కన్నడ ఇండస్ట్రీ రేంజ్‌ను మరోసారి పాన్ ఇండియా లెవెల్లోకి తీసుకెళ్లింది రిషబ్ శెట్టి స్వీయ దర్శకత్వంలో వచ్చిన 'కాంతార' సినిమా. కంటెంట్‌తో పాటు సినిమాలోని ప్రతి పాత్ర అద్భుతంగా ఉండటంతో ఈ సినిమాకు ప్రేక్షకులు బ్రహ్మరథం పట్టారు. దీంతో మేకర్స్ ఈ చిత్రాన్ని తెలుగు, తమిళంతో పాటు హిందీ, మలయాళం, తులు వంటి పలు భాషల్లోకి డబ్ చేసి రిలీజ్ చేశారు. రిలీజైన అన్ని భాషల్లోనూ సూపర్ హిట్ టాక్‌తో పాటు సినీ రాజకీయ ప్రముఖుల ప్రశంసలను అందుకుంది. ఈ సినిమా వంద రోజుల వేడుకలో ఈ చిత్రానికి సీక్వెల్ కాకుండా ప్రీక్వెల్ ఉంటుందని రిషబ్ తెలిపారు.
తాజాగా అభిమానుల కోసం రిషబ్ శెట్టి.. ఉగాది పండుగ సందర్భంగా ఓ గుడ్ న్యూస్‌ను షేర్ చేశారు. 'కాంతార' ప్రీక్వెల్‌కు సంబంధించి స్క్రిప్ట్ పనులు మొదలయ్యాయంటూ ఓ ట్వీట్ చేశారు. ఈ ట్వీట్‌ను చిత్ర నిర్మాణ సంస్థ హొంబాలే ఫిల్మ్స్ కూడా రీట్వీట్ చేసింది. కాంతార ప్రీక్వెల్ అప్డేట్ రావడంతో ఫ్యాన్స్ ఖుషీ అవుతున్నారు. ఆల్ ది బెస్ట్ చెబుతున్నారు. 'నెక్స్ట్ ఆస్కార్ నామినేషన్ లోడింగ్' అంటూ కామెంట్లు పెడుతున్నారు. రిషబ్ తండ్రి జీవితం, ఆయన చనిపోయి ఎటెళ్లారు అనే అంశాలను ప్రీక్వెల్‌లో చూపించబోతున్నట్లు సమాచారం.
-
ನಾಡಿನ ಸಮಸ್ತ ಜನತೆಗೆ ಯುಗಾದಿ ಹಬ್ಬದ ಶುಭಾಷಯಗಳು.
— Rishab Shetty (@shetty_rishab) March 22, 2023 " class="align-text-top noRightClick twitterSection" data="
Happy Ugadi !
ಬರವಣಿಗೆಯ ಆದಿ…Kantara writing begins ! pic.twitter.com/6nfIfCeEiu
">ನಾಡಿನ ಸಮಸ್ತ ಜನತೆಗೆ ಯುಗಾದಿ ಹಬ್ಬದ ಶುಭಾಷಯಗಳು.
— Rishab Shetty (@shetty_rishab) March 22, 2023
Happy Ugadi !
ಬರವಣಿಗೆಯ ಆದಿ…Kantara writing begins ! pic.twitter.com/6nfIfCeEiuನಾಡಿನ ಸಮಸ್ತ ಜನತೆಗೆ ಯುಗಾದಿ ಹಬ್ಬದ ಶುಭಾಷಯಗಳು.
— Rishab Shetty (@shetty_rishab) March 22, 2023
Happy Ugadi !
ಬರವಣಿಗೆಯ ಆದಿ…Kantara writing begins ! pic.twitter.com/6nfIfCeEiu
ఐరాసలో అరుదైన గౌరవం..
రిషబ్ శెట్టి.. కాంతార సక్సెస్ తర్వాత పలు ఇంటర్వ్యూలను ఇచ్చారు. అయితే ఇటీవలే ఈ సినిమాకు విశ్వవ్యాప్తంగా ఓ అరుదైన గౌరవం దక్కింది. స్విట్జర్లాండ్ జెనీవా లోని ఐక్యరాజ్య సమితి కార్యాలయంలో మార్చి 17న ఈ సినిమాను ప్రదర్శించారు. దీని కోసం స్విట్జర్లాండ్‌కు చేరుకున్న రిషబ్ శెట్టి.. సినిమా స్క్రీనింగ్ పూర్తైన అనంతరం ప్రసంగించారు. ఈ ఆనందభరితమైన క్షణాలను దర్శకుడు రిషభ్ శెట్టి తన ట్విట్టర్ అకౌంట్లో షేర్ చేశారు.
ఇక సినిమా విషయానికి వస్తే.. గతేడాది సెప్టెంబర్‌లో రిలీజయ్యింది కన్నడ సినిమా కాంతార. రిషబ్ శెట్టి స్వీయ దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమాలో రిషబ్‌తో పాటు సప్తమీ గౌడ, కిశోర్ కుమార్, నవీన్ డీ పడ్లి, ప్రమోద్ శెట్టి అచ్యుత్ కుమార్ లాంటి తారలు కీలక పాత్రలు పోషించారు. అంజనీష్ లోక్ నాథ్ సినిమాకు మ్యూజిక్ డైరెక్టర్‌గా వ్యవహరించారు. ఈ సినిమాలోని వరహా రూపం సాంగ్ ప్రేక్షకులను మంత్రముగ్ధులను చేసింది. సినిమాలో హైలైట్‌గా నిలిచింది. ఇక రిషబ్ శెట్టి నటనకు యావత్ దేశం ప్రశంసల వర్షం కురిపించింది.