ETV Bharat / entertainment

జూన్ నుంచి సెట్స్ పైకి 'కాంతార 2'.. కానీ సీక్వెల్ మాత్రం కాదు! - కాంతార 2 సీక్వెల్​

చిన్న సినిమాగా విడుదలై బాక్సాఫీస్​ వద్ద రికార్డులు సృష్టించిన కాంతార సినిమా సీక్వెల్​ కోసం ఎంతో మంది ఎదురుచూస్తున్నారు. అయితే ఈ మూవీకి సీక్వెల్​ రావట్లేదంట. ప్రీక్వెల్​ వస్తోందట. ఆ సంగతులు..

kantara 2
kantara 2
author img

By

Published : Jan 21, 2023, 3:21 PM IST

గతేడాది బిగ్గెస్ట్‌ హిట్లలో కాంతార ఒకటి. చిన్న సినిమాగా విడుదలై బాక్సాఫీస్‌ దగ్గర సంచలనాలు సృష్టించింది. గతేడాది సెప్టెంబర్‌లో భారీ అంచనాల మధ్య కన్నడలో రిలీజైన ఈ మూవీ మొదటి రోజు నుంచే పాజిటివ్‌ టాక్‌ తెచ్చుకుని భారీ వసూళ్లు సాధించింది. ఇక ఈ సినిమాకు వస్తున్న ఆదరణతో అన్ని భాషల ప్రేక్షకుల నుంచి భారీ డిమాండ్‌ ఏర్పడింది.

దీంతో మేకర్స్‌ పలు భాషల్లోకి డబ్ చేసి రిలీజ్ చేశారు. తెలుగుతో పాటు హిందీ, తమిళ్‌, మలయాళ భాషల్లో ఈ చిత్రాన్ని రిలీజ్‌ చేశారు. ఇక రిలీజైన ప్రతి భాషలో భారీ వసూళ్లను సాధిస్తూ డబుల్‌ బ్లాక్‌బస్టర్​గా నిలిచింది. ఈ సినిమా కలెక్షన్‌ల పరంగానే కాదు అవార్డుల్లోనూ సరికొత్త రికార్డులను సృష్టించింది. భారత్​ తరఫున ఆస్కార్‌కు నామినేట్‌ అయిన పది సినిమాల్లో ఇది కూడా ఒకటి.

ఇదిలా ఉంటే, తాజాగా ఈ సినిమాకు పార్ట్‌-2 తెరకెక్కనున్నట్లు సమాచారం. గతంలో రిషబ్‌శెట్టి పార్ట్‌-2 తీసే ఉద్దేశమే లేదని పలుసార్లు చెప్పారు. కానీ ప్రేక్షకుల నుంచి భారీగా డిమాండ్‌ రావడం వల్ల సెకండ్‌ పార్ట్‌ను ప్లాన్‌ చేస్తున్నారట. అయితే సెకండ్‌ పార్ట్‌ను సీక్వెల్‌గా కాకుండా ప్రీక్వెల్‌గా తెరకెక్కించాలని నిర్ణయించుకున్నారట. రెండో భాగంలో రిషబ్‌ తండ్రి జీవితం, ఆయన చనిపోయి ఎటెళ్లారు అనే అంశాలను చూపించబోతున్నట్లు టాక్‌.

ఇందులో భాగంగానే రిషబ్​ తాజాగా కర్ణాటకలోని కోస్టల్‌ ప్రాంతానికి వెళ్లారట. వీలైనంత త్వరగా ఈ సినిమాను సెట్స్‌ మీదకు తీసుకెళ్లి, వచ్చే ఏడాది సమ్మర్‌లో రిలీజ్‌ చేయాలని మేకర్స్‌ ప్లాన్‌ చేస్తున్నారట. జూన్ నుంచి ఈ మూవీ రెగ్యులర్ షూటింగ్ స్టార్ట్ అయ్యే ఛాన్స్ ఉందని శాండల్ వుడ్ వర్గాల సమాచారం. అయితే కాంతార సినిమాకు ప్రధాన బలం.. 'భూతకోల' మరి ఈ భూతకోలని ఎలా చేస్తారు? ఎక్కడ చేస్తారు? లాంటి విషయాలను ఫస్ట్ పార్ట్​లోనే చూపించేశారు కాబట్టి ప్రీక్వెల్​లో రిషబ్ కొత్తగా ఏం చూపిస్తాడనేది ఆలోచించాల్సిన విషయమే.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.