ETV Bharat / entertainment

విజయ్‌ స్పీడ్‌కు నో బ్రేక్స్‌.. అజిత్‌కు మాత్రం అన్నీ అడ్డంకులే! - undefined

Vijay Ajith Movies : కోలీవుడ్​ హీరోలు అజిత్​, విజయ్​.. ఈ ఏడాది సంక్రాంతి బరిలో దిగి విజయాల్ని అందుకున్నారు. ఆ తర్వాత విజయ్​ కొత్త చిత్రం ఇప్పటికే మొదలుపెట్టగా.. అజిత్​ సినిమా మాత్రం ప్రారంభం కాలేదు. ఎందుకలా?

kollywood-stars-ajith-vijay-latest-movies-
kollywood-stars-ajith-vijay-latest-movies-
author img

By

Published : Jun 5, 2023, 4:38 PM IST

Updated : Jun 5, 2023, 4:50 PM IST

Vijay Ajith Movies : కోలీవుడ్​ స్టార్​ హీరోలు అజిత్​, విజయ్​కు క్రేజ్​ గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. కేవలం తమిళంలోనే కాకుండా తెలుగులోనూ తమదైన ప్రతిభతో అభిమానులను సంపాదించుకున్నారు. అలా ఈ ఏడాది సంక్రాంతి బరిలోకి వీరిద్దరూ దిగారు. తెగింపుతో అజిత్​.. వారసుడుతో విజయ్​.. థియేటర్లలో సందడి చేశారు. తమ ఖాతాల్లో హిట్​లు వేసుకున్నారు. ఆ తర్వాత విజయ్​.. తన లైనప్​తో బిజీ అయ్యారు. లోకేశ్​ కనగరాజ్​ దర్శకత్వంలో కొత్త చిత్రాన్ని త్వరగానే ప్రారంభించారు. లియో పేరుతో తెరకెక్కుతున్న ఆ సినిమా షూటింగ్​ చివరి దశలో ఉంది. కానీ అజిత్​ తాజా మూవీ ఇప్పటివరకు ఇంకా ప్రారంభం కాలేదు.

Ajith 62 Movie : కొద్ది రోజుల క్రితం.. అజిత్​ తన 62వ చిత్రాన్ని ప్రకటించారు. ఏ ముహుర్తాన ప్రకటించారో గానీ ఆ సినిమా పలు సమస్యలను ఎదుర్కొంటోంది. ఈ చిత్రానికి స్టార్​ హీరోయిన్​ నయనతార భర్త దర్శకుడు విఘ్నేశ్​ శివన్‌ దర్శకత్వం వహించాల్సి ఉంది. కథ మొత్తం సిద్ధమైంది. ఇక సెట్‌పైకి వెళ్లడమే తరువాయి అనుకుంటున్న తరుణంలో అనూహ్యంగా ఈ చిత్రం నుంచి విఘ్నేశ్​ శివన్‌ వైదొలిగారు. ఆయన స్క్రీన్‌ప్లే లైకా ప్రొడక్షన్స్‌ అధినేతకు, అజిత్‌కు సంతృప్తిని కలిగించకపోవడం కారణమని సినీ వర్గాల్లో వినికిడి. ఆ తరువాత చిత్ర కథ మారింది. దర్శకుడు మారారు. అనూహ్యంగా దర్శకుడు మగిళ్‌ తిరుమేణి తెరపైకి వచ్చారు. ఈయన చెప్పిన కథ నచ్చడంతో లైకా ప్రొడక్షన్స్‌ చిత్రాన్ని నిర్మించడానికి సిద్ధమైంది. అజిత్‌ పుట్టినరోజు సందర్భంగా మే 1వ తేదీన 'విడామయర్చి' అని చిత్ర టైటిల్‌ వెల్లడించారు. దీంతో షూటింగ్‌ ప్రారంభం అవుతుందని అందరూ భావించారు.

సరిగ్గా అదే సమయంలో విదేశీ బైక్‌ ప్రయాణానికి అజిత్​ వెళ్లిపోయారు. ఇటీవలే ఆయన తిరిగి రావడంతో జూన్‌ తొలి వారంలో విరామం వీడి చిత్ర షూటింగ్‌ మొదలవుతుందని ప్రచారం జరిగింది. ఇందులో నటి త్రిష హీరోయిన్​గా నటించనుందని వార్తలు కూడా వచ్చాయి. అయితే అలా జరగలేదు. తాజా సమాచారం ప్రకారం అజిత్‌, దర్శకుడు మగిళ్‌ తిరుమేణి ప్రస్తుతం లండన్‌లో మకాం పెట్టినట్లు తెలిసింది. విడామయర్చి చిత్ర షూటింగ్‌ గురించి చర్చలు జరుపుతున్నట్లు సమాచారం. ఈ చిత్ర షూటింగ్‌ను పలు దేశాల్లో నిర్వహించనున్నట్లు, ఈ నెల చివరిలో షూటింగ్‌ను ప్రారంభించనున్నట్లు తెలుస్తోంది. ఇందులో నటుడు అజిత్‌ రెండు విభిన్న గెటప్‌లలో కనిపిస్తున్నట్లు సమాచారం. మరి అజిత్​ తన కొత్త చిత్రంతో ప్రేక్షకుల ముందుకు ఎప్పుడు వస్తారోనని ఆయన అభిమానులు వేచి చూస్తున్నారు.

Last Updated : Jun 5, 2023, 4:50 PM IST

For All Latest Updates

TAGGED:

ajith

ABOUT THE AUTHOR

author-img

...view details

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.