ETV Bharat / entertainment

పెళ్లి కూతురి లుక్​లో​ సమంత.. గుడిలో యాగం.. స్పెషలేంటో ? - ఖుషి మూవీ లాస్ట్​ షెడ్యూల్​

Kushi Shooting Video : రౌడీ హీరో విజయ్ దేవరకొండ, టాలీవుడ్ స్టార్ సమంత జంటగా నటిస్తున్న ఖుషి సినిమాకు సంబంధించిన ఓ వీడియో ఇప్పుడు సోషల్​ మీడియాలో సెన్సేషన్ సృష్టిస్తోంది. ఇంతకీ అదేంటంటే?

Etv Bharat
Etv Bharat
author img

By

Published : Jul 5, 2023, 6:13 PM IST

Kushi Movie Shooting Video : టాలీవుడ్ బ్యూటీ సమంత, రౌడీ హీరో విజయ్​ దేవరకొండ ప్రస్తుతం 'ఖుషి' సినిమా షూటింగ్​లో బిజీగా ఉన్నారు. వరుస షెడ్యూళ్లతో శరవేగంగా షూటింగ్​ కంప్లీట్​ చేసుకుంటున్న ఈ సినిమా ప్రస్తుతం తన లాస్ట్​ షెడ్యూల్​లో ఉంది. ఈ క్రమంలో మేకర్స్​ సైతం చిత్రీకరణను కంప్లీట్​ చేసే పనుల్లో నిమగ్నమైపోయారు. అయితే అప్పట్లో టర్కీలో లొకేషన్లలో షూటింగ్​ జరగ్గా.. ఇప్పుడు ఈ సినిమా చిత్రీకరణ ఆంధ్రప్రదేశ్​లోని ద్రాక్షారామంలో జరుగుతోంది. దీనికి సంబంధించిన ఓ వీడియో ఇప్పుడు సోషల్​ మీడియాలో ట్రెండ్ అవుతోంది.

పంచారామాల్లో ఒకటైన ప్రసిద్థ పుణ్యక్షేత్రం ద్రాక్షారామం ఆలయంలో 'ఖుషి' చిత్రబృందం కనిపించింది. అక్కడ అందరూ ఓ యాగం చేస్తున్నట్లు కనిపించారు. ఓ వైపు సమంత, విజయ్​ ట్రెడిషనల్ అవుట్​ఫిట్​లో కనిపించగా.. మురళీ శర్మ, సచిన్ ఖేడేకర్ లాంటి స్టార్స్​ కూడా ఆ షూట్​లో కనిపించారు. ఈ వీడియోను విజయ్ దేవరకొండ స్వయంగా తన ఇన్​స్టాగ్రామ్​లో పోస్ట్ చేశారు. ఇన్​స్టాలో 'ది దేవరకొండ బ్రాడ్ కాస్ట్' అనే ఓ ఛానల్​ను క్రియేట్ చేసిన ఆయన... అందులో ఈ వీడియోను షేర్ చేశారు. 'ఖుషి' లాస్ట్ షెడ్యూల్ అంటూ ఆయన అందులో పేర్కొన్నారు. దీంతో ఈ సినిమా చిత్రీకరణ కంప్లీట్​ అయినట్లు తెలుస్తోంది. ఇక పోస్ట్​ ప్రొడక్షన్ పనులన్నింటిని ముగించుకుని ఈ సినిమా సెప్టెంబర్ 1న పాన్ ఇండియా లెవెల్​లో ప్రేక్షకుల ముందుకు రానుంది.

Kushi Cast : ఇక సినిమా విషయానికి వస్తే.. శివ నిర్వాణ దర్శకత్వంలో తెరెకక్కుతున్న 'ఖుషి' సినిమాలో సమంత, విజయ్​ దేవరకొండ నటించగా.. మురళీ శర్మ, సచిన్ ఖేడేకర్,జయరామ్​తో పాటు లక్ష్మీ, మురళీ శర్మ, రోహిణి, రాహుల్ రామకృష్ణ, అలీ, వెన్నెల కిశోర్, శ్రీకాంత్ అయ్యంగార్, శరణ్య ప్రదీప్​ లాంటి స్టార్స్​ కీలక పాత్రలు పోషించారు. మైత్రీ మూవీ మేకర్స్ పతాకంపై నవీన్ యేర్నేని, రవిశంకర్ యలమంచిలి ఈ సినిమాను సంయుక్తంగా నిర్మిస్తున్నారు. సంగీత దర్శకుడు హేషామ్ అబ్దుల్ వాహాబ్ ఇందులోని సాంగ్స్​కు బాణీలు కట్టారు.

Kushi First Single : ఇటీవలే 'ఖుషి' నుంచి 'నా రోజా నువ్వే..' అనే ఓ పాట రిలీజై మ్యూజిక్​ లవర్స్​ను తెగ ఆకట్టుకుంది. అందులోని విజువల్స్​ అలానే మ్యూజిక్​ నెటిజన్స్​ దృష్టిని ఆకర్షించింది. దీంతో ఈ సాంగ్​ ఇప్పుడు యూట్యూబ్​లో సెన్సేషన్​ సృష్టిస్తోంది. అయితే ఈ సినిమా నుంచి సెకెండ్​ సింగిల్​ను కూడా రిలీజ్ చేస్తామంటూ మేకర్స్ ఇటీవలే అనౌన్స్​ చేశారు. దీంతో అభిమానులు ఆ సాంగ్​ కోసం ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.

  • " class="align-text-top noRightClick twitterSection" data="">

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.