ETV Bharat / entertainment

Leo Movie : 'లియో' లీక్స్​... స్టోరీ ప్లాట్‌ లైన్‌ ఇదే.. వామ్మో ఇంత వైలెన్సా? - దళపతి విజయ్ లియో స్టోరీ లైన్​

Leo Story Line : లియో యూకే వెర్షన్‌కు సెన్సార్‌ కంప్లీట్ అయింది. ఈ సినిమా ప్లాట్‌ లైన్‌ కూడా తెలిసింది. వామ్మో చాలా వైలెన్స్​ ఉంది. ఆ వివరాలు..

Leo Movie : 'లియో' లీక్స్​... స్టోరీ ప్లాట్‌ లైన్‌ ఇదే.. మీరు చదివారా?

author img

By ETV Bharat Telugu Team

Published : Oct 12, 2023, 10:42 PM IST

Leo Story Line : దళపతి విజయ్‌ హీరోగా నటించిన లేటెస్ట్​ యాక్షన్‌ థ్రిల్లర్‌ మూవీ లియో. లోకేశ్​ కనగరాజ్‌ దర్శకుడు. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ చిత్రం అక్టోబరు 19న ఆడియెన్స్​ ముందుకు రానుంది. ఈ క్రమంలో ఓ ఆసక్తికర లీక్ బయటకు వచ్చింది. ఈ సినిమా ప్లాట్‌లైన్‌ తెలిసింది. 2005లో రిలీజైన హాలీవుడ్‌ ఫిల్మ్‌ ఏ హౌస్‌ ఆఫ్‌ వైలెన్స్‌ను స్ఫూర్తిగా తీసుకుని ఈ చిత్రాన్ని తీర్చిదిద్దినట్లు ఇప్పటికే టాక్ వినిపిస్తోంది.

అయితే ఈ చిత్ర ఫ్లాట్ లైన్ ఏంటంటే.. చరిత్రలోనే అత్యంత క్రూరమైన హింసా సామ్రాజ్యంలో గడిపిన ఓ వ్యక్తి.. కొన్ని అనుకోని కారణాల వల్ల దాని నుంచి విముక్తి పొంది బయటకు వచ్చేస్తాడు. ఆ తర్వాత కెఫేను నడుపుకొంటూ ఫ్యామిలీతో సంతోషంగా జీవిస్తున్న అతడి లైఫ్​లో కొందరు ప్రతినాయకులు ప్రవేశిస్తారు. మరి వాళ్ల రాకతో అతడి జీవితం మళ్లీ ఎలాంటి మలుపులు తిరిగింది? ఇంతకీ ఆ లియోదాస్‌ గతంలో ఏం చేసేవాడు? అసలు ఆ విలన్లు ఎందుకు అతడి జీవితంలోకి వచ్చారు? మరి ఆ హింసా సామ్రాజ్యం నుంచి అతడు ఎలా బయటపడ్డాడు? మళ్లీ కత్తిపట్టాడా? లేదా? అనేది తెలియాలంటే తెరపై చూడాల్సిందే. ఇకపోతే ఈ సినిమా సెన్సార్​ను పూర్తి చేసుకుంది. లియోకు పలు కట్స్‌ పడ్డాయి. నాలుగు నిమిషాల నిడివి తగ్గింది.

ఇకపోతే ఈ చిత్రంలో రామ్‌చరణ్‌ గెస్ట్​ రోల్​లో కనిపిస్తారని టాక్‌ వినిపిస్తోంది. విక్రమ్‌లో రోలెక్స్‌లా కోబ్రా పేరుతో కనిపిస్తారని ప్రచారం సాగుతోంది. అయితే, దీనిపై మూవీటీమ్​ ఎలాంటి క్లారిటీ ఇవ్వలేదు. మరి నిజంగా ఈ సినిమాలో రామ్‌చరణ్‌ ఉన్నారా? లేదా? అనేది తెలియాలంటే మరో వారం రోజులు ఆగాల్సిందే. తమిళ, తెలుగు, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో సినిమా విడుదల కానుంది. త్రిష హీరోయిన్​గా నటిస్తోంది. అర్జున్‌ సర్జా, సంజయ్‌ దత్‌, గౌతమ్‌ వాసుదేవ్‌ మేనన్‌ తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు. తమిళంలో అయితే ఈ చిత్రాన్ని ఐమ్యాక్స్‌ వెర్షన్‌లోనూ రిలీజ్ చేయడం విశేషం.

  • " class="align-text-top noRightClick twitterSection" data="">

Tiger Nageswararao Rao Theatres : టైగర్.. హైప్ లేదా? లేక కావాలనే వారు స్క్రీన్స్ ఇవ్వట్లేదా?

NTR Chandrababu : 'ఏపీ రాజకీయాలపై ఎన్టీఆర్‌ అందుకే స్పందించలేదేమో'.. రాజీవ్​ కనకాల

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.