ETV Bharat / entertainment

అది జరిగితే.. నా పెళ్లి గురించి చెబుతా: కార్తిక్ ఆర్యన్​ - కార్తిక్ ఆర్యన్ భూల్ భులయ్య 2

Karhtik Aryan marriage: తాను ఎప్పుడు పెళ్లి చేసుకుంటారో చెప్పారు హీరో కార్తిక్ ఆర్యన్​. దీంతో పాటే 'భూల్​ భులయ్యా 2' చిత్రానికి వచ్చిన లాభాల్లో తన వాటా ఎంతో తెలిపారు.

karthik aryan
కార్తిక్​ ఆర్యన్​
author img

By

Published : Jun 8, 2022, 12:43 PM IST

Karhtik Aryan marriage: కరోనా కారణంగా కళ తప్పిన బాలీవుడ్‌ చిత్రపరిశ్రమకు సక్సెస్‌ రుచి చూపించిన చిత్రం 'భూల్‌ భులయ్యా 2'. బాలీవుడ్‌ యువ హీరో కార్తిక్‌ ఆర్యన్‌ నటించిన ఈ హారర్‌ కామెడీ ఎంటర్‌టైనర్‌ గత నెలలో విడుదలై సుమారు రూ.150 కోట్ల వసూళ్లు రాబట్టినట్లు సమాచారం. ప్రస్తుతం కార్తిక్‌ ప్రస్తుతం ఈ సినిమా సక్సెస్‌ని ఎంజాయ్‌ చేస్తున్నారు. తదుపరి చిత్రాల షూట్‌ నుంచి కాస్త విరామం దొరకడం వల్ల తాజాగా ఆయన సోషల్‌మీడియా వేదికగా అభిమానులతో ముచ్చటించారు.

#ASKKarthik పేరుతో నిర్వహించిన ఈ ట్విటర్‌ ఛాట్‌లో అభిమానులు పలు ప్రశ్నలు వేయగా.. ఆయన సరదాగా రిప్లైయ్‌ ఇచ్చారు. "మోస్ట్ ఎలిజిబుల్‌ బ్యాచిలర్‌ కార్తిక్‌.. పెళ్లిపై మీ ప్లాన్స్‌ ఏమిటి?" అని ప్రశ్నించగా... "మొదట నన్ను రిలేషన్‌షిప్‌లోకి వెళ్లనివ్వండి. ఆ తర్వాత పెళ్లిముచ్చట్లు మాట్లాడుకుందాం. నేను సింగిల్‌గానే ఉండిపోతానని అనిపిస్తుంది" అని అన్నారు. అనంతరం మరో నెటిజన్‌.. "సర్‌.. భూల్‌ భులయ్యా 2 చిత్రానికి రూ.150 కోట్ల లాభాలు వచ్చాయి కదా. అందులో మీ వాటాగా ఎంత తీసుకున్నారు?" అని ప్రశ్నించారు. దానిపై కార్తిక్‌ స్పందిస్తూ.. లాభాల నుంచి తాను ఎలాంటి వాటా తీసుకోలేదని అన్నారు. అంతేకాకుండా ఈ సినిమా వల్ల తనకు అభిమానుల నుంచి విపరీతమైన ప్రేమ దొరికిందని.. ఆ ప్రేమ డబ్బు కంటే గొప్పదని తెలిపారు. కాగా, అనీస్‌ దర్శకత్వం వహించిన ఈ సినిమాలో కియారా అడ్వాణీ కథానాయిక.

ఇదీ చూడండి: అవును ఆ హీరోయిన్​తో ప్రేమలో పడ్డా: హీరో కార్తిక్​ ఆర్యన్​

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.