ETV Bharat / entertainment

'కాఫీ విత్ కరణ్'లో బన్నీ, తారక్, చెర్రీ... ఈ సీజన్​లో మనోళ్లదే హవా! - ప్రభాస్ కాఫీ విత్ కరణ్

koffee with karan allu arjun: 'కాఫీ విత్ కరణ్ షో'లో టాలీవుడ్ స్టార్లు అల్లు అర్జున్, రామ్ చరణ్, తారక్​లు సందడి చేయనున్నట్లు తెలుస్తోంది. ఓటీటీలో ప్రసారమయ్యే ఏడో సీజన్​కు పెద్ద సంఖ్యలో సౌత్ఇండియా స్టార్లను గెస్టులుగా పిలవనున్నట్లు సమాచారం. డార్లింగ్ ప్రభాస్ మరోసారి ఈ షోలో సందడి చేయనున్నట్లు టాక్!

koffee with karan allu arjun
koffee with karan allu arjun
author img

By

Published : May 7, 2022, 11:55 AM IST

koffee with karan allu arjun: బాలీవుడ్ మోస్ట్ పాపులర్ టాక్ షో 'కాఫీ విత్ కరణ్'. ప్రముఖ దర్శక నిర్మాత కరణ్ జోహార్ వ్యాఖ్యాతగా వ్యవహరించే ఈ షోకు ఎంతో మంది టాప్ సెలెబ్రిటీలు వస్తుంటారు. ఈ షో ఏడో సీజన్​ను ఓటీటీలో ప్రసారం చేయనున్నట్లు ఇదివరకే కరణ్ వెల్లడించారు. ఇప్పటివరకు బాలీవుడ్ సెలెబ్రిటీలే ప్రధానంగా పాల్గొనే ఈ షోలో ఇకపై.. సౌత్ఇండియా స్టార్లు సందడి చేయనున్నారు. దేశవ్యాప్తంగా ఉన్న వివిధ చిత్ర పరిశ్రమల నుంచి సెలెబ్రిటీలను పిలవనున్నట్లు తెలుస్తోంది. పుష్పతో పాన్ ఇండియా రేంజ్​లో మరింత క్రేజ్ పెంచుకున్న అల్లు అర్జున్.. ఈ టాక్​షోలో పాల్గొంటారని సమాచారం. పుష్పలో తన తోటి నటి రష్మిక మంధానతో కలిసి కాఫీ విత్ కరణ్​కు బన్నీ వస్తారని తెలుస్తోంది.

koffee with karan season 7: రష్మిక ఇప్పటికే అన్ని సినీ ఇండస్ట్రీలలో సినిమాలు చేస్తూ దూసుకెళ్తున్నారు. ఆమె ఖాతాలో రెండు హిందీ సినిమాలు కూడా ఉన్నాయి. మరోవైపు, అల్లు అర్జున్ ఇటీవల బాలీవుడ్ దర్శకుడు సంజయ్ లీలా భన్సాలీతో భేటీ అయ్యారు. హిందీలో నేరుగా ఓ చిత్రం చేసేందుకే వీరు కలిశారని ఇండస్ట్రీ వర్గాలు కోడై కూస్తున్నాయి. ఈ నేపథ్యంలో వీరిరువురూ కరణ్ జోహార్ షోలో పాల్గొంటారని ప్రస్తుతం కథనాలు వస్తున్నాయి.

మరోవైపు, రామ్​చరణ్, తారక్ సైతం కరణ్ షోలో కనివిందు చేయనున్నట్లు సమాచారం. టాలీవుడ్ నుంచి ప్రభాస్ ఇప్పటికే రెండుసార్లు ఈ షోకు వెళ్లారు. బాహుబలి సమయంలో ఓసారి, సాహో సినిమా రిలీజ్​కు ముందు మరోసారి కరణ్​ షోలో పాల్గొన్నారు. అయితే, డార్లింగ్​ను మరోసారి గెస్ట్​గా కరణ్ ఆహ్వానించనున్నట్లు తెలుస్తోంది. సమంత, నయనతార, విగ్నేశ్ శివన్ సహా మరికొందరు టాలీవుడ్, సౌత్ సెలెబ్రిటీలు ఇందులో పాల్గొంటారని టాక్.

ఇదీ చదవండి: కేజీఎఫ్ నటుడు మృతి... సినీ ప్రముఖుల దిగ్భ్రాంతి

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.