేకర్స్ ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతూ ఓ వీడియోను విడుదల చేశారు. ప్రసుత్తం నెట్టింట ఆ వీడియో వైరల్​గా మారింది. ఓసారి మీరూ చూసేయండి.

thalapathy-vijay-
thalapathy-vijay-leo-movie-crew-hard-working-in-kashmir viral video
author img

By

Published : Mar 24, 2023, 6:57 AM IST

సంక్రాంతి బరిలో దిగిన తమిళ స్టార్​ విజయ్​ దళపతి.. 'వారసుడు' సినిమాతో హిట్​ను అందుకున్నారు. తెలుగులో డెబ్యూ ఫిల్మ్​తోనే విజయాన్ని అందుకున్నారు. ప్రస్తుతం ఆయన సెన్సేషనల్​ డైరెక్టర్​ లోకేశ్​ కనగరాజ్​ దర్శకత్వంలో 'లియో' చిత్రంలో నటిస్తున్నారు. ప్రస్తుతం ఈ చిత్ర షూటింగ్.. కశ్మీర్​ షెడ్యూల్​ను పూర్తి చేసుకుంది. 56 రోజుల సుదీర్ఘ షెడ్యూల్​ ఇటీవలే పూర్తైంది. కాస్ట్​ అండ్​ క్రూ చెన్నైకు చేరుకుంది ఈ సందర్భంగా కశ్మీర్​ షెడ్యూల్​లో తమ సిబ్బంది శ్రమకు ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతూ ఓ వీడియోను మేకర్స్​ విడుదల చేశారు. కశ్మీర్ షెడ్యూల్​లో తమ సిబ్బంది ఎంతలా కష్టపడిందో వారి మాటల్లోనే చూపించారు.

"కశ్మీర్​లోని పలు ప్రాంతాల్లో లియో షూటింగ్ జరిగింది. ప్రధాన క్రాఫ్ట్స్ అన్నీ పనిచేశాయి. అయితే కశ్మీర్​లో షూటింగ్ కావడంతో మైనస్​ 10 డిగ్రీల టెంపరేచర్​లో పనిచేయాల్సి వచ్చింది. చలికి వణికిపోతూనే షూటింగ్ వర్క్ కొనసాగించారు. రాత్రి పగలు షూటింగ్ కొనసాగింది. ముఖ్యంగా అక్కడి చలి, మంచు, వర్షానికి ఏమాత్రం ఆగిపోకుండా షూటింగ్ పనులు నిర్వహించారు" అని మేకర్స్​ తెలిపారు.

  • " class="align-text-top noRightClick twitterSection" data="">

రాత్రుల్లో -10 నుంచి -2 డిగ్రీల టెంపరేచర్​లోనూ వర్క్ చేశామన్నారు. తమ చేతులు బిగుసుకపోయాయని, అయినా లోకేషన్లలో చాలా వేగంగా పనిచేశామన్నారు. దర్శకుడు లోకేశ్​ కనగరాజ్ సైతం ఏమాత్రం సమయం వృథా చేయకుండా షూట్ కొనసాగించారన్నారు. ఎన్ని ఇబ్బందులున్నా తమకు సంతోషంగానే ఉందని తమ అనుభూతిని పంచుకున్నారు. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట వైరల్ అవుతోంది. లియో కశ్మీర్ షెడ్యూల్‌ కోసం తమ హృదయాన్ని, ఆత్మను అందించిన అద్భుతమైన సిబ్బందికి ధన్యావాదాలు తెలిపారు.

'లియో' చిత్రాన్ని ప్రముఖ సెవెన్ స్కీన్స్ బ్యానర్​పై నిర్మాతలు ఎస్ఎస్ లలిత్ కుమార్, జగదీశ్​ పళనిసామి రూ.200 కోట్లతో తెరకెక్కిస్తున్నారు. ఖైదీ, విక్రమ్ చిత్రాలతో సెన్సేషన్ క్రియేట్ చేసిన లోకేశ్​ కనగరాజ్​.. ఇప్పటికే విజయ్​తో మాస్టర్ తెరకెక్కించి హిట్ అందుకున్నారు. ప్రస్తుతం 'లియో'పై భారీ అంచనాలు ఉన్నాయి. ఇప్పటికే ప్రీ రిలీజ్ బిజినెస్ కూడా రూ.400కు పైగా జరిగిందంటున్నారు. చిత్రంలో విజయ్ సరసన త్రిష నటిస్తోంది. సంజయ్ దత్, అర్జున్, ప్రియా ఆనంద్, మైస్కిన్, గౌతమ్ వసుదేవ్ మీనన్, మన్సూర్ అలీ ఖాన్, మనోబాలా కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఈ ఏడాది అక్టోబర్ 19న లియో చిత్రం ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ కాబోతోంది.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.