ETV Bharat / entertainment

అవును ఆ హీరోయిన్​తో ప్రేమలో పడ్డా: హీరో కార్తిక్​ ఆర్యన్​ - కార్తిక్ ఆర్యన్​ సారా అలీఖాన్​

Karthik Aryan Sara Alikhan lovestory: హీరో కార్తిక్​ ఆర్యన్-సారా అలీఖాన్​ ప్రేమలో ఉన్నట్లు గతంలో వార్తలు వచ్చాయి. తాజాగా కార్తిక్​.. ​ తన లవ్​స్టోరీపై స్పందించారు. ఏమన్నారంటే..

Karthik Aryan Sara Alikhan lovestory:
కార్తిక్ ఆర్యన్​ సారా అలీఖాన్​ లవ్​స్టోరీ
author img

By

Published : May 25, 2022, 9:33 PM IST

Karthik Aryan Sara Alikhan lovestory: ఇటీవలే 'భూల్ భులయ్యా 2'తో సక్సెస్‌ అందుకున్నారు బాలీవుడ్‌ హీరో కార్తిక్​ ఆర్యన్​. బాక్సీఫీస్​ వద్ద మంచి వసూళ్లను అందుకుందీ చిత్రం. ఈ విషయంతో ఫుల్​ ఖుషీలో ఉన్న కార్తిక్​ తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొని తన రియల్​ లవ్​స్టోరీపై స్పందించారు. "బాలీవుడ్‌కు చెందిన హీరోయిన్‌తో మీరు ప్రేమలో ఉన్నారా?" అని ప్రశ్నించగా.. "ఉన్నాను. గతంలో ఓ బీటౌన్‌ నటిని ప్రేమించాను. కానీ ఆమె పేరు మాత్రం బయటపెట్టను" అని కార్తిక్‌ అన్నారు. కాగా, 'లవ్‌ ఆజ్‌ కల్‌ 2' చిత్రీకరణ సమయంలో సారా-కార్తిక్‌ ప్రేమలో ఉన్నట్లు వార్తలు వచ్చాయి. అనంతరం ఇద్దరి మధ్య మనస్పర్థలు తలెత్తడం వల్ల విడిపోయారని చెప్పుకున్నారు. ఈ క్రమంలో కార్తిక్‌ మరో హీరోయిన్‌తో ప్రేమలో ఉన్నారని నెట్టింట పుకార్లు వినిపిస్తున్నాయి.

అనంతరం, నటీనటుల రిలేషన్‌షిప్‌పై మీడియాలో వచ్చే కథనాల గురించి స్పందిస్తూ.. "షూటింగ్స్‌ నుంచి విరామం దొరికినప్పుడు కోస్టార్స్‌తో కలిసి కాఫీకి వెళ్లినా లేదా ఏదైనా ప్రాంతానికి వెళ్లినా.. వాళ్లిద్దరూ రిలేషన్‌లో ఉన్నారంటూ పలువురు అసత్య ప్రచారాలు సృష్టిస్తారు" అని తెలిపారు. ఇక 'భూల్​ భులయ్యా 2' విషయానికొస్తే.. దీనికి అనీస్‌ దర్శకత్వం వహించగా.. కార్తిక్‌కు జోడీగా నటి కియారా అడ్వాణీ నటించారు. టబు కీలకపాత్ర పోషించారు.

ఇదీ చూడండి: లైఫ్​లో కాంప్రమైజ్​ అవ్వన్నంటున్న చైతూ.. 'డెడ్​' అంటూ సామ్ పోస్ట్​

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.