ETV Bharat / entertainment

లుంగీ కట్టి మాస్​బీట్​కు స్టెప్పులేసిన కీర్తి సురేశ్.. ఇక కుర్రాళ్ల హార్ట్​ హైజాకే.. - కీర్తి సురేశ్​ దసరా సాంగ్​ డ్యాన్స్

వరుస సినిమాలో జోరు మీదున్న కీర్తి సురేశ్.. గ్లామర్ డోస్​ పెంచి కుర్రకారును పిచ్చెక్కిస్తోంది. తాజాగా మాస్​ పాటకు లుంగీ కట్టి అదిరిపోయే డ్యాన్స్​ చేసింది. దీంతో ఆ వీడియో సోషల్​ మీడియాలో వైరల్​ అయ్యింది.

keerthi suresh grace dance
keerthi suresh grace dance
author img

By

Published : Oct 15, 2022, 4:27 PM IST

తెలుగు తెరపై వెలిగి.. ఆశేష అభిమానులను సంపాదించుకున్న మహానటి కీర్తి సురేశ్​​. తెలుగులో పాటు వివిధ భాషల్లో అగ్ర తారగా కొనసాగుతోంది. ఈ సుందరి ప్రస్తుతం ఓ పాటకు అదిరిపోయే స్టెప్పులేసింది. దీంతో ఆ వీడియో నెట్టింట్లో చక్కర్లు కొడుతోంది.

తెలుగులో నేచురల్​ స్టార్​ నానితో 'దసరా' అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతోంది కీర్తి సురేశ్​. అందులోని ఓ పాట దసరా ఫెస్టివల్ సందర్భంగా రిలీజ్ అయింది. ఆ పాటకు.. కీర్తి మోకాళ్ల దాకా లుంగీ కట్టి.. బీటుకు తగ్గట్టుగా ఆడింది. దీంతో కుర్రకారు హార్ట్​ బీట్​ అమాంతం పెరిగిపోతోంది అనడం అతిశయోక్తి కాదు. అంత గ్రేస్​ఫుల్​గా డ్యాన్స్​ ఇరగదీసింది.

తెలుగు సినిమాల్లోకి డీసెంట్​గా ఎంట్రీ ఇచ్చిన హీరోయిన్ కీర్తి సురేష్.. మొదట క్లాస్​ సినిమాలతో బ్యాక్ టు బ్యాక్ చిత్రాలతో అలరించింది. టాలీవుడ్​లో హీరోయిన్లలో పోటీ ఎక్కువగా ఉండటం వల్ల అందాల ఆరబోత మొదలు పెట్టింది. చివరి సారిగా సూపర్ స్టార్ మహేశ్ బాబు సరసన 'సర్కారు వారి పాట' సినిమాలో నటించింది. గతంలో తను నటించిన అన్ని చిత్రాల కంటే ఈ మూవీలో ఎక్కువగానే గ్లామర్ షో చేసింది ఈ చిన్నది. ఈ సినిమా నుంచి కొత్తగా కనిపిస్తోంది కీర్తి.

ప్రస్తుతం కీర్తి సురేష్.. నేచురల్ స్టార్ నాని సరసన 'దసరా' సినిమాలో నటిస్తోంది. ఈ సినిమా చిత్రీకరణ తుది దశలో ఉన్నట్టు తెలుస్తోంది. అయితే ఈ సినిమా నుంచి దసరా సందర్భంగా ఓ సాంగ్​ విడుదల చేశారు. తెలంగాణ మాండలికంలో.. మాస్​ బీట్​తో ఉన్న ఆ సాంగ్​లో.. నాని డ్యాన్స్​ ఇరగదీశారు. ఆ సినిమాలో నాని ఉన్న గెటప్​లో.. తాజాగా కీర్తి సురేష్​ లుంగీ కట్టుకుని అదే పాటకు డ్యాన్స్​ చేసింది.

ఇవీ చదవండి : సల్మాన్​ 'టైగర్‌ - 3' రిలీజ్‌ అప్పుడే

ర్యాంప్​ వాక్​తో హీటెక్కించిన అందాల తారలు చూస్తే కళ్లు తిప్పుకోరంతే

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.