Lawrence Rudrudu movie: కతిరేశన్ దర్శకత్వంలో రాఘవ లారెన్స్ కథానాయకుడిగా 'రుద్రుడు' అనే ఓ చిత్రం తెరకెక్కుతోంది. ప్రియభవానీ శంకర్ కథానాయిక. ఫైవ్‌స్టార్ క్రియేషన్స్ నిర్మిస్తున్న ఈ చిత్రానికి సంబంధించిన సెకండ్ లుక్‌ను విడుదల చేశారు మేకర్స్. దీంతో పాటే రిలీజ్ డేట్‌ను కూడా ప్రకటించారు. తెలుగు, తమిళ భాషల్లో 2022 డిసెంబరు 23న ప్రేక్షకుల ముందుకు వస్తుందని చెప్పారు. యాక్షన్ థ్రిల్లర్ కథతో ఈ చిత్రం ఇప్పటికే 90 శాతం చిత్రీకరణ పూర్తయింది. రుద్రుడుగా లారెన్స్ అలరించనున్నారు. శరత్‌కుమార్, పూర్ణిమ భాగ్యరాజ్, నాజర్ తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి సంగీతం- జి.వి.ప్రకాశ్‌కుమార్, ఛాయాగ్రహణం-ఆర్.డి.రాజశేఖర్, కూర్పు-ఆంథోని అందిస్తున్నారు.
-
Presenting the Second Look of @offl_Lawrence master in #Rudhran#Rudhran In Theaters Worldwide From December 23 2022#RudhranFromDecember23@offl_Lawrence @kathiresan_offl @realsarathkumar @gvprakash @priya_Bshankar @RDRajasekar @editoranthony @onlynikil pic.twitter.com/Tqntry9XTJ
— Five Star Creations LLP (@5starcreationss) July 3, 2022 " class="align-text-top noRightClick twitterSection" data="
">Presenting the Second Look of @offl_Lawrence master in #Rudhran#Rudhran In Theaters Worldwide From December 23 2022#RudhranFromDecember23@offl_Lawrence @kathiresan_offl @realsarathkumar @gvprakash @priya_Bshankar @RDRajasekar @editoranthony @onlynikil pic.twitter.com/Tqntry9XTJ
— Five Star Creations LLP (@5starcreationss) July 3, 2022Presenting the Second Look of @offl_Lawrence master in #Rudhran#Rudhran In Theaters Worldwide From December 23 2022#RudhranFromDecember23@offl_Lawrence @kathiresan_offl @realsarathkumar @gvprakash @priya_Bshankar @RDRajasekar @editoranthony @onlynikil pic.twitter.com/Tqntry9XTJ
— Five Star Creations LLP (@5starcreationss) July 3, 2022
Akkineni hero Sumanth new movie: హిట్, ఫ్లాపులతో సంబంధం లేకుండా సినిమాలు చేస్తూ కెరీర్లో ముందుకు వెళ్తున్నాడు అక్కినేని హీరో సుమంత్. ఇప్పుడు తాజాగా మరో కొత్త చిత్రానికి గ్రీన్‌సిగ్నల్ ఇచ్చాడు. సుబ్రహ్మణ్యపురం, లక్ష్య మూవీస్‌తో దర్శకుడిగా గుర్తింపు తెచ్చుకున్న యంగ్ డైరెక్టర్ సంతోష్ జాగర్లపూడితో సినిమా చేసేందుకు రెడీ అయ్యాడు. ఇప్పటికే వీరి కాంబోలో వచ్చిన 'సుబ్రహ్మణ్యపురం' హిట్ టాక్ తెచ్చుకుంది. ఈ చిత్రాన్ని కేఆర్ క్రియేషన్స్ పతాకంపై కే ప్రదీప్ నిర్మిస్తున్నారు. పురాతన దేవాలయం నేపథ్యంలో సాగే కథతో ఈ సినిమా తెరకెక్కనుంది.
Keerthi suresh Vaashi movie: 'సర్కారు వారి పాట'తో సక్సెస్‌ను ఫుల్ ఎంజాయ్ చేస్తన్న హీరోయిన్ కీర్తిసురేశ్.. త్వరలోనే మరో కొత్త చిత్రంతో ప్రేక్షకుల్ని పలకరించనుంది. మలయాళంలో హీరో టొవినో థామస్‌తో ఆమె కలిసి నటించిన చిత్రం 'వాశి'. ఇందులో వీరిద్దరు లాయర్లుగా నటించారు. విష్ణు జి.రాఘవ్ దర్శకుడు. థియేటర్లలో రిలీజ్ అయిన ఈ చిత్రం పాజిటివ్ టాక్ తెచ్చుకుంది. తాజాగా ఈ సినిమా ఓటీటీ రిలీజ్‌కు సిద్ధమైంది. నెట్‌ఫ్లిక్స్‌లో జులై 17నుంచి తెలుగు, తమిళం, మలయాళం, కన్నడలో స్ట్రీమింగ్ కానున్నట్లు ప్రకటన వచ్చింది.
ఇదీ చూడండి : కమల్‌హాసన్‌పై మహేశ్‌బాబు ట్వీట్.. ఇంకా అర్హత రాలేదంటూ!