ETV Bharat / entertainment

కావాలనే నా సినిమాలపై విష ప్రచారం చేయిస్తున్నారు.. ఇది ఆ మాఫియా పనే : కంగనా రనౌత్ - కంగనా రనౌత్​ మాఫియా కామెంట్స్

Kangana Ranaut Comments On Fake News : ప్రముఖ బాలీవుడ్​ నటి కంగనా రనౌత్ మళ్లీ వార్తల్లో నిలిచారు. తన సినిమాలను ఫ్లాప్​ అంటూ తప్పుడు ప్రచారం చేస్తున్నారంటూ మండిపడ్డారు. దీని వెనుక ఓ మాఫియా ముఠానే ఉందని ఆరోపించారు.

Kangana Ranaut Comments On Fake News
Kangana Ranaut Comments On Fake News
author img

By

Published : Aug 8, 2023, 9:03 PM IST

Kangana Ranaut Comments On Fake News : తన సినిమాల బాక్సాఫీస్ కలెక్షన్ల గురించి తప్పుడు ప్రచారం చేస్తున్నారని విరుచుకుపడ్డారు ప్రముఖ బాలీవుడ్​ నటి కంగనా రనౌత్. ఎప్పుడు ఏదో ఒక కారణంతో వార్తల్లో నిలిచే కంగనా.. తన సినిమాల గురించి తప్పుడు ప్రచారం చేస్తున్న వారిపై మండిపడ్డారు. దీని వెనుక మాఫియా ముఠానే ఉందంటూ తన ఇన్​స్టాగ్రామ్​ ఖాతా స్టోరీలో రాసుకొచ్చారు.

కంగనా తన చిత్రాలన్నీ బాక్సాఫీస్ వైఫల్యాలని చెప్పిన వార్తల ఫొటోలను కూడా షేర్ చేశారు. 'బాక్సాఫీస్ వద్ద రూ.150 కోట్లు వసూళ్లూ సాధించిన చిత్రాలను ఫ్లాప్స్ అని ప్రచారం చేస్తున్నారు. నా చిత్రాలన్నీ ఫ్లాప్​లు అని ప్రతి రోజూ 10 నుంచి 15 కథనాలు వెలువడుతున్నాయి. ఇతురుల పట్ల ఇంత దారుణంగా ఆలోచనలు ఎలా వస్తాయి. ఇతరులను చెడుగా చూపించటానికి రాత్రి పగలు అని తేడా లేకుండా ప్లాన్ చేస్తారా? దానికోసం సొంత ధనన్ని ఖర్చు చేస్తారా' అని కంగనా తీవ్ర ఆరోపణలు చేశారు.

Kangana Ranaut Comments On Fake News
కంగనా రనౌత్ ఇన్​స్టా స్టోరీ

2015లో కంగనా.. సన్నీడియోల్ కలిసి నటింటిన చిత్రం 'ఐ లవ్ న్యూ ఇయర్​' బాక్సాఫీస్ వద్ద అంతగా ఆడలేదు. ఈ చిత్రం తర్వాత ఆమె కెరీర్ అయిపోయిందని వార్తలు వచ్చాయి. అయితే, కంగనా మాత్రం ఆ ఆరోపణలను కొట్టిపారేసింది. సన్నీ డియోల్ నటించిన 'గదర్-2' చిత్రం బాక్సాఫీస్ వద్ద భారీ ఓపెనింగ్స్ రాబడుతుందని తెలిపారు. అలానే సన్నీ డియోల్​పై తనకు ఉన్న అభిమానాన్ని వ్యక్తం చేశారు. 'నాతో పని చేసే వారు నన్ను కలిసే ప్రతి ఒక్కరూ ఒకే మాట చెబుతారు. 'మేము నటులు, దర్శకులు ఇలా చాలా మందితో పని చేశాము. కానీ, మీరు చాలా ప్రతిభావంతులు, ప్రొఫెషనల్. కానీ, మీడియాలో మీ గురించి ఎందుకు అలా రాస్తారు. అలాంటి అభిప్రాయం ఎందుకు ఉంది' అని అడుగుతారు' అని కంగనా చెప్పుకొచ్చారు.

Kangana Ranaut Comments On Fake News
కంగనా రనౌత్ ఇన్​స్టా స్టోరీ

Kangana Chandramukhi First Look : ప్రస్తుతం కంగనా రనౌత్.. కోలీవుడ్​ నటుడు రాఘవ లారెన్స్ లీడ్​ రోల్​లో తెరకెక్కుతున్న 'చంద్రముఖి-2'లో చంద్రముఖిగా నటిస్తున్నారు. తమిళ స్టార్​ దర్శకుడు పి. వాసు ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు. ఇటీవల సినిమాలోని 'చంద్రముఖి' ఫస్ట్​ లుక్​ అంటూ మూవీ మేకర్స్​ ఓ అద్భుతమైన పోస్టర్​ను విడుదల చేశారు. రాజ నర్తకిగా మెరిసిపోతున్న కంగనా.. పట్టు చీరతో పాటు నడుముకు వడ్డాణం మెడలో హారం, నుడుటన పాపిటబిళ్ల.. ఇలా పైన నుంచి కిందవరకు ఆభరణాలను ధరించి కంగనా కనిపించారు. తదేకంగా చూస్తూ కనిపించిన కంగనా.. ఈ పోస్టర్​తో అందరి దృష్టిని ఆకర్షించారు.

కంగనా 'ఎమర్జెన్సీ' టీజర్ విడుదల.. సినిమా రిలీజ్ డేట్​ ఫిక్స్​

Kangana Ranaut Karan Johar :'రూ.250 కోట్ల సీరియల్​ చూసేందుకు జనాలు పిచ్చోళ్లు కారు'..అందుకే..

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.