ETV Bharat / entertainment

'కేజీఎఫ్ 3' ప్రీ ప్రొడక్షన్ వర్క్ షురూ! - కేజీఎఫ్ 2 మూవీ కలెక్షన్స్​

KGF 3 movie pre productions work: 'కేజీఎఫ్​ 2'కు కొనసాగింపుగా 'కేజీఎఫ్​ 3' ప్రీ ప్రొడక్షన్​ పనులు ప్రారంభమయ్యాయని తెలిసింది. దీంతో పాటే 'కేజీఎఫ్​ 2' రెండో రోజు కలెక్షన్స్​ వివరాలు కూడా వచ్చాయి.

KGF 3 pre production work starts
KGF 3 pre production work starts
author img

By

Published : Apr 16, 2022, 9:49 AM IST

KGF 2 Day 2 collections: కన్నడ రాకింగ్ స్టార్​ హీరో యశ్​ నటించిన తాజా చిత్రం 'కేజీఎఫ్ 2'. ఏప్రిల్​ 14న విడుదలైన ఈ చిత్రం అభిమానులను విపరీతంగా ఆకట్టుకుంది. రెండో రోజు కూడా బాక్సాఫీస్ వద్ద దూకుడు కొనసాగించింది. తొలి రోజు రూ.134 కోట్ల గ్రాస్​ను అందుకున్న ఈ మూవీ రెండో రోజు పూర్తయ్యేసరికి రూ.275కోట్లు సాధించిందని ట్రేడ్​ వర్గాలు పేర్కొన్నాయి.

KGF 3 pre productions works: మరోవైవు ఈ సినిమా ఎండింగ్​లో కేజీఎఫ్ 3 రాబోతున్నట్లు హింట్​ ఇచ్చారు దర్శకుడు ప్రశాంత్ నీల్. దీంతో 'కేజీఎఫ్ 3' కూడా రాబోతుందని తెలియడం వల్ల అభిమానుల్లో మరింత జోష్​ పెరిగింది. అయితే ఫ్యాన్స్​కు ఆనందానిచ్చే వార్త మరొకటి బయటకు వచ్చింది. ఈ సినిమా ప్రీ ప్రొడక్షన్​ పనులు కూడా ప్రారంభమయ్యాయని తెలిసింది. ఈ విషయాన్ని 'కేజీఎఫ్'​ ఎక్సుక్యూటివ్​ ప్రొడ్యూసర్​ కార్తిక్​ గౌడ చెప్పినట్లు కథనాలు వస్తున్నాయి. దీని గురించి త్వరలోనే అధికార ప్రకటన వచ్చే అవకాశం ఉంది. కాగా, ప్రస్తుతం దర్శకుడు ప్రశాంత్ నీల్​.. ప్రభాస్​తో 'సలార్​' సినిమాను పూర్తి చేసే పనిలో బిజీగా ఉన్నారు. దీని తర్వాత ఎన్టీఆర్​, రామ్​చరణ్​తో సినిమా చేయనున్నట్లు ఇది వరకే ఆయన ప్రకటించారు. మరి 'కేజీఎఫ్​ 3'ని ఎప్పుడు సెట్స్​పైకి తీసుకెళ్తారో చూడాలి.

ఇదీ చూడండి: 'రాఖీభాయ్'​కు బాక్సాఫీస్​ సలాం- హిందీలో ఆమిర్​ఖాన్​ రికార్డ్​ బద్దలు

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.