ETV Bharat / entertainment

యాంకర్స్​ ఓవర్​యాక్షన్​.. లైవ్‌లోనే ఏడ్చేసిన కృతిశెట్టి! - లైవ్​లో ఏడ్చేసిన కృతిశెట్టి

Kritishetty cries: ఇద్దరు యాంకర్స్‌ చేసిన అతికి లైవ్‌లోనే ఏడ్చేసింది హీరోయిన్​ కృతిశెట్టి. ఇది చూసిన నెటిజన్లు ఆ యాంకర్స్‌ని తిడుతూ పోస్టులు పెడుతున్నారు. అసలేమైందంటే..

Kritishetty cries
ఏడ్చేసిన కృతిశెట్టి
author img

By

Published : May 30, 2022, 3:04 PM IST

Kritishetty cries: తొలి సినిమా 'ఉప్పెన'తోనే స్టార్‌గా మంచి గుర్తింపు తెచ్చుకున్నారు ముంబయి భామ కృతిశెట్టి. ఆ సక్సెస్‌తో కెరీర్‌లో ఫుల్​ జోష్​లో ఉన్న ఈ చిన్నది ఇప్పుడు కోలీవుడ్‌, టాలీవుడ్‌లలో వరుస సినిమాలు చేస్తున్నారు. తాజాగా ఈ భామకు ఓ చేదు సంఘటన ఎదురైంది. ఇద్దరు యాంకర్స్‌ చేసిన అతికి లైవ్‌లోనే ఏడ్చేసింది. ఇది చూసిన నెటిజన్లు ఆ యాంకర్స్‌ని తిడుతూ పోస్టులు పెడుతున్నారు. అసలేమైందంటే..

తాజాగా కృతి ఓ అవార్డుల ప్రదానోత్సవంలో పాల్గొన్నారు. ఆ కార్యక్రమంలో ఆమెకు 'ఉత్తమ నటి'గా అవార్డు దక్కింది. అవార్డు తీసుకున్న అనంతరం ఆమె ఓ ఛానల్‌కి ఇంటర్వ్యూ ఇచ్చారు. ఈ ఇంటర్వ్యూలో ఇద్దరు యాంకర్స్‌ పాల్గొనగా.. అందులో ఒకరు మాత్రమే కృతిని వరుసగా ప్రశ్నలు అడుగుతున్నారు. ఆ వ్యక్తి అడిగిన ప్రశ్నలకు కృతి నవ్వుతూ సమాధానాలు చెబుతుండగా.. పక్కనే ఉన్న మరో యాంకర్‌.. "ప్రశ్నలన్నీ నువ్వే అడిగితే.. ఇక నేను ఎందుకిక్కడ? ఈ ఇంటర్వ్యూలో నన్నెందుకు కూర్చొపెట్టారు? ఈ మాత్రం దానికి ఇంత ఖరీదైన దుస్తులు ఎందుకు? ఈ ప్రోగ్రామ్‌ డైరెక్టర్‌ ఎవరు? కెమెరా ఆఫ్‌ చేయండి" అంటూ కేకలు వేశాడు. దాంతో ఇద్దరు యాంకర్స్‌ వాగ్వాదానికి దిగారు. అది చూసిన కృతిశెట్టి షాకైంది. అనంతరం వాళ్లిద్దరూ కృతి దగ్గరకు వెళ్లి.. ఇది కేవలం ప్రాంక్‌ మాత్రమేనని.. కంగారు పడొద్దని చెప్పారు. ఆ మాటతో ఆమె కన్నీళ్లు పెట్టుకుని.. స్టేజ్‌పైనే ఏడ్చేశారు. మిగతా టీమ్‌ మొత్తం సెట్‌లోకి వెళ్లి ఆమెను ఓదార్చారు. అనంతరం కాస్త తేరుకున్న ఆమె ఎవరైనా గట్టిగా మాట్లాడితే తనకెంతో భయమని చెప్పింది. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట వైరల్‌గా మారింది. ఇది చూసిన నెటిజన్లు.. ఆ ఇద్దరు యాంకర్స్‌పై విరుచుకుపడుతున్నారు. ఇదేం ప్రాంక్‌ అంటూ మండిపడుతున్నారు.

  • " class="align-text-top noRightClick twitterSection" data="">

ఇదీ చూడండి: దివ్య ఖోస్లా కుమార్​.. సంప్రదాయ దుస్తుల్లోనే టెంపరేచర్​ పెంచేస్తూ..

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.