ETV Bharat / entertainment

'కేజీయఫ్'​ నటుడికి కారు ప్రమాదం.. వేగంగా వస్తున్న ట్రక్కు ఢీకొని.. - అవినాష్

తన జీవితంలోనే అత్యంత భయానక పరిస్థితిని అనుభవించినట్లు తెలిపారు కన్నడ నటుడు బీఎస్ అవినాష్. రాకింగ్ స్టార్ యశ్ నటించిన 'కేజీయఫ్'​ చిత్రంతో ఆయన గుర్తింపు తెచ్చుకున్నారు. బుధవారం ఉదయం అవినాష్ కారు ప్రమాదానికి గురయ్యారు. ఈ విషయాన్ని సామాజిక మాధ్యమాల ద్వారా వెల్లడించారు.

KGF
B S Avinash
author img

By

Published : Jun 30, 2022, 4:49 PM IST

'కేజీయఫ్'​ నటుడు బీఎస్​ అవినాష్​ కారు ప్రమాదానికి గురయ్యారు. బుధవారం ఉదయం బెంగళూరులోని అనిల్ కుంబ్లే సర్కిల్​ వద్ద ఆయన కారును వేగంగా వస్తున్న ట్రక్కు ఢీకొట్టింది. అయితే అదృష్టవశాత్తు ఆయన ప్రాణాలతో సురక్షితంగా బయటపడ్డారు. ఈ విషయాన్ని ఫేస్​బుక్​ వేదికగా వెల్లడించారు అవినాష్.

KGF
యశ్​తో అవినాష్​

'కేజీయఫ్'​లో ఆండ్రూ పాత్రతో మంచి గుర్తింపు తెచ్చుకున్నారు అవినాష్​. బుధవారం ఉదయం జిమ్​కు వెళ్తుండగా.. ఈ ప్రమాదం జరిగినట్లు ఆయన తెలిపారు. గ్రీన్​ సిగ్నల్​ పడగానే తన కారును ముందుకు పోనిస్తుండగా.. రెడ్​ సిగ్నల్​ను అతిక్రమిస్తూ ఓ ట్రక్కు వచ్చి ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో కారుకు మాత్రమే నష్టం జరిగినట్లు 'ఆండ్రూ' తెలిపారు. ట్రక్కు డ్రైవర్​ను పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం.

ఇదీ చూడండి: పోలీసులను ఆశ్రయించిన సీనియర్​ నటి పవిత్ర

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.