Kangana Ranaut Indira Gandhi : బాలీవుడ్ నటి కంగనా రనౌత్ స్వీయ దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం 'ఎమర్సెన్సీ'. ఈ సినిమాలో కంగనా.. భారత మాజీ ప్రధాని ఇందిరా గాంధీ పాత్రలో నటించనున్నారు. తాజాగా నటి కంగనా.. స్వయంగా ఇందిరా గాంధీ ఎదురుగా కూర్చొని ఆమెతో ముచ్చటిస్తున్నట్లుగా ఓ ఫొటో బయటకు వచ్చింది. అయితే ఇది ఏఐ (ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్) టెక్నాలజీతో సాధ్యమైంది.
అయితే కంగనా సోమవారం దిల్లీలోని 'ప్రధానమంత్రి సంగ్రహాలయ'ను సందర్శించారు. ఈ సమయంలోనే ఆమె ఇందిరా గాంధీ, ప్రస్తుత ప్రధాని నరేంద్రమోదీ (ఏఐ ఇమేజ్)తో దిగిన ఫొటోను పోస్ట్ చేశారు. అయితే 'వీరాంగనా కీ మహాగాథ' పేరిట ఏర్పాటు చేసిన లైట్ అండ్ సౌండ్ షో లో ఈమె పాల్గొన్నారు. 'చరిత్రలోని అనేక అధ్యాయాలు ఈ షో ద్వారా నా కళ్ల ముందు కనిపించాయి. ప్రతి ఒక్కరూ కుటుంబంతోపాటు వచ్చి వినోదాన్ని పోందవచ్చు' అని పేర్కొన్నారు.
ఎమర్సెన్సీ సినిమా విషయానికొస్తే.. భారత మాజీ ప్రధాని ఇందిరా గాంధీ హయాంలో దేశంలోని ఎమర్జెన్సీ నాటి పరిస్థితులను ఆధారంగా చేసుకుని ఈ చిత్రం తెరకెక్కుతోంది. ఈ సినిమాతో 1975 నాటి ఎమర్జెన్సీ వాతావరణాన్ని దాదాపు 48 ఏళ్ల తర్వాత ప్రజలకు చూపే ప్రయత్నం చేస్తున్నారు కంగనా. ఇక జూన్‌లో రిలీజైన టీజర్‌కు మంచి స్పందన లభించింది. అయితే సినిమాను నవంబర్ 24న విడుదల చేస్తామని మొదట్లో మూవీయూనిట్ ప్రకటించింది. కానీ, కొన్ని కారణాల వల్ల విడుదల పోస్ట్‌పోన్ అయ్యింది. అయితే 2024 తొలి అర్ధభాగంలో రిలీజ్ అయ్యే ఛాన్స్ ఉన్నట్లు తెలుస్తోంది.
Emergency Movie Cast : ఈ చిత్రంలో కశ్మీర్ ఫైల్స్ ఫేమ్ అనుపమ్ ఖేర్ , మమతా చౌదరీ, విశాక్ నాయర్ కీలక పాత్రల్లో నటించారు. నటుడు శ్రేయస్ తల్పాడే భారత మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజ్‌పేయి పాత్ర పోషించారు. కాగా కంగనా ఇదివరకు 'మణికర్ణిక' అనే సినిమాకు దర్శకత్వం వహించగా తాజా ఎమర్జెన్సీ సినిమా రెండోది.
- " class="align-text-top noRightClick twitterSection" data="">
Chandramukhi 2 Song : 'చంద్రముఖి-2' నుంచి 'స్వాగతాంజలి'.. దేవకన్యలా కంగనా!
కంగనా 'ఎమర్జెన్సీ' టీజర్ విడుదల.. సినిమా రిలీజ్ డేట్ ఫిక్స్