King Of Kotha Movie : సీతారామం హీరో దుల్కర్ సల్మాన్ - దర్శకుడు అభిలాష్ జోషి కాంబినేషన్లో తెరకెక్కిన సినిమా 'కింగ్ ఆఫ్ కొత్త'. పాన్ ఇండియా లెవెల్లో రూపొందిన ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ హైదారాబాద్‌లో ఆదివారం ఘనంగా జరిగింది. కాగా ఈ వేడుకకు టాలీవుడ్ స్టార్ హీరోలు దగ్గుబాటి రానా, నాని ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. హీరో నాని మాట్లాడుతూ.. పాన్ ఇండియా సినిమాలపై ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు. మరి నాని ఏమన్నాడంటే..
"ప్రస్తుతం అందరూ పాన్ ఇండియా సినిమా అంటున్నారు. కానీ నాకు ఆ పదం నచ్చదు. కానీ రియల్ పాన్ ఇండియా స్టార్ మాత్రం దుల్కరే. ఎందుకంటే తన కోసం తెలుగు, తమిళ్, హిందీ, మలయాళ, కన్నడ అన్ని భాషల డైరెక్టర్లు కథ రాస్తారు. ఇది కదా అసలైన పాన్ ఇండియా స్టార్‌కు అర్థం. ఈ సినిమా ('కింగ్ ఆఫ్ కొత్త') ట్రైలర్ బాగుంది. సినిమా కూడా సక్సెస్ అవ్వాలని కోరుకుంటున్నా" అని నాని అన్నారు. అలాగే దుల్కర్ సల్మాన్, తనకు మధ్య ఉన్న అనుబంధం గురించి నాని చెప్పుకొచ్చారు. దుల్కర్ నటించిన 'ఓకే బంగారం' సినిమాకు తెలుగు డబ్బింగ్ చెప్పింది తనేనంటూ నాని ఈ వేదికపై గుర్తుచేసుకున్నారు.
అలాగే వేడుకకు హాజరైన మరో స్టార్ హీరో రానా మాట్లాడుతూ.. " యాక్టింగ్ స్కూల్లో దుల్కర్ నా జూనియర్. తను చాలా పద్ధతిగా ఉంటాడు. ఇప్పుడు తను 'కింగ్ ఆఫ్ కొత్త' లాంటి ఓ వైల్డ్ యాక్షన్ సినిమా చేయడం నాకు హ్యాపీగా ఉంది" అని అన్నారు. కాగా 'కింగ్ ఆఫ్ కొత్త' తన డ్రీమ్ ప్రాజెక్ట్ అంటూ దుల్కర్ సల్మాన్ చెప్పుకొచ్చారు. కెరీర్లో ఇది పెద్ద సినిమాగా నిలుస్తుందని దుల్కర్ అన్నారు. అయితే ఈ సినిమాకు నాలుగు భాషల్లో డబ్బింగ్ తనే చెప్పుకున్నాడట. ఇక ఈ సినిమా అందరికి నచ్చుతుందని ధీమా వ్యక్తం చేశారు దుల్కర్.
ఇక ఈ సినిమాలో దుల్కర్ సల్మాన్‌కు జోడీగా హీరోయిన్ ఐశ్వర్య లక్ష్మీ నటించారు. రితికా సింగ్, అనికా సురేంద్రన్, ధ్రువ్ విక్రమ్ తదితరులు కీలక పాత్రల్లో నటించారు. జీ స్టూడియోస్, వేఫేరర్ ఫిల్మ్స్ సంస్థలు ఈ చిత్రాన్ని సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. కాగా ఆగస్ట్ 24న ఈ సినిమా థియేటర్లలో విడుదల కానుంది.
-
Team #KingOfKotha from the Grand Pre-Release Event 🤩
— Wayfarer Films (@DQsWayfarerFilm) August 13, 2023 " class="align-text-top noRightClick twitterSection" data="
Natural 🌟 @NameisNani , Handsome Hulk @RanaDaggubati graced the Event 😎@dulQuer @AishuL_ @actorshabeer @E4Emovies @MediaYouwe pic.twitter.com/1yqtkNXnYY
">Team #KingOfKotha from the Grand Pre-Release Event 🤩
— Wayfarer Films (@DQsWayfarerFilm) August 13, 2023
Natural 🌟 @NameisNani , Handsome Hulk @RanaDaggubati graced the Event 😎@dulQuer @AishuL_ @actorshabeer @E4Emovies @MediaYouwe pic.twitter.com/1yqtkNXnYYTeam #KingOfKotha from the Grand Pre-Release Event 🤩
— Wayfarer Films (@DQsWayfarerFilm) August 13, 2023
Natural 🌟 @NameisNani , Handsome Hulk @RanaDaggubati graced the Event 😎@dulQuer @AishuL_ @actorshabeer @E4Emovies @MediaYouwe pic.twitter.com/1yqtkNXnYY