ETV Bharat / entertainment

డిఫరెంట్​ కాన్సెప్ట్​తో 'కోటబొమ్మాళి PS' - శ్రీకాంత్ కొత్త మూవీ ఎలా ఉందంటే? - కోటబొమ్మాళి పీఎస్​ డైరెక్టర్

Kotabommali PS Movie Review : 'లింగిడి' సాంగ్​తో ప్రేక్షకులను ఆకట్టుకున్న కోటబొమ్మాళి పీఎస్​ సినిమా ప్రేక్షకుల ముందుకొచ్చింది. శుక్రవారం థియేటర్లలో విడుదలైన ఈ చిత్రం ఎలా ఉందంటే ?

Kotabommali PS Movie Review
Kotabommali PS Movie Review
author img

By ETV Bharat Telugu Team

Published : Nov 24, 2023, 4:16 PM IST

Kotabommali PS Movie Review : చిత్రం: కోటబొమ్మాళి P.S; నటీనటులు: శ్రీకాంత్‌, రాహుల్‌ విజయ్‌, శివానీ రాజశేఖర్‌, వరలక్ష్మీ శరత్‌కుమార్‌ తదితరులు; ఎడిటింగ్‌: కార్తిక్‌ శ్రీనివాస్‌; సంగీతం: రజనీ రాజ్‌; సినిమాటోగ్రఫీ: జగదీష్‌ చీకటి; నిర్మాత: బన్నీ వాస్‌, విద్య కొప్పినీడి; దర్శకత్వం: తేజ మర్ని; విడుదల: 24-11-2023

ఏదైనా సినిమా విడుదల కాకుముందే ఫేమస్​ అయ్యిందంటే.. దానికి ఏదో ఒక సాలిడ్​ రీజన్ ఉంటుంది. కోటబొమ్మాళి పీఎస్ విషయంలోనూ అదే జరిగింది. "లింగిడి.." పాటతో నెటిజన్లు ఆకట్టుకుని ఎటువంటి ప్రమోషన్స్ లేకుండానే ఈ చిత్రం ఆడియెన్స్​లో మంచి అంచనాలు పెంచుకుంది. దీంతో ఆడియెన్స్​ కూడా ఈ మూవీ రిలీజ్​ కోసం ఎంతగానో ఎదురుచూశారు. మలయాళంలో సూపర్​హిట్ అయిన 'నాయట్టు'కు రీమేక్‌గా రూపొందిన ఈ సినిమా శుక్రవారం ప్రేక్షకుల ముందుకొచ్చింది. మరి ఈ 'కోటబొమ్మాళి..' కథేంటంటే?

కథేంటంటే:
ఆంధ్రప్రదేశ్‌లోని టెక్కలి ఉప ఎన్నికల హడావుడి మొదలవుతుంది. దీన్ని అధికార పార్టీ ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకుంటుంది. అందుకే ఆ పార్టీని గెలిపించే బాధ్యతలు అప్పటి హోంమంత్రి బరిసెల జయరామ్‌ (మురళీశర్మ) చేతుల్లో పెడుతుంది. ఎలక్షన్స్​కు మరో మూడు రోజులు సమయం ఉందనగా.. కోటబొమ్మాళి పీఎస్‌ పరిధిలో ఓ పోలీస్‌ జీప్‌ వల్ల జరిగిన రోడ్డు ప్రమాదం అధికార పార్టీకి తలనొప్పిగా మారుతుంది.

ఆ ప్రమాదంలో మరణించిన వ్యక్తి ఆ నియోజకవర్గంలో ఎక్కువ ఓట్లు ఉన్న సామాజిక వర్గానికి చెందిన వ్యక్తి కావడమే దానికి కారణం. మరోవైపు ఆ ప్రమాదానికి కారణమైన పోలీస్‌ జీప్‌లో హెడ్‌ కానిస్టేబుల్‌ రామకృష్ణ (శ్రీకాంత్‌), కొత్తగా డ్యూటీలో చేరిన కానిస్టేబుల్‌ రవి (రాహుల్‌ విజయ్‌), మహిళా కానిస్టేబుల్‌ కుమారి (శివాని రాజశేఖర్‌) ఉంటారు. వీళ్లకు ఆ సామాజిక వర్గంలోని యువనేత మున్నా (పవన్‌ తేజ్‌ కొణిదెల)కు మధ్య అప్పటికే ఓ గొడవై ఉంటుంది. అందుకే ఈ ప్రమాదాన్ని పావుగా వాడుకొని దాన్ని రాజకీయ సమస్యగా మార్చి వాళ్లపై పగ తీర్చుకోవాలని ప్లాన్​ చేస్తాడు మున్నా.

