Kannada Movie Dubbed : కన్నడ, మలయాళ ఇండస్ట్రీల్లో సూపర్ హిట్ అయిన కొన్ని సినిమాలు.. టాలీవుడ్లో కూడా ఇటీవల భారీ స్థాయిలో వసూళ్లు అందుకున్నాయి. వాటిలో కాంతార, చార్లీ 777, 2018 వంటి సినిమాలు ముందు వరుసలో ఉంటాయి. కన్నడ ఇండస్ట్రీలో చిన్న సినిమాగా విడుదలై భారీ సక్సెస్ అందుకున్న 'హాస్టల్ హుడుగురు బేకాగిద్దరే' అనే మూవీ ఇటీవల తెలుగులో 'హాస్టల్ బాయ్స్' పేరుతో విడుదలై మంచి రెస్పాన్స్ అందుకుటోంది. ఇప్పుడు మరో కన్నడ బ్లాక్ బస్టర్ తెలుగు ప్రేక్షకులకు అలరించేందుకు సిద్ధమైంది.
Sapta Sagaradaache Ello Telugu Release : ఇటీవలే రక్షిత్ శెట్టి ప్రొడ్యూస్ చేస్తూ హీరోగా నటించిన 'సప్త సాగర దాచే ఎల్లో' అనే చిత్రం కన్నడలో సూపర్ హిట్ అయింది. రుక్మిణి వసంత హీరోయిన్గా నటించిన ఈ మూవీ.. సెప్టెంబర్ 1న కన్నడలో విడుదలై క్లాసిక్ లవ్ స్టోరీగా నిలిచింది. దర్శకుడు హేమంతరావు సినిమాలో లవ్ స్టోరీని చూపించిన తీరు ఎంతగానో ఆకట్టుకుంది. అంతేకాకుండా ఈ మూవీకి చరణ్ రాజ్ మ్యూజిక్ హైలెట్‌గా నిలిచింది. ఇప్పుడు ఇదే సినిమాను టాలీవుడ్ అగ్ర నిర్మాణ సంస్థ పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ తెలుగులో రిలీజ్ చేస్తోంది.
-
The waves of love are coming your way on sep 2️⃣2️⃣ nd 🥰
— People Media Factory (@peoplemediafcy) September 15, 2023 " class="align-text-top noRightClick twitterSection" data="
Unlock the doors of your hearts and let it sink through 😍❤️#SapthaSagaraluDhaati 📻🐚🌊♥️#SSDFromSep22#SSESideA@Rakshitshetty @rukminitweets @hemanthrao11 @vishwaprasadtg @vivekkuchibotla @peoplemediafcy pic.twitter.com/e4T72qJm69
">The waves of love are coming your way on sep 2️⃣2️⃣ nd 🥰
— People Media Factory (@peoplemediafcy) September 15, 2023
Unlock the doors of your hearts and let it sink through 😍❤️#SapthaSagaraluDhaati 📻🐚🌊♥️#SSDFromSep22#SSESideA@Rakshitshetty @rukminitweets @hemanthrao11 @vishwaprasadtg @vivekkuchibotla @peoplemediafcy pic.twitter.com/e4T72qJm69The waves of love are coming your way on sep 2️⃣2️⃣ nd 🥰
— People Media Factory (@peoplemediafcy) September 15, 2023
Unlock the doors of your hearts and let it sink through 😍❤️#SapthaSagaraluDhaati 📻🐚🌊♥️#SSDFromSep22#SSESideA@Rakshitshetty @rukminitweets @hemanthrao11 @vishwaprasadtg @vivekkuchibotla @peoplemediafcy pic.twitter.com/e4T72qJm69
ఈ మేరకు తాజాగా మూవీ టైటిల్, రిలీజ్ డేట్‌ను పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ అనౌన్స్ చేసింది. 'సప్త సాగరాలు దాటి' అనే టైటిల్‌తో సెప్టెంబర్ 22న తెలుగులో ఈ సినిమాను విడుదల చేస్తున్నట్లు మేకర్స్ ప్రకటించారు. విడుదలకు కేవలం వారం రోజులు ఉంది కాబట్టి తెలుగులోనూ ప్రమోషన్స్ చేసి ట్రైలర్ రిలీజ్ చేస్తే కచ్చితంగా సినిమాపై మంచి బజ్ క్రియేట్ అయ్యే అవకాశం ఉంది. మరి కన్నడ ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుని క్లాసిక్ లవ్ స్టోరీగా పేరు తెచ్చుకున్న ఈ మూవీ తెలుగు ఆడియన్స్‌ను ఏ మేరకు మెప్పిస్తుందో చూడాలి.
'అతడే శ్రీమన్నారాయణ', '777చార్లీ' వంటి సినిమాలతో తెలుగు ఆడియన్స్‌కు బాగా దగ్గరయ్యారు కన్నడ హీరో రక్షిత్ శెట్టి. ఒకప్పుడు నేషనల్ క్రష్ రష్మిక మందన మాజీ ప్రియుడుగా టాలీవుడ్ ఆడియన్స్‌కు పరిచయం ఉన్న ఈ హీరో ఇప్పుడు తన సినిమాలతో హీరోగా తెలుగులోనూ మంచి క్రేజ్ అందుకున్నారు. ఈ హీరో నటించిన ముఖ్యంగా '777 చార్లీ' పాన్ ఇండియాస్థాయిలో ఆకట్టుకుంది. రక్షిత్ శెట్టి నుంచి ఓ సినిమా వస్తుందంటే టాలీవుడ్‌లోనూ ఆ మూవీపై మంచి హైప్ ఉంటుంది.
తెలుగు హీరోలపై కన్నేసిన కన్నడ డైరెక్టర్లు.. టాలీవుడ్లోకి ఎంట్రీ ఇస్తోంది వీళ్లే!
చిన్న సినిమాల సెన్సేషన్.. కన్నడలో మరో హిట్.. తెలుగులో వస్తుందా?