అయితే ఈ సమస్య తీవ్రతను ముందుగానే పసిగట్టిన రామకృష్ణ.. రవి, కుమారిలను తీసుకొని ఆ ప్రాంతం నుంచి పరారీ అవుతాడు. దీంతో అధికారిక పార్టీపై మరింత ఒత్తిడి పెరిగిపోతుంది. ఇది ఎన్నికల్లో విజయాన్ని నిర్దేశించే సమస్య కావడం వల్ల హోంమంత్రి పరారీలో ఉన్న రామకృష్ణతో పాటు మిగతా ఇద్దరు నిందితుల్ని రానున్న 48 గంటల్లో అరెస్టు చేస్తామంటూ శపథం చేస్తారు. ఇందుకోసం ఎన్‌కౌంటర్‌ స్పెషలిస్ట్‌.. ఎస్పీ రజియా అలీ (వరలక్ష్మీ శరత్‌ కుమార్‌)ను రంగంలోకి దించుతారు. మరి పోలీస్‌ శాఖలో 20 ఏళ్ల అనుభవం ఉన్న రామకృష్ణ.. రజియా ఎత్తుల్ని చిత్తు చేస్తూ ఎలా తప్పించుకున్నాడు? ఈ క్రమంలో వాళ్ల ముగ్గురికి ఎదురైన సవాళ్లేంటి? ఈ పోరులో పైచేయి సాధించిందెవరు? అన్నది తెరపై చూసి తెలుసుకోవాల్సిందే.

ఎలా ఉందంటే:
Kotabommali PS Review In Telugu : పోలీసు వ్యవస్థకు రాజకీయ వ్యవస్థకు మధ్య జరిగే ఓ ఆసక్తికర కథాంశంతో రూపొందిన స్టోరీ ఇది. అధికారాన్ని అడ్డం పెట్టుకొని పోలీసు వ్యవస్థని రాజకీయ నాయకులు ఎలా వాడుకుంటారు? రాజకీయ ఒత్తిడుల వల్ల పోలీసులకు ఎదురవుతున్న ఇబ్బందులేంటి? ఓటు బ్యాంకింగ్‌ కోసం కుల మతాలను రాజకీయ నాయకులు ఎలా వాడుకుంటున్నారు? ప్రస్తుత ఓటర్ల ఆలోచనా విధానాలు ఎలా ఉన్నాయి? ఇలాంటి ఆలోచింపజేపే పలు ఆసక్తికర అంశాలతో ఈ సినిమా రూపొందింది. ఒక రకంగా ఈ సినిమా నేపథ్యం ప్రస్తుత రాజకీయ వ్యవస్థపై ఓ వ్యంగ్యాస్త్రం. అలాగే ఓటు విలువను తెలియజెప్పే ఓ మంచి సందేశం కూడా ఉంది. ఇది రీమేక్‌ చిత్రమైనప్పటికీ.. దాన్ని తెలుగు ప్రేక్షకుల అభిరుచులకు తగ్గట్లుగా చక్కగా మార్పులు చేశారు డైరెక్టర్.

శ్రీకాకుళం నేపథ్యంలో ఈ కథను సెటప్‌ చేయడం వల్ల దీనికి ఒక సహజమైన అందం చేకూరింది. సినిమా మొదలైన కాసేపటికే ప్రేక్షకులు కోటబొమ్మాళి ప్రపంచంలోకి వెళ్లిపోతారు. ఓవైపు ఎన్నికల హడావుడి.. మరోవైపు అధికారిక పార్టీ ఒత్తిడులతో పోలీస్‌ వ్యవస్థ ఎదుర్కొనే ఇబ్బందుల్ని చూపిస్తూ నిదానంగా అసలు కథ మొదలవుతుంది.

హెడ్‌ కానిస్టేబుల్‌ రామకృష్ణగా శ్రీకాంత్‌ పరిచయ సన్నివేశాలు ఫర్వాలేదనిపిస్తాయి. కథ ముందుకెళ్లే కొద్దీ ఈ పాత్రలోని అసలు సిసలు హీరోయిజం బయటకొస్తుంది. ఓ పెళ్లి నుంచి తిరిగొస్తున్న సమయంలో రామకృష్ణ, రవి, కుమారి ఉన్న పోలీస్‌ జీపు అదుపు తప్పి ప్రమాదానికి గురవ్వడం.. ఆ ప్రమాదంలో అధికారిక పార్టీకి అవసరమైన సామాజిక వర్గానికి చెందిన వ్యక్తి చనిపోవడం వల్ల కథలో సంఘర్షణ మొదలవుతుంది.

ఈ ప్రమాదాన్ని అడ్డం పెట్టుకొని మున్నా టీమ్‌ తమ కుల ఓటర్లను రెచ్చగొట్టే తీరు.. వాళ్ల ఓట్ల కోసం హోంమంత్రి అన్యాయంగా రామకృష్ణను కేసులో ఇరికించాలని ప్రయత్నించడం.. ఇలాంటి అంశాలతో కథ ఇంకాస్త ఆసక్తికరంగా మారుతుంది. ఈ క్రమంలో వచ్చే విరామ సన్నివేశాలు.. సెకెండాఫ్​పై ఆసక్తిరేకెత్తించేలా ఉంటాయి.

సెకెండాఫ్​ మొత్తం రామకృష్ణ - రజియా అలీకి మధ్య నడిచే మైండ్‌ గేమ్‌లా ఉంటుంది. రామకృష్ణను పట్టుకునేందుకు రజియా వేసే ఎత్తులు.. వాటిని తన తెలివితేటలతో రామకృష్ణ చిత్తు చేసే తీరు ప్రేక్షకులను అలరిస్తాయి. మధ్యలో వచ్చే కొన్ని రొటీన్‌ ఎమోషనల్‌ సీన్స్‌ కాస్త బోర్‌ కొట్టించినప్పటికీ.. క్లైమాక్స్‌ వరకూ తర్వాత ఏం జరగనుందా అన్న ఉత్కంఠ ప్రేక్షకుల్లో కనిపిస్తుంటుంది.

ప్రీక్లైమాక్స్‌లో రామకృష్ణ పాత్ర ముగింపు మదిని బరువెక్కిస్తుంది. ఆ తర్వాత వచ్చే కోర్టు రూమ్​ డ్రామా థ్రిల్లింగ్‌గా ఉంటుంది. ఈ ముగింపు మాతృకకు కాస్త భిన్నంగా అనిపిస్తుంది. పతాక సన్నివేశాల్లో మన వ్యవస్థ గురించి.. ఓటర్ల ఆలోచనా విధానం గురించి మురళీ శర్మ చెప్పే డైలాగులు ఆలోచింపజేయిస్తాయి.

ఎవరెలా చేశారంటే:
Kotabommali PS Cast : శ్రీకాంత్‌కు చాలా కాలం తర్వాత రామకృష్ణ రూపంలో మంచి నటన, హీరోయిజం పండించే పాత్ర దొరికింది. ఆరంభంలో ఈ పాత్ర ఓ సాధారణ కానిస్టేబుల్‌లా కనిపించినప్పటికీ.. అతని నేపథ్యం గురించి తెలిశాక అందులోని అసలు సిసలు హీరోయిజం బయటకొస్తుంది. ఈ పాత్రను శ్రీకాంత్‌ చాలా సెటిల్డ్‌గా చేసుకొచ్చారు. పతాక సన్నివేశాల్లో కూతురి ప్రేమ కోసం తాపత్రయ పడే తండ్రిగా ఆయన నటన కంటతడి పెట్టిస్తుంది. ఆయనకు సవాల్‌ విసిరే రజియా అలీ పాత్రలో వరలక్ష్మీ కూడా చక్కగా నటించారు. ఆ పాత్రలో ఆమె పలికించిన ఎక్స్​ప్రెషన్స్, బాడీ లాంగ్వేజ్‌ స్టోరీపై ప్రేక్షకుల్లో ఆసక్తి కలిగించేలా చేస్తాయి.

రాహుల్‌ విజయ్, శివానీ రాజశేఖర్‌ హీరోయిన్స్​లా కాకుండా కథలో రెండు సహజమైన పాత్రల్లా కనిపిస్తారు. హోంమంత్రిగా మురళీ శర్మ విలక్షణమైన నటన, డైలాగ్‌ డెలివరీతో ఆకట్టుకుంటారు. ప్రవీణ్, సీవీఎల్‌ నరసింహారావు, బెనర్జీ తదితరుల పాత్రలు పరిధి మేరకు ఉంటాయి. తేజ మార్ని ఈ పొలిటికల్‌ థ్రిల్లర్‌ను చక్కగా డీల్‌ చేశారు. ఎక్కడా గీత దాటకుండా.. రాజకీయ వ్యవస్థలోని లోపాల్ని ఎత్తి చూపారు. ద్వితీయార్ధంలో చిన్న చిన్న లోపాలున్నా.. మొత్తంగా సినిమా ఆకట్టుకుంటుంది. మాతృక చూడని ప్రేక్షకులకు కచ్చితంగా ఓ కొత్త అనుభూతి అందిస్తుంది. "లింగిడి" పాటను కథలో సెట్‌ చేసిన తీరు బాగుంది. నేపథ్య సంగీతం, ఛాయాగ్రహణం కథకు అదనపు ఆకర్షణ తీసుకొచ్చాయి. నిర్మాణ విలువలు బాగున్నాయి.

  • బలాలు
  • + శ్రీకాంత్‌ నటన
  • + కథా నేపథ్యం.. ట్విస్టులు
  • + పతాక సన్నివేశాల్లో సందేశం
  • బలహీనతలు
  • - నెమ్మదిగా సాగే ద్వితీయార్ధం
  • చివరిగా: రాజకీయ వ్యవస్థను.. ఓటర్లను ప్రశ్నించే చిత్రమిది!
  • గమనిక: ఈ సమీక్ష సమీక్షకుడి దృష్టి కోణానికి సంబంధించింది. ఇది సమీక్షకుడి వ్యక్తిగత అభిప్రాయం మాత్రమే!

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.